Basil Seeds Benefits| బుల్లి సైజులో కనిపించే ఈ నల్లని విత్తనాల్లో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సబ్జా గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇవి శరీరానికి చల్లదనం ఇస్తాయి. వేసవికాలంలో వేడి ఎక్కవగా ఉన్న సమయంలో శరీరానికి ఇవి చాలా ఉపయోగకరం. రోజువారీ ఆహారంలో భాగంగా వీటిని తింటే ఆరోగ్యం మెరుగవుతుంది. అయితే సరైన విధానంలో తినడం చాలా ముఖ్యం.
సబ్జా విత్తనాలు ఎలా తినాలి?
సబ్జా విత్తనాలను ఎప్పుడూ నానబెట్టి తినాలి. ఒక చిన్న గిన్నెలో కొన్ని విత్తనాలు తీసుకోండి. నీరు పోసి 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టండి. విత్తనాలు వాచిపోయి జెల్లీ లాగా మారతాయి. ఇలా నానబెట్టిన తర్వాత సులభంగా జీర్ణం అవుతాయి. తాగునీటిలో కూడా కలిపి తాగవచ్చు. లెమన్ వాటర్‌లో కలిపి తాగితే రుచి మరింత బాగుంటుంది. స్మూతీలు, పాలు లేదా వేసవి డ్రింక్స్‌లో కూడా చేర్చుకోవచ్చు.
జీర్ణక్రియకు మంచిది
సబ్జా విత్తనాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వీటిలో ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. గ్యాస్ సమస్యతో బాధపడుతున్నవారు తీసుకుంటే కడుపులో ఉన్న అమ్లత్వం తగ్గి పేగులు ప్రశాంతంగా పనిచేస్తాయి. వేసవిలో బిర్యానీలు, ఫ్రైడ్ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ తినడం వల్ల జీర్ణవ్యవస్థ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సబ్జా గింజలు వాటిని తగ్గించడంలో ఉపయోగపడతాయి.
శరీరానికి చల్లదనం
సబ్జా విత్తనాలు సహజంగా శరీరానికి చల్లదనం ఇస్తాయి. వేసవి వేడిని తగ్గించి శరీరాన్ని ఫ్రెష్‌గా ఉంచుతాయి. ఉష్ణోగ్రతలు ఎక్కువైనప్పుడు రోజూ తినడం వల్ల శరీరం ఓవర్‌హీట్ కాకుండా ఉంటుంది.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
సబ్జా విత్తనాలు బరువు నియంత్రణలో కూడా ఉపయోగపడతాయి. ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల ఆహారం తినడంలో కంట్రోల్ చేయవచ్చ. ఎందుకంటే ఇందులోని ఫైబర్ కడుపు నిండుగా ఉందనే ఫీలింగ్ ఇస్తుంది. దీంతో బరువు నియంత్రణ చేసేందుకు శరీరంలోని క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి.
రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణ
డయాబెటిస్ ఉన్నవారికి సబ్జా విత్తనాలు చాలా మంచివి. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ పోషకాల వల్ల శరీరం.. రక్తంలో షుగర్ నెమ్మదిగా కరుగుతుంది. దీంతో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోవడం జరగదు.
చెమట వాసనతో ఇబ్బందిపడుతున్నారా? ఈ సింపుల్ చిట్కాలతో సమస్యకు చెక్
ఎముకల బలానికి మంచిది
సబ్జా విత్తనాలలో, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. క్రమం తప్పకుండా తినడం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. ఎముకలు బలహీనంగా ఉన్నవారికి ఇవి మంచి ఆహారం.
సబ్జా గింజలను తినే సమయంలో ఈ జాగ్రత్తలు పాటించాలి
- సబ్జా విత్తనాలను ఎప్పుడూ నానబెట్టి తినాలి. అలాగే తినేస్తే అసౌకర్యం కలగవచ్చు.
- రోజుకు మితంగా తినాలి. ఎక్కువ తినడం వల్ల జీర్ణ సమస్యలు రావచ్చు.
- ఏదైనా వైద్య సమస్య ఉంటే డాక్టర్ సలహా తీసుకోండి.
ముఖ్యగమనిక: ఈ కథనంలో తెలిపిన చిట్కాలు మీ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా వైద్య సమస్యకు సంబంధించిన నివారణ కోసం వీటిని తీసుకునే ముందు తప్పకుండా డాక్టర్ సలహా తీసుకోవాలని సూచన.
