Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బలహీనమైన గుజరాత్ పై గెలిచి బిల్డప్ ఇస్తున్నారు..RCB పరువు తీసిన అంబటి !

బలహీనమైన గుజరాత్ పై గెలిచి బిల్డప్ ఇస్తున్నారు..RCB పరువు తీసిన అంబటి !

Big TV Live 3 days ago

Ambati Rayudu: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచిన సంగతి తెలిసిందే.

మే 31వ తేదీన అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో (Ahmedabad Narendra Modi Stadium) గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Gujarat Titans vs Royal Challengers Bangalore) మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. చాలా చక్కగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి వరకు నిలిచిన విరాట్ కోహ్లీ మ్యాచ్ గెలిపించాడు. ఈ ఫైనల్స్ లో 75 పరుగులు సాధించిన విరాట్ కోహ్లీ, సిక్సర్ కొట్టి మరీ మ్యాచ్ గెలిపించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే బెంగళూరు ఛాంపియన్ అయిన నేపథ్యంలో మాజీ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు (Ambati Rayudu) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫైనల్ లో వీక్ టీం ఉన్న కారణంగానే బెంగుళూరు సింపుల్ గా విజయం సాధించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. లేకపోతే బెంగుళూరు ఓటమిపాలయ్యదని బాంబు పేల్చారు.

Inzamam-ul-Haq: ఇది పక్కా ఫిక్సింగే.. కోహ్లీకి గుజరాత్ బౌలర్ల నెమ్మదిగా బంతులు వేశారు Inzamam-ul-Haq !

బలహీనమైన గుజరాత్ పై గెలిచి బిల్డప్ ఇస్తున్నారు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, వరుసగా రెండవసారి టైటిల్ గెల్చుకుంది. ఈ క్రమంలో బెంగళూరు జట్టుపై నిత్యం విమర్శలు చేసే అంబటి రాయుడు, మరో బాంబు పేల్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఫైనల్ సందర్భంగా గుజరాత్ టైటాన్స్ ఫైనల్స్ కు రావడం వల్ల సులభంగా బెంగళూరు చాంపియన్ అయిందని వెల్లడించారు. బెంగళూరు కంటే గుజరాత్ టైటాన్స్ చాలా వీక్ టీమ్ అని, అందులో మూడు వికెట్లు పడితే మ్యాచ్ గెలిచినట్లేనని వెల్లడించారు. కెప్టెన్ గిల్ (Shubman Gill), సాయి సుదర్శన్ ( Sai Sudarshan) అలాగే జోస్ బట్లర్ వికెట్లను పడగొడితే మ్యాచ్ ఫినిష్ చేయవచ్చని స్పష్టం చేశారు.

ఈ ముగ్గురు తప్పితే ఎవరూ ఆడబోరని వెల్లడించారు. అదే ఫైనల్స్ కు గుజరాత్ కాకుండా మరో బలమైన జట్టు వస్తే సినిమా వేరే లాగా ఉండేదని బాంబు పేల్చారు. ప్లే ఆఫ్ లో నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ లేదా రాజస్థాన్ రాయల్స్ రెండిటిలో ఎవరు వచ్చినా బెంగుళూరు ఓడిపోయేదని జోష్యం చెప్పారు అంబటి రాయుడు. అదృష్టం కొద్ది బలహీనమైన గుజరాత్ టైటాన్స్ వచ్చిందని.. దానివల్ల ఫైనల్లో బెంగళూరు విజయం సులభతరం అయిందని వెల్లడించారు. దీంతో అంబటి రాయుడు ( Ambati rayudu) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Short Circuit, Smoke In Team Bus: గుజరాత్ బస్సు ప్రమాదం వెనుక RCB కుట్ర..వైర్లు కట్ చేసింది కోహ్లీ ఫ్యాన్స్ అంటూ ఆరోపణలు !

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live