Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సూర్య 'కరుప్పు'.. సూర్య వైరల్ ట్వీట్స్!

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సూర్య 'కరుప్పు'.. సూర్య వైరల్ ట్వీట్స్!

Big TV Live 1 week ago

Suriya Karuppu: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ సెన్సేషన్ 'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడు') థియేటర్లలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

విడుదలైన మొదటి రోజు నుంచే ఈ సినిమాకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సూర్య నటన, సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసిన ఒక ఆసక్తికరమైన ట్వీట్, దానికి సూర్య ఇచ్చిన రిప్లై ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Read also-మారుతి To రెనాల్ట్.. పెట్రో బాధలు తప్పించే బెస్ట్ 5 కార్లు ఇవే!

సినిమాకు వస్తున్న భారీ కలెక్షన్లు, పాజిటివ్ టాక్ చూసి విజయ్ దేవరకొండ తన సంతోషాన్ని పంచుకుంటూ.. “తమిళంలో సూర్య అన్న ‘కరుప్పు’, తెలుగులో ‘వీరభద్రుడు’ చిత్రాలకు వస్తున్న అఖండమైన ప్రజాదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. థియేటర్ల వద్ద వసూళ్ల జాతర అద్భుతంగా ఉందని వింటున్నాను. ప్రతి సంవత్సరం స్క్రీన్‌పై తను చూపిస్తున్న ప్రతిభకు, సినిమా కోసం ఆయన ఇచ్చే డెడికేషన్‌కు ఈ విజయం దక్కడం ఎంతో ఆనందంగా ఉంది. ఫైనల్‌గా థియేటర్లు మళ్లీ కళకళలాడుతున్నాయి” అంటూ సూర్యపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. విజయ్ చేసిన ఈ ఎమోషనల్ ట్వీట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

Read also-సీఎం విజయ్‌పై రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు.. స్టాలిన్‌తో స్నేహంపై క్లారిటీ!

ఈ ట్వీట్‌కు హీరో సూర్య అంతే కూల్‌గా స్పందిస్తూ.. “హాహా! ఇదంతా మన ప్రియమైన ఫ్యాన్స్ కోసమే విజయ్..! అన్నట్టు, మంచి హాలిడే స్పాట్ ఏదైనా సజెస్ట్ చెయ్?” అంటూ రిప్లై ఇచ్చారు. సినిమా కోసం రాత్రి పగలు కష్టపడిన సూర్య, ఈ భారీ సక్సెస్ తర్వాత కొద్దిగా విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్లు ఈ ట్వీట్ ద్వారా అర్థమవుతోంది. ఒక స్టార్ హీరో సినిమా సక్సెస్‌ను మరో స్టార్ హీరో సెలబ్రేట్ చేసుకోవడం, దానికి అంతే సరదాగా రిప్లై ఇవ్వడం హెల్తీ అట్మాస్ఫియర్‌కు నిదర్శనమని, ఈ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live