Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాత్‌రూమ్ మూలలో ఉప్పు గిన్నె ఎందుకు పెడతారో తెలుసా? దీని వెనుకున్న రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

బాత్‌రూమ్ మూలలో ఉప్పు గిన్నె ఎందుకు పెడతారో తెలుసా? దీని వెనుకున్న రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Big TV Live 1 month ago

Vastu Tips: సాధారణంగా ఉప్పు అంటే మనకు వంటిల్లే గుర్తొస్తుంది. కానీ, ఈ మధ్య చాలామంది తమ బాత్రూమ్‌లో ఒక చిన్న గిన్నెలో ఉప్పును ఉంచుతున్నారు. ఇది చూడటానికి కొంచెం వింతగా అనిపించినా..

దీని వెనుక కొన్ని ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి. ఇది కేవలం ఏదో మూఢనమ్మకం మాత్రమే కాదు.. దీని వెనుక సైన్స్ కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. అసలు బాత్‌రూమ్‌లో ఉప్పు పెట్టడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.

తడిని పీల్చేసే నేచురల్ ట్రిక్:

బాత్రూమ్ ఎప్పుడూ తేమగా ఉంటుంది. స్నానం చేసినప్పుడు వచ్చే ఆవిరి వల్ల గాలిలో తేమ పెరిగి, గోడలు జిగటగా మారుతుంటాయి. దీనివల్ల బాత్రూమ్‌లో ఒక రకమైన చెడు వాసన వస్తుంది. అయితే, ఉప్పుకు గాలిలో ఉన్న తేమను పీల్చుకునే గుణం ఉంది. బాత్‌రూమ్ మూలలో ఉప్పు గిన్నె పెడితే, అది గాలిలోని ఎక్స్‌ట్రా తడిని లాగేసి.. ఆ ప్రదేశం తాజాగా ఉండేలా చేస్తుంది. దీనివల్ల బాత్‌రూమ్‌లో బూజు పట్టడం కూడా తగ్గుతుంది.

వారానికి 5 రోజులు, రోజుకు 30 నిమిషాలు ఇలా చేస్తే.. గుండె జబ్బులు దరిచేరవు!

నెగటివ్ ఎనర్జీకి చెక్:

చాలామంది పెద్దలు చెప్పే మాట ఏంటంటే.. ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీని దూరం చేయడానికి ఉప్పు బాగా పనిచేస్తుంది. రోజంతా బయట తిరిగి అలసిపోయి ఇంటికి వచ్చాక, మన ఒంటిపై ఉన్న నీరసాన్ని, నెగటివ్ ఆలోచనలను బాత్రూమ్‌లో స్నానం ద్వారా వదిలేస్తాం. ఆ సమయంలో అక్కడ ఉంచిన ఉప్పు ఆ నెగటివ్ వైబ్స్‌ను పీల్చుకుని, ఆ ప్రదేశాన్ని ప్రశాంతంగా మారుస్తుందని పాతకాలం నుండి ఒక నమ్మకం ఉంది.

ఏ ఉప్పు వాడితే మంచిది?

మనం వంటల్లో వాడే మెత్తటి ఉప్పు కంటే.. కల్లుప్పు లేదా హిమాలయన్ పింక్ సాల్ట్ వాడటం చాలా మంచిది. ఈ గడ్డలు త్వరగా కరిగిపోకుండా ఎక్కువ కాలం ఉంటాయి. పైగా చూడటానికి కూడా ఇవి ఒక డెకరేషన్ పీస్‌లా అనిపిస్తాయి. ఇవి గాలిలోని తేమను పీల్చుకోవడానికి, ఆధ్యాత్మికంగా కూడా శక్తివంతంగా పనిచేస్తాయని చెబుతారు.

ఉప్పును ఎప్పుడు మార్చాలి?

గిన్నెలో ఉప్పు పెట్టిన తర్వాత దాన్ని అలానే వదిలేయకూడదు. కొద్ది రోజులకు అది గాలిలోని తేమను పీల్చుకుని గడ్డకట్టడం లేదా నీరులా మారడం మొదలవుతుంది. అలా అయిందంటే ఉప్పు తన పని పూర్తి చేసిందని అర్థం. కాబట్టి వారానికి ఒకసారి లేదా పది రోజులకు ఒకసారి ఆ పాత ఉప్పును తీసి నీళ్లలో పారబోసి, మళ్లీ కొత్త ఉప్పును నింపుకోవాలి. ఇలా చేయడం వల్ల బాత్రూమ్ ఎప్పుడూ క్లీన్‌గా, మంచి ఎనర్జీతో ఉంటుంది.

ఫాయిల్ పేపర్‌ను కట్ చేస్తే నిజంగానే కత్తెర పదును పెరుగుతుందా? సైన్స్ ఏం చెబుతోందంటే..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live