Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బరువు తగ్గడానికి, ఇమ్యూనిటీ పెరగడానికి కొబ్బరి నీళ్లు తాగే సరైన సమయం ఇదే!

బరువు తగ్గడానికి, ఇమ్యూనిటీ పెరగడానికి కొబ్బరి నీళ్లు తాగే సరైన సమయం ఇదే!

Big TV Live 5 months ago

Coconut Water Benefits: కొబ్బరి నీళ్లు ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన వరం. ముఖ్యంగా ఎండకాలంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి చాలామంది వీటిని తాగుతుంటారు.

ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. అయితే, కొబ్బరి నీళ్లను ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా కొన్ని నిర్దిష్ట సమయాల్లో తాగడం వల్ల మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఉదయం ఖాళీ కడుపుతో తాగితే..

ఉదయాన్నే పరగడుపున కొబ్బరి నీళ్లు తాగడం వల్ల జీవక్రియలు చురుగ్గా మారుతాయి. ఇందులో ఉండే లారిక్ యాసిడ్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది చక్కటి సమయం. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా రోజంతా ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది.

ఈ పిచ్చి ఎండలకు వడదెబ్బ తగలకూడదంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తాగాల్సిందే!

వ్యాయామానికి ముందు, తర్వాత..

కృత్రిమ ఎనర్జీ డ్రింక్స్‌కు బదులు కొబ్బరి నీళ్లను సహజ సిద్ధమైన స్పోర్ట్స్ డ్రింక్‌గా వాడుకోవచ్చు. వర్కవుట్స్‌కు అరగంట ముందు తాగితే శరీరానికి మంచి శక్తి లభిస్తుంది. వ్యాయామం చేసిన తర్వాత తాగడం వల్ల చెమట రూపంలో కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను శరీరం తిరిగి పొందుతుంది. ఇది కండరాల అలసట, నీరసాన్ని త్వరగా తగ్గిస్తుంది.

భోజన సమయాల్లో..

మధ్యాహ్నం లేదా రాత్రి భోజనానికి అరగంట ముందు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలిగి, ఎక్కువగా తినకుండా ఉంటారు. ఇది క్యాలరీల నియంత్రణకు, బరువు తగ్గడానికి సాయపడుతుంది. అదేవిధంగా.. తిన్న తర్వాత తాగితే జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. గ్యాస్, ఎసిడిటీ, కడుపుబ్బరం వంటి సమస్యలు దరిచేరవు.

రాత్రి పడుకునే ముందు..

రోజంతా పనులతో అలసిపోయిన వారికి రాత్రి పూట కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచి, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇందులోని ఖనిజాలు రాత్రంతా రక్తపోటును అదుపులో ఉంచడంతో పాటు ప్రశాంతమైన నిద్రకు తోడ్పడతాయి. గర్భిణీలు కూడా వైద్యుల సలహాతో వీటిని తీసుకోవడం వల్ల అలసట, మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యుల సూచన మేరకే వీటిని తాగాలి.

ఎండల తీవ్రతకు ఐస్ క్రీమ్స్ లాగించేస్తున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్త!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live