Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అంతరిక్షంలో ప్రతీకార ప్రయాణం. రెండు ఓటీటీల్లోకి డీసీ కొత్త సూపర్‌గర్ల్ మూవీ

అంతరిక్షంలో ప్రతీకార ప్రయాణం. రెండు ఓటీటీల్లోకి డీసీ కొత్త సూపర్‌గర్ల్ మూవీ

Big TV Live 2 weeks ago

Supergirl movie: సూపర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్, వండర్ ఉమెన్ లాంటి సూపర్ హీరోల సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. అదే DC యూనివర్స్ నుంచి కొత్త కథ వస్తుందంటే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు.

అలాంటి అంచనాల మధ్య వచ్చిన సినిమా Supergirl. ట్రైలర్లు, విజువల్స్, స్టార్ కాస్ట్‌తో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. థియేటర్లలో మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో విడుదలైన కేవలం నెల రోజుల్లోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోకి వచ్చేసింది. మరి ఈ సినిమాలో అసలు కథ ఏంటి ? ఎందుకు ఇంత త్వరగా డిజిటల్ రిలీజ్ చేశారు ? ఇప్పుడు తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

క్రిప్టాన్ గ్రహం నాశనమైన తర్వాత చాలా మందిలాగే కారా జోర్-ఎల్ జీవితమూ పూర్తిగా మారిపోతుంది. కానీ సూపర్‌మ్యాన్‌లా భూమిపై పెరగకుండా.. ఆమె ఒక అంతరిక్ష శకలంపైనే ఒంటరిగా పెరుగుతుంది. చిన్నప్పటి నుంచే ఒంటరితనం, కష్టాలు, బాధల మధ్య జీవించిన కారా.. తోడుగా ఉన్న పెంపుడు కుక్క క్రిప్టోనే తన ప్రపంచంగా భావిస్తుంది.

అయితే ఒక రోజు క్రూరమైన శత్రువు క్రెమ్ ఆఫ్ ది ఎల్లో హిల్స్ చేసిన దాడిలో క్రిప్టో తీవ్రంగా గాయపడుతుంది. ఆ సంఘటన కారా జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్న ఆమె.. రూతీ అనే యువతితో కలిసి విశ్వమంతా చుట్టే ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది.

ఈ ప్రయాణంలో ఊహించని శత్రువులు ఎదురవుతారు. కొత్త గ్రహాలు, కొత్త ప్రమాదాలు, అనేక సవాళ్లు ఆమె ముందుకొస్తాయి. కానీ ఇది కేవలం ప్రతీకారం కోసం చేసే పోరాటమా ? లేక తన అసలు లక్ష్యాన్ని తెలుసుకునే ప్రయాణమా ? కారా తీసుకున్న నిర్ణయాలు ఆమె జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పాయి ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. క్లైమాక్స్ వరకు కథలోని కీలక ట్విస్టులను రివీల్ చేయకుండా దర్శకుడు ఆసక్తిని కొనసాగించే ప్రయత్నం చేశాడు.

ఓటీటీలో 48 గంటలే టైమ్

ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Video, Apple TV వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం ఇది సాధారణ సబ్‌స్క్రిప్షన్‌లో స్ట్రీమింగ్ కావడం లేదు. రెంట్ లేదా బై పద్ధతిలో మాత్రమే చూడాలి. Amazon Prime Videoలో ఈ సినిమాను కొనాలంటే 24.99 డాలర్లు, రెంట్‌కు తీసుకోవాలంటే 19.99 డాలర్లు చెల్లించాలి. రెంట్ తీసుకున్న తర్వాత ప్లే చేసిన సమయం నుంచి 48 గంటల్లో సినిమా పూర్తి చేయాల్సి ఉంటుంది. డిజిటల్ వెర్షన్ కొనుగోలు చేసిన వారికి 90 నిమిషాలకు పైగా మేకింగ్ వీడియోలు, డిలీట్ చేసిన సీన్లు, క్రిప్టోపై రూపొందించిన ప్రత్యేక యానిమేటెడ్ షార్ట్ కూడా అందిస్తున్నారు.

థియేటర్లలో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోవడంతో మేకర్స్ కేవలం 32 రోజులకే డిజిటల్ రిలీజ్ చేశారు. దాదాపు 125 మిలియన్ డాలర్ల బడ్జెట్‌ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసింది. క్రెయిగ్ గిల్లెస్పీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డీసీ స్టూడియోస్ అధినేత జేమ్స్ గన్ నిర్మించగా, మిల్లీ అల్కాక్ సూపర్‌గర్ల్‌గా నటించారు. అలాగే జేసన్ మోమోవా లోబో పాత్రలో కనిపించడం కూడా అభిమానులకు మరో ప్రత్యేక ఆకర్షణ. డీసీ యూనివర్స్ సినిమాలు, స్పేస్ అడ్వెంచర్లు, సూపర్ హీరో కథలు ఇష్టపడేవారు ఓటీటీలో ఈ సినిమాను ఒకసారి చూసేయొచ్చు. థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా.. విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, కారా జోర్-ఎల్ ప్రయాణం మాత్రం అభిమానులను ఆకట్టుకునేలా ఉంటాయి.

థియేటర్లలో ఆడియెన్స్ ను ఏడిపించిన న్యూ ఏజ్ లవ్ స్టోరీ… ఒకరోజు ముందే ఓటీటీలోకి తెలుగులో

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live