Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బిల్డర్ నిర్లక్ష్యం.. బలి తీసుకున్న చిన్నారి ప్రాణం

బిల్డర్ నిర్లక్ష్యం.. బలి తీసుకున్న చిన్నారి ప్రాణం

Big TV Live 1 week ago

Builder Negligence: స్వేచ్ఛ బ్యూరో: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. బిల్డర్ నిర్లక్ష్యం ఓ అమాయక చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకుంది.

నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో ఐదేళ్ల బాలుడు నీటితో నిండిన సంపులో పడి మృతి చెందాడు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు జిల్లా కందుకూరు మండలం రాళ్లపాడు గ్రామానికి చెందిన జూపల్లి మహేందర్ కుటుంబంతో కలిసి మేడిపల్లి సత్యనారాయణపురం కాలనీలో నివాసం ఉంటున్నారు. జీవనోపాధి కోసం భార్య ధరణితో కలిసి ఓ నిర్మాణ ప్రదేశంలో కూలి పనులు చేస్తున్నారు.

తెరిచి ఉంచిన నీటి సంపు..

శుక్రవారం సాయంత్రం పనుల్లో నిమగ్నమైన సమయంలో వారి కుమారుడు మహేష్ (5) సమీపంలో ఆడుకుంటూ వెళ్లాడు. నిర్మాణ స్థలంలో మూత లేకుండా, ఎలాంటి హెచ్చరికలు లేకుండా తెరిచి ఉంచిన నీటి సంపులో ప్రమాదవశాత్తు పడిపోయాడు. కొంతసేపటి వరకు బాలుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనగా వెతికారు. చివరకు సంపులో బాలుడు కనిపించడంతో బయటకు తీశారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Also read: 5 గోనే సంచులు.. 60 ప్యాకెట్లు.. ఈ గంజాయి విలువ ఎంతో తెలిస్తే దిమ్మతిరగాల్సిదే!

యజమాని నిర్లక్ష్యం

కనీస జాగ్రత్తలు తీసుకోకుండా నిర్మాణ స్థలాన్ని ప్రమాదకరంగా వదిలేయడమే ఈ విషాదానికి కారణమని స్థానికులు మండిపడుతున్నారు. "పనులు పూర్తయ్యే వరకు సంపుకు మూత పెట్టి ఉంటే చిన్నారి ప్రాణం కాపాడబడేది" అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్మాణ యజమాని నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live