Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అందుకే ఇండస్ట్రీకి దూరమయ్యా.. 15 ఏళ్లు నరకం చూశా -యాక్టర్ బాలాజీ!

అందుకే ఇండస్ట్రీకి దూరమయ్యా.. 15 ఏళ్లు నరకం చూశా -యాక్టర్ బాలాజీ!

Big TV Live 1 week ago

Actor Balaji: చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి.. నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న బాలాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అద్భుతమైన నటనతో, విలనిజంతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విషయాలను పంచుకున్నారు.

సీరియల్స్ వల్లే ఇండస్ట్రీకి దూరం..

ఒకప్పుడు మంచి మంచి విలన్ పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలాజీ సడన్గా ఇండస్ట్రీకి దూరం అవడంపై క్లారిటీ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అయిన సమయంలో జెమినీ, ఈటీవీ వంటి ఛానల్స్ అప్పుడే మొదలయ్యాయి. ఇక నేను అవకాశాల కోసం ఈటీవీని సంప్రదించగా.. సీరియల్స్ లో అవకాశాలు ఇచ్చారు. అలా తెలుగు, తమిళ్ కలుపుకొని దాదాపు 60కి పైగా సీరియల్స్ లో నటించాను. నేను సీరియల్స్ లో నటిస్తున్నప్పుడు.. సినిమాల కోసం ఎవరైనా సంప్రదించాలి అనుకున్నప్పుడు.. ఆయన సీరియల్స్ లో బిజీ అని చెప్పడం, ఆ స్థానంలో ఇంకొకరిని తీసుకోవడం అలా జరిగిపోయింది.. అలా నేను సినిమా ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది అంటూ బాలాజీ తెలిపారు.

హాలీవుడ్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశా – బాలాజీ

ఇదే ఇంటర్వ్యూలో బాలాజీ మాట్లాడుతూ..” నేను ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే వచ్చాను. ముఖ్యంగా ఎక్కడా కూడా గ్యాప్ తీసుకోలేదు. మధ్య మధ్యలో చిన్న గ్యాప్స్ వచ్చినప్పటికీ, మళ్లీ సీరియల్స్ లో నటిస్తూనే ఉన్నాను. మధ్యలో ఒక నాలుగేళ్లు అమెరికాలో ఉన్నాను. రెండు హాలీవుడ్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. జెమినీలో కొన్ని సీరియల్స్ ను నిర్మించాను. అలాగే దర్శకత్వం కూడా వహించాను. ఆ తర్వాత వజ్రం అనే ఒక మ్యాగజైన్ పెట్టాను. ఆ మ్యాగ్జైన్ ఒక ఏడాది పాటు నడిపాను.

రూ.25 కోట్లు నష్టపోయాను – బాలాజీ

నష్టపోయింది మాత్రం కేవలం రెండు సినిమాలతోనే.. నేను రెండు చిత్రాలను నిర్మించడం వల్ల సుమారుగా ఇప్పటి ధరలు బట్టి చూస్తే రూ.25 కోట్ల వరకు నష్టపోయాను అంటూ తెలిపారు. అయితే పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందడానికి దాదాపు 15 సంవత్సరాలు పట్టింది. ఆ సమయంలో ఎంతో కష్టపడ్డాము. ముఖ్యంగా ఇండస్ట్రీలో 15 సంవత్సరాల పాటు సంపాదిస్తే.. పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందడానికి మళ్లీ 15 ఏళ్ల సమయం పట్టింది. అలా 30 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డాము.. ప్రస్తుతానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు అంటూ బాలాజీ తెలిపారు.

మేనకోడలితో పెళ్లి.. హీరోగా కొడుకు ప్రయాణం..

ఇక బాలాజీ తన వైవాహిక జీవితం, పిల్లల గురించి మాట్లాడుతూ.. నేను పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకున్నాను. నా మేనకోడలే ఏరికోరి మరీ నన్ను వివాహం చేసుకున్నారు. మాకు ఒక కొడుకు. డిజిటల్ మార్కెటింగ్ లో ఉద్యోగం చేశారు. రెండు సినిమాలలో హీరోగా నటించారు కానీ అవి ఇంకా రిలీజ్ కాలేదు. మా కొడుకు ఇప్పుడు ఈటీవీ ప్లస్ లో ప్రసారమవుతున్న తులసి అనే సీరియల్ లో హీరోగా నటిస్తున్నారు. ఇక నా కొడుకుకి ఒక కొడుకు ఉన్నాడు. వాడు చాలా హైపర్ యాక్టివ్ అంటూ తన ఫ్యామిలీ విశేషాలను కూడా పంచుకున్నారు బాలాజీ.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live