Stop AutoPay: ప్రస్తుతం చాలా వరకూ ఓటీటీలు, యాప్స్ ఆటో-పే (Auto-pay) సబ్ స్క్రిప్షన్లను తప్పనిసరి చేస్తున్నాయి. దీంతో అవసరమున్నా లేకున్నా ప్లాన్ ముగిసేసరికి..
ఆటోమేటిగ్గా ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతున్నాయి. ఫలితంగా అవసరం లేకపోయినా వాటిని వినియోగించాల్సి వస్తోంది. అయితే ఈ ఆటో పే సబ్ స్క్రిప్షన్లను నిలిపివేయగలిగితే అనవసరపు ఖర్చులను కొద్దిమేర ఆదా చేసుకోవచ్చు. ఇందుకోసం ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులు ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు చూద్దాం.
ఆండ్రాయిడ్ ఫోన్
ఆండ్రాయిడ్ వినియోగదారులు తీసుకున్న ఆటో పే సబ్ స్క్రిప్షన్లను.. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా తొలగించుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఫోన్‌లో 'గూగుల్ ప్లే స్టోర్' (Google Play Store) యాప్‌ను ఓపెన్ చేయాలి. కుడివైపు పై భాగంలో ఉన్న ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. అందులో 'పేమెంట్స్ అండ్ సబ్ స్క్రిప్షన్స్' అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకొని.. అక్కడ సబ్ స్క్రిప్షన్స్ అనే బటన్ పై క్లిక్ చేయాలి. అనంతరం మీరు రద్దు చేయాలనుకుంటున్న యాప్ లేదా సర్వీస్‌ను సెలెక్ట్ చేసుకొని.. కింద ఉన్న క్యాన్సిల్ సబ్ స్క్రిప్షన్ (Cancel subscription)ను ఎంచుకోవాలి. అక్కడ అడిగిన వివరాలను నమోదు చేస్తే ఆటో-పే ఆగిపోతుంది.
ఐఫోన్ యూజర్లు అయితే..
యాపిల్ యూజర్లు తమ ఐఫోన్ సెట్టింగ్స్ ద్వారా సబ్‌స్క్రిప్షన్‌లను నిలిపి వేయవచ్చు. ముందుగా ఫోన్‌లోని 'సెట్టింగ్స్' (Settings) యాప్‌లోకి వెళ్లాలి. పైన ఉన్న మీ యాపిల్ ఐడీ (మీ పేరు) పై క్లిక్ చేయాలి. అక్కడ ఉన్న 'సబ్ స్క్రిప్షన్స్' (Subscriptions) అనే ఆప్షన్‌ను ప్రెస్ చేస్తే.. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న సబ్‌స్క్రిప్షన్‌ల జాబితా కనిపిస్తుంది. అందులో మీకు అవసరం లేదని భావిస్తున్న దానిపై క్లిక్ చేయడం ద్వారా ఆటో పేను నిలిపివేయవచ్చు.
Jagan - Vijay: జగన్ వ్యూహం.. విజయ్ విజయం, అసలు మేటర్ ఇదా!
యూపీఐ యాప్‌ల ద్వారా..
ఒకవేళ మీరు నేరుగా యూపీఐ (UPI) యాప్‌లలో ఆటో-పే సెట్ చేసి ఉంటే ఈ స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. ఫోన్ పే అయితే అందులోని ప్రొఫైల్ పిక్చర్స్ లోకి వెళ్లి పేమెంట్ సెట్టింగ్స్ క్లిక్ చేసి అక్కడ ఉన్న ఆటోపే ఆప్షన్ ను ఎంచుకోవాలి. అక్కడ సబ్ స్క్రిప్షన్ ను డిలీట్ లేదా పాస్ చేయవచ్చు. ఒకవేళ గూగుల్ పే అయితే ప్రొఫైల్ ఐకాన్ > సెట్టింగ్స్ > పేమెంట్స్ మెథడ్స్ > ఆటో పేలో చెక్ చేయండి. పేటీయం యూజర్లు.. ప్రొఫైల్ సెక్షన్ > యూపీఐ & పేమెంట్ సెట్టింగ్స్ > యూపీఐ ఆటోమేటిక్ పేమెంట్స్ లో మార్పులు చేయవచ్చు. తద్వారా మీ ప్రమేయం లేకుండా జరిగే లావాదేవీలను నియంత్రించవచ్చు.

