Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీపై సుమోటోగా పోలీసులు FIR నమోదు చేసారు. కోల్‌కతాలోని క్యాథడ్రల్ రోడ్డులో తృణమూల్ ఛాత్ర పరిషత్ ప్రభుత్వ (TMCP) వ్యవస్థాపక దినోత్సవ సభ జరిగింది.
దీంతో ఈ సభకు సంబంధించి కొన్ని షరతులును కోల్‌కతా హైకోర్టు విదించింది.
నిబంధనలు ఉల్లంఘించి..
రోడ్డులో ఒక వైపు ట్రాఫిక్ కోసం ఖాళీగా ఉంచాలని, కేవలం 1,500 మంది మాత్రమే సభకు హాజరుకావాలని కోర్టు తెలిపింది. దీంతో నిబంధనలను ఉల్లంఘించి రోడ్డును పూర్తిగా మూసివేశారని, అనుమతించిన పరిమితికి మించి జనాలను సమీకరించారని పోలీసులు మమతా బెనర్జీపై FIR నమోదు చేసారు.
Also read: ఇంటర్నెట్ లేకుండా 4G ఫోన్.. పిల్లల కోసం HMD తీసుకొచ్చిన స్కూల్ ఎడిషన్ ఇదే!
BNS చట్టంలోని..
మమతా బెనర్జీతో పాటు టీఎంసీపీ సభ నిర్వాహకులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టంలోని పలు సెక్షన్ల కింద మమతాపై పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారని సమాచారం. ఈ సంఘటనను మమతా వర్గం వ్యతిరేకింది. అక్రమంగా మమతాపై కేసులు నమోదు చేసారంటూ పార్టీలో కొంత మంది నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసారు.
Also read: కవిత పార్టీలో ఆ ఇద్దరు సీనియర్ నేతలు ఎక్కడ.. అసలు ఉన్నట్టా లేనట్టా..?

