Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

Big TV Live 2 weeks ago

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడింది. ఫలితంగా వాతవరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. అర్ధరాత్రి ధాటిన తర్వాత హైదరాబాద్ సిటీలో భారీ వర్షం కురిసింది.

ప్రస్తుతానికి తగ్గుముఖం పట్టింది. మిగతా జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. బుధవారం పరిస్థితి ఏంటి?

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మెల్లగా కదులుతోంది. దీని ప్రభావం గంగా తీర ప్రాంతమైన బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, జార్ఖండ్ ప్రాంతాలపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం అల్పపీడనం బెంగాల్-జార్ఖండ్ ప్రాంతాల మధ్య కేంద్రీకృతమైంది. దీని కారణంగా రాబోయే 48 గంటల్లో అది జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం

ప్రస్తుతం బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో నైరుతి రుతుపవనాలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా ప్రస్తుతం యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబాబాద్ వ్యాప్తంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నల్గొండ జిల్లాలతోపాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.

హైదరాబాద్‌లో తెల్లవారుజామున కుమ్మేసింది

ఇక హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి తర్వాత భారీ వర్షం పడింది. దాదాపు 3 గంటల సమయంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. తెల్లవారుజామున ఐదు గంటల తర్వాత వర్షం తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా పటాన్‌చెరు, లింగంపల్లి, ఆర్‌సీ పురం, కొండాపూర్, హఫీజ్‌పేట్, కూకట్‌పల్లి, బాలానగర్, మియాపూర్, కుత్బుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్, బొల్లారం, కొంపల్లి, మల్కాజ్‌గిరి, మౌలాఅలీ, కాప్రా, ఏఎస్‌రావు నగర్, చర్లపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

జూబ్లీహిల్స్, మాదాపూర్, హిమాయత్‌నగర్, హబ్సిగూడ, తార్నాక, నాచారం, మల్లాపూర్ తోపాటు కొన్ని ప్రాంతాల్లో వర్షం తగ్గుముఖం పట్టింది. ఉదయానికి హైదరాబాద్ నగరంలో అంతా క్లియర్ అయ్యింది. బుధవారం వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అటు ఏపీలో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేసింది. వర్షం పడే సమయంలో ఉరుములు పొరుపులతోపాటు ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live