Babar Azam : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం ( Babar Azam) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ వయసులోనే పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన బాబర్ ఆజం, ఎన్నో విజయాలను కూడా అందించాడు.
అయితే ఏడాది కాలంగా బాబర్ ఆజం పెద్దగా పర్ఫామెన్స్ చేయడం లేదు. దీంతో కెప్టెన్సీ తో పాటు జట్టులో స్థానం కూడా కోల్పోయాడు. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటులో ( Pakistan Super League 2026 Tournament) కొనసాగుతున్న బాబర్ ఆజాం.. అద్భుతంగా రాణిస్తున్నాడు. అయితే అలాంటి బాబర్ ఆజం కు సంబంధించిన వివాదాస్పద పోస్టు వైరల్ గా మారింది. బాబర్ ఆజంను అమెరికాకు చెందిన పోలీసులు ఉచితక బాదినట్లు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ట్రంప్ పార్టీలో కాల్పులు జరిపినందుకు గాను బాబర్ ను పోలీసులు కొట్టినట్లు కొంతమంది దారుణంగా పోస్టులు పెట్టి రచ్చ చేస్తున్నారు. దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.
బాబర్ ఆజంను చితకబాదిన అమెరికా పోలీసులు ?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు ( Donald Trump) ఊహించని పరిణామం ఎదురైంది. వాషింగ్టన్ లోని ప్రముఖ హోటల్ ఫిల్టర్ లో జర్నలిస్టుల కోసం ఏర్పాటుచేసిన డిన్నర్ పార్టీలో… ఒక్కసారిగా కాల్పులు కలకలం రేపాయి. ఈ సంఘటన జరిగిన సందర్భంగా ఆ హోటల్ లోపల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నారు. ఆయనతోపాటు ఉపాధ్యక్షుడు జెడి వెన్స్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే అగ్ర నేతలు పార్టీలో ఉన్న సందర్భంగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది… అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను సేఫ్టీ ప్లేస్ కు తరలించారు. ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అయితే కాల్పులు జరిపిన దుండగుడిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
ఈ కాల్పుల వెనుక ఎవరు ఉన్నారనే దానిపైన ఎంక్వైరీ ప్రారంభించారు అధికారులు. ఈ క్రమంలో బాబర్ ఆజంను పోలీసులు చితకబాదినట్లు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటనకు పాల్పడింది కాలిఫోర్నియాలోని టోరెంట్స్ కు సంబంధించిన కోల్ టామస్ అలెన్ అనే 31 సంవత్సరాల కుర్రాడు. అయితే ఇతన్ని నేలపైన పడుకోబెట్టి పోలీసులు కొడుతున్న ఫోటోలు వైరల్ గా మారాయి. కానీ కొంతమంది మాత్రం ఈ దాడికి పాల్పడింది బాబర్ ఆజం ( Pak Babar A zam) అన్నట్లుగా ఫోటోలు క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. దీంతో బాబర్ ఫోటోలు వైరల్ గా మారాయి. కావాలనే కొంతమంది బాబర్ ఫోటోలను క్రియేట్ చేసి, అమెరికా పోలీసులు కొట్టినట్లు రచ్చ చేస్తున్నారు.
https://www.facebook.com/story.php?story_fbid=2044013299797621&id=100025669134048&post_id=100025669134048_2044013299797621&rdid=GqccMEmdAKR7GmkL#

