Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమ్మాయిల కోసం అంకుల్ యాప్. ఈ సిరీస్ పెద్దలకు మాత్రమే భయ్యా

అమ్మాయిల కోసం అంకుల్ యాప్. ఈ సిరీస్ పెద్దలకు మాత్రమే భయ్యా

Big TV Live 1 month ago

Korean Crime Thriller: స్కూల్లు, కాలేజీలలో ఫీజుల మోత ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మిడిల్ క్లాస్ వాళ్ళే ఆ ఫీజులు చూసి గుండెలు బాదుకుంటున్నారు.

ఇక పేద వాళ్ళ సంగతి ఇంకా దారుణం. అయితే ఫీజులు కట్టడం కోసం పిల్లలే అందులోనూ ఆడపిల్లలు చేయకూడని పనులు చేస్తే… అదే ఈరోజు మన మూవీ సజెషన్ లో చెప్పుకోబోయే స్టోరీ. ‘ఎక్స్‌ట్రాకరికులర్’ (Extracurricular) అనే టైటిల్ తొ రూపొందిన ఈ కొరియన్ యూత్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? తెలుగులో ఉందా ? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ సిరీస్ ఓ టాపర్ విద్యార్థి తన జీవితంలో ఎదురైన ఆర్థిక సమస్యల వల్ల ఎంత దారుణమైన నేర ప్రపంచంలోకి అడుగుపెట్టి, చివరికి తనను తాను నాశనం చేసుకున్నాడనే ఉత్కంఠభరితమైన కథ చుట్టూ తిరుగుతుంది. ఓ జి-సూ (కిమ్ డాంగ్-హీ) క్లాస్‌లో అందరికంటే టాపర్, చాలా సైలెంట్, మంచి అబ్బాయి. అయితే అతని తల్లిదండ్రులు అతడిని వదిలేసి వెళ్ళిపోవడంతో, యూనివర్సిటీ ఫీజు, బతుకు ఖర్చుల కోసం అతను ఒక సీక్రెట్ వ్యాపారం నడుపుతుంటాడు. ఆ వ్యాపారం ఏంటంటే… అక్రమ డేటింగ్ సర్వీస్ నడిపే అమ్మాయిలకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం.

మాజీ మిలిటరీ అధికారి సాయంతో జి-సూ ‘అంకుల్’ అని పిలుచుకునే యాప్‌ ను బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండి నడిపిస్తూ భారీగా డబ్బు సంపాదిస్తాడు. ఇక్కడే కథ అడ్డం తిరుగుతుంది. జి-సూ క్లాస్‌లోనే చదివే ధనిక, పొగరుబోతు అమ్మాయి బే గ్యు-రి. ఆమెకి అనుకోకుండా జి-సూ ఫోన్ దొరుకుతుంది. ఆమె అతడిని బ్లాక్‌మెయిల్ చేసి, ఆ వ్యాపారంలో పార్ట్‌నర్‌గా చేరుతుంది. ఆమె ప్రవేశంతో వీరి బిజినెస్ మరింత పెద్దదవుతుంది. కానీ రిస్క్ కూడా అలాగే పెరిగిపోతుంది.

ఇదే క్లాస్‌లోనే చదివే మరో అమ్మాయి మిన్-హీ కూడా అదే యాప్‌ లో పని చేస్తుంటుంది. ఆమె బాయ్‌ఫ్రెండ్ ఒక పెద్ద కాలేజీ గ్యాంగ్‌స్టర్. ఒకానొక సందర్భంలో మిన్-హీకి ప్రమాదం జరగడంతో, ఈ గ్యాంగ్‌స్టర్ గ్యాంగ్ అంతా కలిసి జి-సూ నెట్‌వర్క్‌ను వెతకడం స్టార్ట్ చేస్తారు. మరోవైపు స్కూల్ పోలీస్ ఆఫీసర్ కూడా ఈ కేసును క్లోజ్‌గా ఫాలో అవుతుంటుంది. చివరికి ఆ గ్యాంగ్‌స్టర్లకు, జి-సూ కి మధ్య జరిగే నెత్తుటి యుద్ధంలో జి-సూ కి సాయం చేసే సెక్యూరిటీ అంకుల్ చనిపోతాడు. మరి ఆ తరువాత జి-సూకి ఏం చేశాడు ? జి-సూ, గ్యు-రి ఇద్దరి పరిస్థితి ఏమైంది ? క్లైమాక్స్ లో కథ ఎలాంటి ట్విస్ట్ తో ముగిసింది ? అన్నది స్టోరీ. 10 ఎపిసోడ్‌ల ఈ సిరీస్ ప్రస్తుతం Netflixలో అందుబాటులో ఉంది. కానీ తెలుగులో లేదు.

కారు ప్రమాదం… కళ్ళు తెరిచి చూస్తే మరో ప్రపంచంలో… మైండ్ బెండింగ్ సై-ఫై సిరీస్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live