Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Big Breaking : దగ్గుబాటి బ్రదర్స్ కి  షాకిచ్చిన హైకోర్టు.. అరెస్ట్ తప్పదా..?

Big Breaking : దగ్గుబాటి బ్రదర్స్ కి షాకిచ్చిన హైకోర్టు.. అరెస్ట్ తప్పదా..?

Big TV Live 1 week ago

Daggubati Brothers : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సంచలన న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉందన్న విషయం తెలిసిందే.

అయితే ఇటీవల ఈ ఫ్యామిలీ గురించి సోషల్ మీడియాలో రోజుకు వార్త వినిపిస్తూ వైరల్అవుతుంది.. తాజాగా మరో న్యూస్ అందరికి షాక్ ఇస్తుంది. ఈ కుటుంబం పై ఒక కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.. డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసు లో 2024 జనవరి లో నమోదు అయిన కేసు, గత రెండున్నర సంవత్సరాలుగా కోర్ట్ కి రాకుండా విచారణ కి సంహరించకుండా కోర్ట్ లో ఉన్న లొసుగులను వాడుకుంటూ వీళ్ళు చేసిన తప్పులను ఆర్ధిక మరియు రాజకీయ పలుకుబడితో కోర్టు లో హాజరు కాకుండా కాలయాపన చేస్తూ వచ్చిన దగ్గుబాటి ఫ్యామిలీకి ఇప్పుడు హైకోర్టులో షాక్ తగిలింది. కాస్త వివరాల్లోకి వెళితే..

దగ్గుబాటి బ్రదర్స్ కి హైకోర్టు షాక్..

డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసు గత రెండేళ్లుగా కీలక మలుపులు తిరుగుతుంది.. నాంపల్లి కోర్టులో తమపై నమోదు అయిన FIR ని క్వాష్ చేయాలని గత ఏడాది జనవరి 9 వ తేదీన హై కోర్టులో పిటీషన్ వేసిన దగ్గుబాటి ఫ్యామిలీ , ఈ పిటిషన్ పై హై కోర్ట్ ధర్మాసనం సుదీర్ఘ వాదనలు విన్న తరవాత క్వాష్ పిటీషన్ డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.. సెలబ్రిటీ స్థాయి వ్యక్తులు సమాజానికి దిక్సూచి ల ఉండాల్సింది పోయి ఇలా ఎన్నో రకాల ఆరోపణలు మరెన్నో అక్రమాలకు పాల్పడుతూ డబ్బు, రాజకీయ పలుకుబడి తో న్యాయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.. ఇలా ఎంతో మందికి అన్యాయం చేసిన దగ్గుబాటి ఫ్యామిలీ, చివరికి నందకుమార్ చేసిన ఒంటరి న్యాయ పోరాటం లో న్యాయ వ్యవస్థ నందుకుమార్ వైపు నిలబడింది.. తుది తీర్పు అతనికే సపోర్ట్ గా ఇచ్చింది.. దగ్గుబాటి బ్రదర్స్ కి హై కోర్ట్ లో చివరికి చుక్కెదురు అయింది..

ఆగస్టు 13కి వాయిదా వేసిన కోర్టు..

క్వాష్ పిటీషన్ హై కోర్టు డిస్మిస్ చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టం ముందు అందరు సమానమే అని తేల్చి చెప్పింది. ఈ కేసు విచారణను మరోసారి వాయిదా వేసింది. ఈ కేసును తదుపరి విచారణ వచ్చే నెల ఆగస్టు 13 కు వాయిదా వేసింది హైకోర్టు.. ఈ విషయం లో దగ్గుబాటి కుటుంబం కి మరో గత్యంతరం లేదని స్పష్టంగా తెలుస్తోంది. వచ్చే నెలలో కోర్ట్ లో జరిగే విచారణ భాదితుడు నందకుమార్ కి జరుగుతుందని అందరు భావిస్తున్నారు. ఆగస్ట్ 13 న నాంపల్లి కోర్టులో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది, ఈ విషయం లో దగ్గుబాటి కుటుంబం కి మరో గత్యంతరం లేదని స్పష్టంగా తెలుస్తోంది..

అసలేం జరిగిందంటే..?

హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో డెక్కన్ కిచెన్ అనే హోటల్ ఉండేది. దీనిని నందకుమార్ అనే వ్యక్తి నిర్వహిస్తుండగా ఈ కిచెన్ ఉన్న స్థలం దగ్గుబాటి ఫ్యామిలీకి చెందింది.. ఆ లీజు పూర్తైనా అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా హోటల్‌ను రన్ చేస్తున్నారని దగ్గుబాటి ఫ్యామిలీ జీహెచ్‌ఎంసీకి కంప్లయింట్ చేశారు. ఇక జీహెచ్‌ఎంసీ అధికారులు ఆ డెక్కన్ కిచెన్ హోటల్‌ను కూల్చివేశారు. డెక్కన్ కిచెన్ కూల్చివేయడంతో దాన్ని నిర్వహిస్తున్న నందకుమార్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ కేసుపై స్టే ఆర్డర్ ఉండగా ఎలా కూల్చివేస్తారు.. ఆ కేసు ఇప్పటికీ కూడా విచారణలో ఉంది.. మరి వచ్చే నెల 13 న ఈ కేసు విచారణలో ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live