India's Best Electric SUVs Under Rs.30 Lakh:భారత్ లో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ రోజు రోజుకు మరింత విస్తరిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, ప్రభుత్వ సబ్సిడీలు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుల కారణంగా చాలా మంది ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
ముఖ్యంగా SUV సెగ్మెంట్ లో 400 కి.మీ పైగా రేంజ్ ఇచ్చే కార్లకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం భారత్ లో రూ. 30 లక్షల లోపు ధరలో లభించే, మంచి రేంజ్ కలిగిన 5 ఎలక్ట్రిక్ SUVల గురించి తెలుసుకుందాం..
⦿ Hyundai Creta Electric
క్రెటా మన దేశంలో బాగా పాపులర్ అయిన SUV. దాని ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ కారు సుమారు రూ. 18 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 42 kWh, 51.4 kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. చిన్న బ్యాటరీతో సుమారు 420 కి.మీ, పెద్ద బ్యాటరీతో 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుంది. యూజ్ కు చాలా సౌకర్యంగా ఉంటుంది.
⦿ Tata Harrier EV
టాటా కంపెనీ ఎలక్ట్రిక్ కార్లలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హారియర్ EV ఫ్లాగ్ షిప్ మోడల్ గా వస్తోంది. దీని ప్రారంభ ధర సుమారు రూ. 21.5 లక్షలు. ఇందులో 65 kWh, 75 kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. ఈ కారు సింగిల్ మోటార్, డ్యూయల్ మోటార్ సెటప్ లలో లభిస్తుంది. ఒకే ఛార్జ్ తో 538 కి.మీ నుంచి 600 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఎక్కువ దూరం డ్రైవ్ చేసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.
⦿ Mahindra XEV 9e
ఇదో స్టైలిష్ కూపే SUV. మహీంద్రా కొత్తగా తీసుకొచ్చిన ఈ మోడల్ యువతను ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. దీని ధర సుమారు రూ. 21.9 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 59 kWh, 79 kWh బ్యాటరీలు ఉన్నాయి. ఈ కారు 522 కి.మీ నుంచి 650 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. పవర్, డిజైన్ రెండింటి కోసం చూస్తున్నవారికి ఇది మంచి ఆప్షన్.
⦿ Mahindra XEV 9S
మహీంద్రా నుంచి వచ్చిన ఫ్లాగ్ షిప్ ఎలక్ట్రిక్ SUV ఇది. దీని ధర రూ.19.95 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 59 kWh, 70 kWh, 79 kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. రేంజ్ 520 కి.మీ నుంచి దాదాపు 680 కి.మీ వరకు ఉంటుంది. పెద్ద ఫ్యామిలీకి సరిపోయే స్పేస్, మంచి ఫీచర్లు కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.
⦿ BYD Atto 3
ఇది అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయిన ఎలక్ట్రిక్ SUV. దీని ధర సుమారు రూ.25 లక్షలు. ఇందులో 49.92 kWh, 60.48 kWh బ్యాటరీలు ఉన్నాయి. ఫుల్ ఛార్జ్ తో 500 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. స్మూత్ డ్రైవింగ్, మంచి బిల్డ్ క్వాలిటీ ఈ కారుకు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
Read Also: థార్.e To BE07.. మహీంద్రా నుంచి రాబోతున్న టాప్ ఎలక్ట్రిక్ SUVలు ఇవే!

