Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బిగ్ బాస్ బ్యూటీ హమీద నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ బ్యూటీ హమీద నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Big TV Live 1 week ago

Hamida : బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్న సీరియల్ హీరోయిన్లలో బిగ్ బాస్ బ్యూటీ హామీదా ఒకరు. స్టార్ మా లో ప్రసారమైన టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ ద్వారా ఆమె తన క్రేజ్ ని పెంచుకుంది.

సింగర్ శ్రీరామ్ చంద్ర తో కలిపిన పులిహార ఆమె లైఫ్ కి అతిపెద్ద డ్యామేజ్ అని చెప్పాలి. హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత చాలామంది బిజీగా మారితే ఈ అమ్మడు మాత్రం ఏవో కొన్ని సీరియల్స్ తో ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత ఆమె క్యారెక్టర్ వెళ్లిపోవడంతో ఆ సీరియల్కు మరో క్యారెక్టర్ ని దించారు. అయితే ప్రస్తుతం సీరియల్స్ లో పెద్దగా కనిపించని ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు మతిపోగోడుతుంది. పెద్దగా సీరియల్స్ కూడా చేయని ఈ అమ్మడు నెలకు ఎంత సంపాదిస్తుంది అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ గా మారింది.. మరి ఈమె నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో ఇప్పుడు ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

హమీద నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

అందం అభినయం ఉన్న చాలా మంది యాక్టర్స్ అవకాశాలు లేక సోషల్ మీడియాని నమ్ముకుని డబ్బులు సంపాదిస్తున్నారు. ఈమధ్య చాలామంది అలానే ఫేమస్ అవుతున్నారు కూడా.. ఆ లిస్టులోకి బిగ్ బాస్ బ్యూటీ హా మీద కూడా చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ మధ్య ఒకప్పుడు సీరియల్స్ చేస్తూ బిజీగా గడిపింది. స్టార్ మా లో ప్రసారమైన బ్రహ్మముడి సీరియల్ లో హీరోకి గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇప్పటివరకు పెద్దగా సీరియల్స్ కనిపించలేదు. అయితే సోషల్ మీడియా ద్వారా ఈమె తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటూ వస్తుంది.. ఈమె సోషల్ మీడియా ద్వారా నెలకు దాదాపు మూడు లక్షలకు పైగా సంపాదిస్తుందని నెట్టింట వార్త ప్రచారంలో ఉంది. నిజంగానే నెలకు అంత సంపాదిస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఈమె ఇండస్ట్రీకి దూరమైందని తెలుస్తుంది. ఇకముందు ఎలాంటి సీరియల్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుందో మరి..

Also Read : గుడ్ న్యూస్ చెప్పిన విష్ణు ప్రియ.. ఫ్యాన్స్ హ్యాపీ..

హమీద కెరీర్ విషయానికొస్తే..

బిగ్ బాస్ ద్వారా పాపులరాటిని సొంతం చేసుకున్నా హామీదా గురించి తెలుసుకునేందుకు నెటిజెన్లు సోషల్ మీడియాలో తెగ వెతికిస్తున్నారు. నిజానికి ఈమె తెలుగు అమ్మాయి కాదు బెంగాలీ ముద్దుగుమ్మ. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జన్మించింది. ఈ బ్యూటీ కోల్‌కతాలోని సెయింట్ థామస్ డే స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించింది.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.. ఆ తర్వాత ఫ్యామిలీ హైదరాబాద్ కి షిఫ్ట్ అవడంతో ఈమెకు నటనపై ఇంట్రెస్ట్ పెరిగింది. సాహసం చేయరా డింభకా అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.. అలా పలు సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బుల్లితెరపై అడుగుపెట్టి అక్కడ కూడా సీరియల్స్తో బిజీగా గడిపింది. అయితే ఒకప్పుడు వరుసగా స్క్రీన్ మీద కనిపించే హమీద ఇప్పుడు స్క్రీన్ కి దూరంగా ఉందా ఏంటి అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి . కేవలం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. అవి క్షణంలోనే వైరల్ అవుతూ ఉంటాయి.. మరి ఫ్యూచర్లో ఓ మంచి ప్రాజెక్ట్ తో ప్రేక్షకులను పలకరిస్తుందేమో చూడాలి..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live