Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భయంకరంగా ఆడుతున్న అభిషేక్ శర్మపై ఐసీసీ విచారణ చేయాలి..!

భయంకరంగా ఆడుతున్న అభిషేక్ శర్మపై ఐసీసీ విచారణ చేయాలి..!

Big TV Live 3 hrs ago

Mohammad Yousuf praises Abhishek Sharma : ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీం ఇండియా మధ్య జరిగిన మూడో టి20 సందర్భంగా అభిషేక్ శర్మ సెంచరీ తో ఇరగదీశాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రోజురోజుకు అభిషేక్ శర్మ అత్యంత భయంకరమైన బ్యాటర్ గా మారుతున్నాడని వ్యాఖ్యానించారు. అతడి బ్యాటింగ్ చూస్తే తనకు భయమేసిందని బాంబు పేల్చారు. అయితే.. ఇంత భయంకరమైన బ్యాటింగ్ చేస్తున్న అభిషేక్ శర్మ పై అదే సమయంలో అనుమానాలు వ్యక్తం చేశారు మహమ్మద్ యూసఫ్. అతని బ్యాట్ లో రబ్బర్ ఫిక్స్ చేశారని ఆరోపణలు చేశారు. అందుకే చాలా భయానకంగా సిక్సర్లు అలాగే బౌండరీలు బాదేస్తున్నాడని వివాదాస్పద స్టేట్మెంట్ ఇచ్చారు మహమ్మద్ యూసఫ్. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.

అభిషేక్ శర్మ బ్యాట్ లో రబ్బర్లు అమర్చారు – మహమ్మద్ యూసఫ్

అభిషేక్ శర్మ సూపర్ సెంచరీ చేసిన నేపథ్యంలో మెచ్చుకోవాల్సిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు.. అతడి పరువు తీస్తున్నారు. అభిషేక్ శర్మ తన బ్యాట్ లో రబ్బర్లు మెయిన్టైన్ చేస్తున్నాడని బాంబు పేల్చాడు. ఈ క్రమంలోనే అవలీలగా సిక్సర్లతో పాటు బౌండరీలు ఆడగలుగుతున్నాడని తెలిపారు. దానికి తోడు ఫ్లాట్ మైదానాలు టీమిండియా కు కలిసి వస్తున్నాయని వివరించారు.

inzamam-ul-haq Comments on Abhishek Sharma Century Celebration : అసలు అభిషేక్ శర్మకు సిగ్గుందా.. మైదానంలో హిందూ మతాన్ని ప్రచారం చేస్తారా ?

భారతదేశ వ్యాప్తంగా అన్ని కూడా ఫ్లాట్ పిచ్ లే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ మాత్రం దానికి ఇంత ఓవరాక్షన్ ఎందుకని ప్రశ్నించారు. రబ్బర్లు పెట్టి బ్యాటింగ్ పాకిస్తాన్ ప్లేయర్లు కూడా చేస్తారని వ్యాఖ్యానించారు. ఇంత తొండాట ఆడడం వెనక బిసిసిఐ ఉందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. భారత బ్యాటర్లను ఇలాగే వదిలేస్తే… బౌలర్ల కెరీర్ దెబ్బతింటుందని వార్నింగ్ ఇచ్చారు.

బాబర్ ముందు అభిషేక్ శర్మ దేనికి పనికిరాడు

అభిషేక్ శర్మ అద్భుతమైన సెంచరీ చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ బౌలర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 30 బంతుల్లో సెంచరీ చేసిన అభిషేక్ శర్మను తాను అస్సలు మెచ్చుకోబోనని బాంబు పేల్చారు. ఫ్లాట్ మైదానాలలో ఎవరైనా సెంచరీలు కొడతారని వ్యాఖ్యానించారు. విదేశీ గడ్డలపై అభిషేక్ శర్మ సెంచరీ చేస్తే… అతడిని మెచ్చుకుంటానని తెలిపారు. బాబర్ ఆజం ముందు అభిషేక్ శర్మ దేనికి పనికిరాదని వెల్లడించారు. బాబర్ ఆజంను మించిపోయేలా అభిషేక్ శర్మ ట్రై చేస్తున్నాడని పేర్కొన్నారు. కానీ అతన్ని అభిషేక్ శర్మ బ్రేక్ చేయాలేడన్నారు పాకిస్తాన్ మాజీ బౌలర్ తన్వీర్ అహ్మద్. ఒకవేళ విదేశీ పిచ్ లపై అభిషేక్ సెంచరీ చేస్తే, మాత్రం దండేసి దండం పెడతానన్నారు.

Shahid Afridi Reaction On IND VS AFG: మాకు షేక్ హ్యాండ్ ఇవ్వడం చేతకాదు, కానీ ఆఫ్ఘానిస్తాన్ కెప్టెన్ తో సంసారమే మొదలు పెట్టారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live