Babar Azam: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్న సంగతి తెలిసిందే. పహాల్గమ్ సంఘటన (Pahalgam incident) జరిగిన తర్వాత ఈ రెండు దేశాల మధ్య గ్యాప్ మరింత పెరిగింది.
ఇలాంటి పరిస్థితులలో బాబర్ ఆజం (Babar Azam) ఇండియాకు రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మొదటి వరకు ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ చూసేందుకు మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) ఇండియాకు రాబోతున్నట్లు వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పాకిస్తాన్ డేంజర్ ఆటగాడు బాబర్ ఆజం (Babar Azam) ఇండియా పర్యటనకు వస్తున్నట్లు పోస్టులు పెడుతున్నారు. బిగ్ బాష్ లీగ్ (BIG BASHL 2026-27) ప్రారంభ మ్యాచ్ చెన్నై వేదికగా జరగనున్న నేపథ్యంలో.. బాబర్ ఆజం కూడా వస్తాడని ప్రచారం చేస్తున్నారు.
ఇండియాకు రానున్న బాబర్ ఆజం ?
బిగ్ బాష్ లీగ్ 2026 -27 సీజన్ ( Big Bash League 2026-27 Season ) ఓపెనింగ్ మ్యాచ్ ఇండియాలో నిర్వహించేందుకు సన్నద్ధం అవుతోంది క్రికెట్ ఆస్ట్రేలియా. ఈ మేరకు ఇండియాతో కూడా కీలక ఒప్పందం కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాష్ లీగ్ లోని ఒక్క మ్యాచ్ ఇండియాలో నిర్వహిస్తే… ఐపీఎల్ 2027 టోర్నమెంటుకు సంబంధించిన మరో మ్యాచ్ ఆస్ట్రేలియాలో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. బిగ్ బాష్ 2026-27 టోర్నమెంట్ ఇప్పుడు వచ్చే డిసెంబర్లో జరగనున్న నేపథ్యంలో చెన్నై వేదికగా ఏకంగా ఓపెనింగ్ మ్యాచ్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా కోరిక మేరకు ఇటు బీసీసీఐ తో పాటు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆమోదం కూడా తెలిపిందట. అయితే ఈ ఒక్క మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజం ఇండియాలో పర్యటిస్తాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. బిగ్ బాష్ ఓపెనింగ్ మ్యాచ్ సిడ్ని సిక్సర్స్ దే (Sydney Sixers) అయితే మాత్రం బాబర్ ఆజం ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం అతడు సిడ్నీ సిక్సర్స్ జట్టులోనే ఉన్నాడు. ఒకవేళ సిడ్నీ సిక్సర్స్ ఓపెనింగ్ మ్యాచ్ ఆడకపోతే మాత్రం.. ఇండియాకు బాబర్ ఆజం వచ్చే అవకాశాలు లేవు.
ఏదో ఒక కారణం చెప్పి బయటపడవచ్చు. కానీ ఓపెనింగ్ మ్యాచ్ సిడ్ని సిక్సర్స్ దే అయి ఉంటే మాత్రం జట్టు యాజమాన్యం ఆదేశాల మేరకు ఇండియా పర్యటనకు రావాల్సి ఉంటుంది. ఒకవేళ బాబర్ ఆజం.. ఇండియాకు రావాలనుకుంటే కచ్చితంగా మోడీ సర్కార్ పర్మిషన్ తీసుకోవాలి. వీసా అప్రూవల్ కావాలి. పాకిస్తాన్ దేశానికి సంబంధించిన ఏ ఒక్కరికి కూడా వీసా ఇవ్వడంలేదు ఇండియన్ ప్రభుత్వం. ఇలాంటి క్రమంలో బాబర్ వచ్చే అవకాశాలు లేవని మరి కొంతమంది ప్రచారం చేస్తున్నారు. కానీ క్రికెట్ ఆస్ట్రేలియా విజ్ఞప్తి చేస్తే మాత్రం ఇండియన్ ప్రభుత్వం దిగివచ్చే అవకాశాలు ఉంటాయని మరికొంతమంది అంటున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో బాబర్ ఆజం ఇండియాకు వస్తారా ? లేక తొలి మ్యాచ్ వదిలేస్తారా ? అనేది చూడాలి. బిగ్ బాష్ లీగ్ కు ఇండియాలో పాపులారిటీ రావాలని, చెన్నై వేదికగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Mushfiqur Rahim: కాలితో గట్టిగా తన్నిన ముష్ఫిఖర్ రహీం..10 మీటర్ల దూరంలో పడ్డ హెల్మెట్

