Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమ్మాయిల ఫ్రెండ్‌షిప్.. అబ్బాయిల ఫ్రెండ్‌షిప్.. అసలు తేడా ఏంటి?

అమ్మాయిల ఫ్రెండ్‌షిప్.. అబ్బాయిల ఫ్రెండ్‌షిప్.. అసలు తేడా ఏంటి?

Big TV Live 2 weeks ago

Friendship Special: 'అమ్మాయిల ఫ్రెండ్‌షిప్ వేరు… అబ్బాయిల ఫ్రెండ్‌షిప్ వేరు' ఈ మాట మనం చాలాసార్లు వింటుంటాం. సోషల్ మీడియాలో కూడా దీనిపై మీమ్స్, జోక్స్, వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి కూడా .

కానీ నిజంగా ఈ రెండింటి మధ్య అంత పెద్ద తేడా ఉందా? లేక మనం ఊహించుకున్నంత మాత్రమేనా? ఈ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఆ విషయాన్నే కాస్త డీటైల్డ్ గా చూద్దాం.

అబ్బాయిల ఫ్రెండ్‌షిప్ అంటే ఎక్కువగా ఫన్, ఆటపట్టించడం, ఒకరినొకరు ట్రోల్ చేయడం, చిన్న చిన్న గొడవలు పడినా కాసేపటికే మళ్లీ కలిసిపోవడం లాంటివి గుర్తొస్తాయి. ఒక ఫ్రెండ్ కష్టంలో ఉన్నాడంటే బయటకు పెద్దగా ఎమోషన్ చూపించకపోయినా, అవసరం వచ్చినప్పుడు ముందుండి సాయం చేసేవాళ్లు కూడా వీళ్లే. “ఏమైంది రా?” అని ఎక్కువ అడగకపోయినా, పక్కనే నిలబడే మనస్తత్వం చాలా మంది అబ్బాయిల ఫ్రెండ్‌షిప్‌లో కనిపిస్తుంది.

ఎమోషనల్ బాండింగ్ కాస్త ఎక్కువ

మరోవైపు అమ్మాయిల ఫ్రెండ్‌షిప్‌లో ఎమోషనల్ బాండింగ్ కాస్త ఎక్కువగా ఉంటుంది. రోజూ మాట్లాడుకోవడం, చిన్న చిన్న విషయాలు కూడా షేర్ చేసుకోవడం, ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకోవడం, పుట్టినరోజులు, స్పెషల్ డేస్ గుర్తు పెట్టుకుని సెలబ్రేట్ చేసుకోవడం ఎక్కువగా కనిపిస్తుంది. సంతోషం అయినా, బాధ అయినా ముందుగా చెప్పుకునేది బెస్ట్ ఫ్రెండ్‌కే అని చెప్పక్కర్లేదు.

అయితే సోషల్ మీడియాలో కనిపించే ప్రతి మీమ్ నిజం కాదన్నది గుర్తుపెట్టుకోవాలి.. “అమ్మాయిలు చిన్న విషయానికే గొడవపడతారు”,”అబ్బాయిలు ఎప్పుడూ సీరియస్‌గా ఉండరు” అనే కామెంట్లు వినిపిస్తుంటాయి కాని వాటిని సీరియస్ గా జనరలైజ్ చేయొద్దు.ఎందుకంటే ఒక్కొకరు ఒక్కోలా ఉంటారు.అందరి ఫ్రెండ్‌షిప్‌ను ఒకేలా అనుకోవడం కరెక్ట్ కాదు.

ఒక్క ఫోన్ కాల్‌తో మళ్లీ

అబ్బాయిల ఫ్రెండ్స్ మధ్య ఎక్కువ మాటలు లేకపోయినా బంధం బలంగా ఉంటుంది. నెలల కొద్ది మాట్లాడకపోయినా ఒక్క ఫోన్ కాల్‌తో మళ్లీ ఆ ఫ్రెండ్ షిప్ కంటిన్యూ అయిపోతుంది. మరోవైపు అమ్మాయిలు అలా కాదు.రెగ్యులర్‌గా టచ్‌లో ఉండటానికి ఇష్టపడతారు. ఒకరి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి వారిలో ఎక్కువగా ఉంటుంది.

ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే… అబ్బాయిలు ఎక్కువగా కలిసి బయట తిరగడం, ట్రిప్స్ ప్లాన్ చేయడం, క్రికెట్ లేదా ఇతర యాక్టివిటీస్‌లో టైమ్ గడపడం ఇష్టపడతారు. అమ్మాయిలు అయితే కాఫీ డేట్స్, షాపింగ్, లాంగ్ చాట్స్, ఫోటోలు, సెలబ్రేషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ తేడాలు కూడా నెమ్మదిగా తగ్గిపోతున్నాయి. ఎందుకంటే కొత్త తరం ఫ్రెండ్‌షిప్‌కు కొత్త అర్థం చెబుతుంది మరి.

ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా ట్రెక్కింగ్, బైక్ ట్రిప్స్ చేస్తున్నారు. అబ్బాయిలు కూడా తమ భావాలను ఓపెన్‌గా చెప్పుకుంటున్నారు. అంటే ఫ్రెండ్‌షిప్‌లో జెండర్ కంటే వ్యక్తిత్వమే ముఖ్యమని కొత్త తరం నిరూపిస్తోందన్న మాట.

ఫ్రెండ్‌షిప్‌కు ఎలాంటి ఫార్ములా ఉండదు

నిజానికి మంచి ఫ్రెండ్‌షిప్‌కు ఎలాంటి ఫార్ములా ఉండదు. నమ్మకం, గౌరవం, నిజాయితీ, ఒకరికి ఒకరు తోడుగా ఉండే మనసు ఉంటే చాలు. అది అమ్మాయిల ఫ్రెండ్‌షిప్ అయినా, అబ్బాయిల ఫ్రెండ్‌షిప్ అయినా… ఆ బంధం జీవితాంతం గుర్తుండిపోతుందన్నది గుర్తుంచుకోవాలి.

చివరగా చెప్పాలంటే… అమ్మాయిల ఫ్రెండ్‌షిప్‌లో ఎమోషన్స్ ఎక్కువగా కనిపించొచ్చు. అబ్బాయిల ఫ్రెండ్‌షిప్‌లో ఎక్స్‌ప్రెషన్స్ తక్కువగా కనిపించొచ్చు. కానీ ఇద్దరిలోనూ కామన్‌గా ఉండేది ఒక్కటే… నిజమైన స్నేహం. కష్టాల్లో చేయి అందించే వ్యక్తే అసలైన ఫ్రెండ్. ఆ బంధానికి అమ్మాయి, అబ్బాయి అనే తేడా ఉండదు. అందుకే ఫ్రెండ్‌షిప్ విలువను కొలవాల్సింది జెండర్‌తో కాదు… మనసుతో !గుర్తు పెట్టుకుంటారు కదూ !

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live