Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Bandi Owaisi: మేం అధికారంలోకి వస్తే ఒవైసీ విద్యాసంస్థలు కూల్చేస్తాం: బండి సంజయ్!

Bandi Owaisi: మేం అధికారంలోకి వస్తే ఒవైసీ విద్యాసంస్థలు కూల్చేస్తాం: బండి సంజయ్!

Big TV Live 1 week ago

Bandi Owaisi: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ అండతోనే ఓవైసీ బరితెగించి మాట్లాడుతున్నారని, హైకోర్టునే బెదిరించేలా ఓవైసీ మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.

అడ్డగోలు తప్పులు చేస్తూ హైకోర్టునే ప్రశ్నిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. కోర్టులు, చట్టాలంటే ఎంఐఎంకు గౌరవం లేదని ఆయన మండిపడ్డారు.

ఇతరులకు ఇంకో న్యాయమా?

ఫాతిమా విద్యా సంస్థలపై ప్రభుత్వం నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. హైకోర్టు ప్రశ్నలకు వివరణ ఇవ్వకుండా జాప్యమెందుకు చేస్తున్నారని నిలదీశారు. చెరువును ఆక్రమించుకుని విద్యా సంస్థలను నిర్మించడమే తప్పని, గండిపేటలో ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్న విద్యా సంస్థలను కూల్చేస్తామంటూ నోటీసుల మీద నోటీసులిస్తున్నారు తప్పితే.. ఓవైసీ ఆధ్వర్యంలోని ఫాతిమా విద్యా సంస్థల జోలికి ఎందుకు వెళ్లడం లేదని బండి ప్రశ్నించారు. ఓవైసీకి ఒక న్యాయం ఇతరులకు ఇంకో న్యాయమా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Also read: PDS Rice: హుజూరాబాద్‌లో అక్రమ రేషన్ బియ్యం దందా కలకలం

కూల్చివేస్తాం..

ఓవైసీ విద్యా సంస్థ మిలిటెంట్లకు షెల్టర్ ఇచ్చింది నిజం కాదా? అని బండి ఆరోపించారు. విద్యార్థులకు చదువు ముసుగులో మిలిటెంట్లను తయారు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఫాతిమా సంస్థలను కూల్చివేస్తామని బండి హెచ్చరించారు. అక్రమార్కులకు, అవినీతిపరులకు భయమంటే ఏమిటో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు.

Fertilizer App: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. యూరియా బుకింగ్‌లో సంచలనం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live