Horror Movie OTT : హర్రర్ సినిమాలు అంటే చెవి కోసుకుని ఓటీటీ మూవీ లవర్స్ ఎంతోమంది ఉన్నారు. అందులోనూ ఈ జానర్లో కొరియన్ సినిమాలు అంటే ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఈరోజు మన మూవీ సజెషన్ కూడా అలాంటిదే. మరి ఆ మూవీ పేరేంటి? కే-డ్రామా హార్రర్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే మూవీ లవర్స్ ఈ సినిమాను ఎక్కడ చూడొచ్చు ? అనే వివరాలను వివరంగా తెలుసుకుందాం పదండి.
రెండు ఓటీటీలలో అందుబాటులో
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు Noise (2024). ఇదొక సౌత్ కొరియన్ వినూత్న హారర్ థ్రిల్లర్. అపార్ట్‌మెంట్లలో నివసించే మనుషుల మధ్య శబ్దాల వల్ల వచ్చే గొడవలు ఎలా ఉంటాయో మనందరికి తెలుసు. అయితే వాటిని బేస్ చేసుకుని ఒక అతీంద్రియ శక్తి సృష్టించే భయం చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. కాగా ఈ సినిమా ప్రస్తుతం రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ఈ సినిమా JioHotstar ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే మరో టాప్ ఓటీటీ Amazon Prime Video లో కూడా ఈ మూవీని వీక్షించొచ్చు.
సైకలాజికల్ హారర్, సౌండ్ ఎఫెక్ట్స్‌తో భయపెట్టే సినిమాలు ఇష్టపడేవారు ఈ మూవీని అస్సలు మిస్ అవ్వొద్దు. సెప్టెంబర్ 2024లో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF)లో దీన్ని ప్రీమియర్ చేశారు. ఈ సినిమాకు కిమ్ సూ-జిన్ దర్శకత్వం వహించగా, జూ-యంగ్‌గా లీ సున్-బిన్, కి-హూన్‌గా కిమ్ మిన్-సెయోక్ మెయిన్ లీడ్స్ గా నటించారు. ఈ మూవీని చూశాక అపార్ట్మెంట్ లో బతకడం అంటే ఆలోచనకే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.
Also Read : సాక్ష్యాలు ఉన్నా సమాధానం దొరకని ప్రశ్న… అసలైన హంతకుడు ఆ వింత రాక్షసేనా?
కథలోకి వెళ్తే…
జూ-యంగ్ (లీ సున్-బిన్), జూ-హీ (హన్ సు-ఆ) అనే ఇద్దరు సోదరీమణులు ఉంటారు స్టోరీలో. వాళ్ళ తల్లిదండ్రులు చనిపోవడంతో ఇద్దరూ కలిసి కొత్త అపార్ట్‌మెంట్ లోకి మారుతారు. అయితే ఆ అపార్ట్‌మెంట్ పై అంతస్తు నుండి వింత వింత శబ్దాలు వినిపిస్తాయి. ఓరోజు అకస్మాత్తుగా జూ-హీ మాయమవుతుంది. ఆమె ఎలా మాయం అయ్యిందో కనీసం హింట్ కూడా దొరకదు. సిస్టర్స్ లో మరో అమ్మాయి అయిన జూ-యంగ్ కి వినికిడి లోపం ఉంటుంది. అయినా సరే తన సోదరి ప్రియుడు కి-హూన్ సహాయంతో తప్పిపోయిన సిస్టర్ ను వెతకడం ప్రారంభిస్తుంది. ఆ వింత శబ్దాలే తన సోదరి అదృశ్యానికి మూలమని గ్రహించడానికి ఆమెకు ఎక్కువ టైం పట్టదు.
ఓవైపు తన సోదరి ఎలా మిస్ అయ్యిందనే విషయాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న జూ-యంగ్ కు ఇబ్బందులు తలెత్తుతాయి. పొరుగువాడు ఆమె శబ్దం చేస్తోందని పదే పదే గొడవకు దిగుతాడు. నిజం ఏంటంటే ఆ శబ్దాలు ఆ అమ్మాయి చేసేవి కావు. అలా సోదరిని వెతుకుతున్న ఆమెకు ఆ అపార్ట్‌మెంట్ బేస్‌మెంట్ లో పేరుకుపోయిన చెత్త కుప్పల వెనుక ఒక భయంకరమైన సీక్రెట్ దాగి ఉందని తెలుసుకుంటుంది. ఆ సీక్రెట్ ఏంటి ? ఆ అపార్ట్మెంట్ లో మనుషుల మధ్య గొడవలు పెడుతున్న అదృశ్య శక్తి ఏంటి? అనేది తెలియాలంటే మూవీని వీక్షించాల్సిందే.

