Blast Zone Review: టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా దశాబ్దాలుగా తన మార్క్ యాక్షన్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ 'యాక్షన్ కింగ్' అర్జున్ సర్జా (Arjun Sarja) లీడ్ రోల్‌లో వచ్చిన లేటెస్ట్ సెన్సేషన్ 'బ్లాస్ట్ జోన్' (Blast Zone).
కరాటే బ్యాక్‌డ్రాప్‌లో, పక్కా యాక్షన్ డ్రామాగా దర్శకుడు సుభాష్ కె. రాజ్ తెరకెక్కించిన ఈ సినిమాపై సోషల్ మీడియాలో భారీ హైప్ నడిచింది. మరి ఈ రోజు థియేటర్లలోకి వచ్చిన ఈ యాక్షన్ ప్యాక్డ్ అడ్వెంచర్ ప్రేక్షకులను అలరించిందా ? అర్జున్ సర్జా మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ చేశారా? అసలు కథేంటి? చూసేద్దాం!
అసలు కథ ఏంటంటే..?
కథ విషయానికి వస్తే.. రాజారామ్ (అర్జున్) ఒక సాధారణ కరాటే మాస్టర్. తన కూతురు నీల (ప్రీతీ ముకుందన్)తో కలిసి ఎవరి జోలికీ వెళ్లకుండా సైలెంట్‌గా, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. కానీ, సీన్ కట్ చేస్తే.. కథలోకి రూ. 7,000 కోట్ల భారీ మైనింగ్ స్కామ్ ఎంటర్ అవుతుంది.
ఈ మహా స్కామ్ వెనుక ఉన్న పవర్‌ఫుల్ విలన్ గ్యాంగ్ లీడర్ అబ్రహం.. ఊహించని విధంగా ఈ కరాటే ఫ్యామిలీని టార్గెట్ చేస్తాడు. అసలు ఏ పాపం ఎరుగని ఈ ఫ్యామిలీని ఆ ఇంటర్నేషనల్ మాఫియా ఎందుకు వేధించింది? రాజారామ్ కరాటే బ్యాక్‌గ్రౌండ్‌కు, ఆ మైనింగ్ స్కామ్‌కు ఉన్న లింక్ ఏంటి? చివరకు తన కూతురిని, తన గతాన్ని కాపాడుకోవడానికి రాజారామ్ ఏ రేంజ్‌లో 'బ్లాస్ట్' అయ్యాడు? శత్రువులను ఎలా తుదముట్టించాడు? అనేదే వెండితెరపై చూడాల్సిన అసలు సిసలైన యాక్షన్ థ్రిల్లర్!
విశ్లేషణ
దర్శకుడు సుభాష్ కె. రాజ్ సినిమా ఫస్టాఫ్ నుండి సెకండాఫ్ వరకు కేవలం యాక్షన్ సీక్వెన్స్‌లనే నమ్ముకున్నారు. ముఖ్యంగా యాక్షన్ కింగ్ అర్జున్ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇస్తే చాలు.. థియేటర్లలో ఈ వయసులోనూ ఆయన చూపించిన ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఆయన సిగ్నేచర్ కరాటే స్టైల్ స్టంట్స్, బాడీ లాంగ్వేజ్ యాక్షన్ లవర్స్‌కు పూనకాలు తెప్పిస్తాయి.
ఇక కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ఈ సినిమాకు మెయిన్ పిల్లర్. ప్రతి యాక్షన్ సీన్‌ను తన మార్క్ థంపింగ్ మ్యూజిక్‌తో థియేటర్లు దద్దరిల్లేలా రీ-రికార్డింగ్ ఇచ్చారు. విజువల్స్ కూడా చాలా రిచ్‌గా, కాస్ట్‌లీగా కనిపిస్తాయి.
యాక్షన్ పరంగా స్కోర్ చేసిన దర్శకుడు, కథనం (Screenplay) విషయంలో మాత్రం కాస్త ట్రాక్ తప్పాడు. ప్లాట్ పాయింట్ 7 వేల కోట్ల స్కామ్ అంటూ భారీగా లైన్ తీసుకున్నప్పటికీ, దాన్ని నడిపించిన స్క్రీన్‌ప్లేలో గ్రిప్పింగ్ మిస్ అయింది. ఫస్టాఫ్ అంతా చాలా వరకు మనం రెగ్యులర్ సినిమాల్లో చూసే ఊహించదగ్గ సీన్లతోనే సాగుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా అర్జున్ లాంటి పవర్‌ఫుల్ హీరోను ఢీకొట్టే విలనిజం అంత బలంగా డిజైన్ చేయకపోవడం మైనస్. ఎమోషనల్ సీన్లు కూడా ఆడియన్స్‌కు అంతగా కనెక్ట్ అవ్వవు.
నటీనటుల పర్ఫార్మెన్స్
అర్జున్ సర్జా: తన వన్-మ్యాన్ షోతో సినిమాను భుజాలపై మోశారు. వన్ మోర్ టైమ్ ఎందుకు తను యాక్షన్ కింగో ప్రూవ్ చేశారు.ప్రీతీ ముకుందన్ కూతురి పాత్రలో అద్భుతంగా నటించింది. కేవలం ఎమోషన్స్ మాత్రమే కాదు.. యాక్షన్ సీన్స్‌లోనూ అర్జున్‌తో పోటీపడి మరీ అదరగొట్టింది. వీరిద్దరి తండ్రీకూతుళ్ల బాండింగ్ బాగుంది.
ప్లస్ పాయింట్స్ :
- యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా వింటేజ్ యాక్షన్, కరాటే స్టంట్స్
- రవి బస్రూర్ ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM)
- హాలీవుడ్ రేంజ్‌లో డిజైన్ చేసిన యాక్షన్ బ్లాక్స్ & రిచ్ విజువల్స్
మైనస్ పాయింట్స్ :
- కథలో కొత్తదనం లేకపోవడం (రొటీన్ రివెంజ్ డ్రామా)
- చప్పగా సాగే విలన్ క్యారెక్టరైజేషన్
- సాగదీసినట్లు అనిపించే కొన్ని ఎమోషనల్ సీన్లు
చివరగా ..
మీరు గనుక ప్యూర్ యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారైతే, థియేటర్లలో అర్జున్ మార్క్ ఫైట్స్ అండ్ రవి బస్రూర్ BGM మిమ్మల్ని అస్సలు నిరాశపరచవు. అయితే, కొత్త తరహా కథను, మైండ్ గేమ్స్ లాంటి గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేను ఆశించి వెళ్తే మాత్రం కాస్త నిరాశ తప్పదు. వీకెండ్‌లో టైమ్ పాస్ కోసం థియేటర్లో ఒకసారి హ్యాపీగా చూసేయదగ్గ "యాక్షన్ ప్యాక్డ్ అడ్వెంచర్" ఇది!
'బ్లాస్ట్ జోన్'.. కేవలం యాక్షన్ ప్రియుల కోసమే!
Blast Zone Movie Review and Rating :2.75/5

