Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భర్తను సజీవంగా కాలువలో పడేసి, 49 సార్లు ప్రియుడికి ఫోన్‌కాల్స్ , హర్యానాలో దారుణమైన ఘటన

భర్తను సజీవంగా కాలువలో పడేసి, 49 సార్లు ప్రియుడికి ఫోన్‌కాల్స్ , హర్యానాలో దారుణమైన ఘటన

Big TV Live 1 week ago

Haryana: అక్రమ సంబంధాలు పచ్చని కాపురంలో చిచ్చు పెడుతున్నాయి. ప్రియుడితో ఆనందం కోసం భర్తలను చంపేస్తున్నారు కొందరు మహిళలు. తాజాగా అలాంటి ఘటన ఒకటి హర్యానా వెలుగు చూసింది.

భార్య, ఆమె ప్రియుడు ప్లాన్ ప్రకారం భర్తను హత్య చేసిన తీవ్ర కలకలం రేపుతోంది. అసలేం జరిగింది?

హర్యానాలో దారుణమైన ఘటన

హర్యానాలోని జాద్తాల్ గ్రామానికి చెందిన మోను-తన్నుకు వివాహం జరిగింది. కొన్నాళ్లు వీరి కాపురం సజావుగా సాగింది. వీరిద్దరి మధ్యలోకి ఓ వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. అదే ఆ ఫ్యామిలీలో చిచ్చు మొదలైంది. జూన్ 7న భార్య తన్నుని పుట్టింటి నుంచి తీసుకురావడానికి రెడీ అవుతున్నారు మోను. ఇంటికి వచ్చేటప్పుడు జీతం తీసుకురావాలని భర్తను కోరింది తన్ను.

భార్య ఏమైనా కొనాలని అడుగుతుందని భావించాడు. జీతం తీసుకున్న తర్వాత డబ్బు విత్‌డ్రా చేశాడు మోను. ఇంటి నుంచి టూ వీలర్‌పై అత్త గారింటికి బయలుదేరాడు మోను. అప్పటికే భార్య తన్ను, ఆమె ప్రియుడు సోనుకు ఈ విషయం చెప్పింది. సోనుతోపాటు మరో ఇద్దరితో కలిసి భర్త వచ్చేదారిలో కాపు కాశారు.

ప్రియుడితో కలిసి భర్తను లేపేసిన భార్య

తన్ను- ఆమె ప్రియుడు, మరో ఇద్దరు వ్యక్తులు కలిసి మోను వాహనాన్ని అడ్డగించారు. స్పృహ కోల్పోయేవరకు నోరు, ముక్కును మూసేశారు. చనిపోయాడని భావించిన వారు.. బతికి ఉండగానే కాలువలో పడేశారు. మోనుది ఆత్మహత్య మాదిరిగా చేసేందుకు కాలువకు దగ్గరలో టూ వీలర్‌ని ఉంచారు. ఇక్కడి నుంచి సీన్ పోలీసుస్టేషన్‌కు మారింది.

మోను ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేను నమోదు చేసిన పోలీసులు, మిస్సింగ్ వ్యక్తి కోసం గాలింపు మొదలుపెట్టారు. జూన్ 10న అసల్వాస్ సమీపంలోని కాలువలో మోను మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇంతవరకు బాగానే ఉంది. అసలు మోను ఎవరైనా చంపారా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అనేది పోలీసులకు మిస్టరీగా మారింది.

భర్తను సజీవంగా కాలువలో పడేసింది

మోను చనిపోయిన విషయం గురించి కాల్ చేసి చెప్పడంతో తన్ను, ఆమె బంధువులు అత్తవారింటికి చేరుకున్నారు. భర్త మరణంపై ఏడుస్తూ అందరినీ నమ్మించింది తన్ను. సంతాప దినాలు ముగిసేవరకు ఆచారాల్లో పాల్గొంది తన్ను. ఈ కేసులో మరో ట్విస్ట్ ఎంటరైంది. జూన్ 11న మోను మొబైల్ ఫోన్‌ను కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు.

మహానగరంలో విషాదం.. భారీ వర్షాలకు కూలిన భవనం.. స్పాట్‌లో ఆరుగురు మృతి!

ఫోన్‌లో డేటా అంతా డిలీట్ చేసి ఉంది. దీన్ని గమనించిన మోను కుటుంబసభ్యులకు అనుమానం కలిగింది. కుటుంబ సభ్యులు పోలీసుల ద్వారా సైబర్ నిపుణులను సంప్రదించారు. తొలగించబడిన డేటా మళ్లీ వచ్చింది. ఆ డేటాలో ఫోన్ చాటింగ్‌లో తన్ను.. తన భర్త మోనును కలవడానికి పిలిచినట్లు తేలింది. దీంతో అక్కడి నుంచి ఫోన్‌కాల్స్ డేటాపై ఫోకస్ చేశారు పోలీసులు.

49 సార్లు ప్రియుడితో ఫోన్‌కాల్స్

జూన్ 8న హత్య జరిగిన రోజు రాత్రి తన్నుకు 49 సార్లు ఫోన్‌కాల్స్ చేశాడు ప్రియుడు సోను. వారిద్దరి మధ్య సుమారు మూడు నిమిషాల పాటు సంభాషణ జరిగినట్టు తేలింది. ఫోన్ నుంచి డిలీట్ చేసిన చాట్‌లు, కాల్ రికార్డులను తిరిగి పొందడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. దీని ఆధారంగా పోలీసులు తన్ను, ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు. ఇప్పుడు వారిద్దరినీ పోలీసులు విచారిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live