Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అత్తాకోడళ్ల మధ్య ప్రేమ పెరగాలంటే ఏం చేయాలి?

అత్తాకోడళ్ల మధ్య ప్రేమ పెరగాలంటే ఏం చేయాలి?

Big TV Live 3 weeks ago

Relationship tips : 'అత్తలేని కోడలుత్తమురాలు ..కోడలు లేని అత్త గుణవంతురాలు'.. తెగ పాపులర్ అయిన ఈ ఒక్క సామెత చెబుతుంది అత్తా కోడళ్ళ మధ్య ఎలాంటి యుద్దాలు జరుగుతాయో.

ముఖ్యంగా కోడలు తన ఇంటికి వచ్చిందని కాబట్టి, తను చెప్పినట్టుగానే వినాలి అంటూ అత్తలు అజమాయిషీ చేయడం మనం ఎక్కువ తరచుగా వింటూ, చూస్తూ ఉంటాం కూడా. దీని వల్ల అత్తలంటేనే కోడళ్ళకి ఒక టెర్రర్ లాంటి ఫీల్ కలగడం మొదలవుతుంది. మరి కోడళ్ళు అత్తల మాట వినేట్టుగా ఎలా సున్నితంగా డీల్ చేయాలో, కోడళ్ళకి అత్తలు అమ్మగా ఎలా మారాలో తెలుసుకుందాం రండి.

కోడలిని కూతురిలా రిసీవ్ చేసుకోండి!

మొదటగా మీ ఇంటికి వచ్చిన కోడలిని కోడలిగా చూడటం మానేయండి. ఎందుకంటే మిమ్మల్ని ఒక తల్లిలా భావించాలని, గౌరవం ఇవ్వాలని కోరుకుంటారు కాబట్టి తను కూడా మీకు మరో కూతురు అని అనుకోండి. అలా అనుకున్నప్పుడే ఆమె మీద మీకు అజమాయిషీ చేయాలన్న ఆలోచన మీ మనసులో నుండి పోతుంది. మాములుగా మీ ఇంట్లో మీ కూతురు ఏదైనా పని చేయకున్నా, లేట్ గా లేచినా ఎంత లైట్ గా తీసుకుంటారో మీ కోడలి విషయంలో కూడా అలాగే బి హేవ్ చేయండి. ఎందుకంటే వచ్చిన కొత్తలో మీ ఇంటి వాతావరణం అంత త్వరగా అలవాటు కాదు కాబట్టి కాస్త సమయం ఇవ్వడం మంచింది. అలా కాస్త మీరు చూసి చూడనట్టు వదిలేస్తే ఆ తర్వాత మిమ్మల్ని ఎంత ప్రేమగా చూస్తుందో మీకే తెలుస్తుంది.

తప్పు చేస్తే ‘క్లాస్’ వద్దు.. ప్రేమగా ‘చెప్పండి

ఇక తప్పుల విషయానికి వస్తే.. మీరు కోడలిగా కొత్త ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఎన్ని తప్పులు చేయలేదు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సో… తప్పులు చేయడం మానవ సహజం. కాబట్టి పప్పులో ఉప్పు ఎక్కువైందనో, కూరలో కారం ఎక్కువైందనో తప్పులు తొవ్వకుండా మెల్లిగా, నిదానంగా చెప్పే ప్రయత్నం చేయండి. నేను కూడా ఇలాగే చేశాను, ముందు ముందు సరిగ్గా అలవాటు అవుతుందని ప్రేమగా చెప్పి చూడండి. అలా కనుక మీరు మీ కోడలిని వెనకేసుకొస్తే మీ మీద కోడలికి వెయ్యి రెట్ల ప్రేమ పెరగడం ఖాయం.

ఆర్డర్’ వేయకండి.. ‘బాధ్యత’ను గుర్తు చేయండి

ఇక వాళ్ళింటి ఆచారాలకి, మీ ఇంటి ఆచారాలకి చాలా తేడా ఉండొచ్చు. అందువల్ల మీ ఇంటి ఆచార, వ్యవహారాలు ఆమెకి అర్థం కావడానికి సమయం పడుతుంది. కాబట్టి దాన్ని అలాగే చేయాలి, దీన్ని ఇలాగే చేయాలి అంటూ ఆర్డర్స్ పాస్ చేయకుండా వాటి విలువని, విశిష్టతని జాగ్రత్తగా వివరించండి. కొత్త కోడలిగా అవన్నీ మీరు ఎలా తెలుసుకున్నారో మనసు విప్పి చెప్పండి. ఇక ముందు ముందు నువ్వే చెయ్యాలి అన్న బాధ్యతని వారికి గుర్తు చేస్తే వాళ్లకిస్తున్న విలువేంటో అర్థమవుతుంది.

also read : 'కర' రివ్యూ.. ధనుష్ ఖాతాలో మరో హిట్ పడ్డట్టేనా?

డ్రెస్సింగ్ విషయంలో ‘నో’ కామెంట్స్

ఇక ఇప్పటి కాలం అమ్మాయిలు చీరలని తక్కువ ధరిస్తూ ఉంటారు. ఆఫీసుల్లో, చేస్తున్న పనులల్లో సౌకర్యవంతంగా ఉండేందుకు వారికి నచ్చిన బట్టలు వేసుకునేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటివి మీ దృష్టిలో పడితే వెంటనే ఒంటికాలిపై లేవకండి. మీరు గనుక ఫైర్ అయ్యారంటే మా బంధం అంటుకోవడం ఖాయం. కాబట్టి మీకు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ తో ఏమైనా ఇబ్బందిగా ఉంటే నలుగురి మధ్యలో కాకుండా ఒంటరిగా ఉన్నప్పుడు ప్రేమగా నచ్చ చెప్పండి. మీరు కూడా వాళ్లకి ఏం సౌకర్యంగా ఉంటుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.

పోలిక వద్దే వద్దు

వాళ్ళ కోడలు అలా చేస్తుంది, వీళ్ళ కోడలు ఇలా చేస్తుంది అంటూ పక్కవారితో పోల్చడం ఆపండి. ఎందుకంటే ఒకరిలా ఇంకొకరు ఎప్పుడు చేయలేదు, ఎవరి స్టైల్ వారికుంటుంది. అలా గనుక మరొకరితో పోలిస్తే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గి మనసు విరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీ కోడలిలో ఏదైనా టాలెంట్ ని పసిగట్టి దాన్ని మెచ్చుకోండి. ఇలా కూడా చేయొచ్చేమో అని సలహా ఇవ్వండి. అదే వాళ్లకి మాంచి బూస్టప్ ఇస్తుంది.

ప్రైవసీ ముఖ్యం బిగిలు

ఇక ప్రస్తుత కాలంలో కపుల్స్ ప్రైవసీ కోరుకోవడం సహజం అయిపొయింది. సో.. వాళ్ళమధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ప్రయత్నం చేయకండి. మీకు చెప్పకుండా ఎటైనా వెళ్తే నాకు చెప్పలేదు అని బుంగమూతి పెట్టకండి. మన పిల్లలే కదా సర్దుకుపోయే ప్రయత్నం చేయండి. ఏమో వాళ్ళే వచ్చి మీకు ఎక్కడికెళ్ళారో చెబుతారేమో.

పుట్టింటి వారిని తక్కువ చేయొద్దు

ఇక అన్నింటి కన్నా ముఖ్యం వాళ్ళ అమ్మా నాన్నలని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ముందు అవమానపరచకండి. ఇదే నేర్పించారా, అలాగే ఉండమన్నారా అంటూ సూటి పోటి మాటలు ఆపేయండి. మీరు వాళ్లకి గౌరవం ఇస్తేనే తను మీకు ఆ గౌరవాన్ని తిరిగి ఇస్తుంది.

సో… ఇకనైనా కోడలికి ఒక కూతురిలా భావించండి. మీ బంధాన్ని ఆనందమయం చేసుకోండి!

also read :చూడటానికి సాఫ్ట్.. కానీ మాటల్లో ఫైర్! కరిష్మా కపూర్ నెగెటివ్ వీడియో వైరల్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live