Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Brahmamudi Serial Today Episode August 28th 'బ్రహ్మముడి' సీరియల్‌: వ్రతానికి రాజును ఒప్పించిన ఇందు

Brahmamudi Serial Today Episode August 28th 'బ్రహ్మముడి' సీరియల్‌: వ్రతానికి రాజును ఒప్పించిన ఇందు

Big TV Live 2 weeks ago

Brahmamudi serial today Episode: రాజుకు ఇంట్లో జరిగే వరలక్ష్మీ వ్రతం గురించి చెప్తుంది. నువ్వు ఇంట్లోనే ఉండాలని.. ఏ పని పెట్టుకోకూడదని చెప్తుంది.

అందుకు రాజు ఒప్పుకోడు.. దేవుడితో నేను ఆటలాడను అంటూ చెప్పగానే.. నువ్వేం నా పక్కన కూర్చోవద్దు అని మూలగా ఒక జూనియర్ ఆర్టిస్ట్‌ లా కూర్చోమని చెప్తుంది ఇందు. అయినా వరలక్ష్మీ వ్రతం అనేది భర్త రావాలని చేస్తారు కదా అందుకు భర్త ఉండటం ఏంటి..? అని అడగ్గానే.. ఇందు ఏదేదో కహాని చెప్తుంది. రాజు కన్పీజ్‌గా అయితే తప్పదు అంటావా..? అని అడిగితే.. తప్పడు మనల్ని ఐషు అందరి ముందు ఇరికించేసింది అంటూ చెప్తుంది. రాజు అయితే ఓకే అంటాడు.

మరుసటి రోజు అపర్ణ వరలక్ష్మీ వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేయిస్తుంది. పంతులు పూజలో కూర్చునే దంపతులు రావాలని చెప్తాడు. అపర్ణ ఇందు, రాజులను త్వరగా రావాలని పిలుస్తుంది. అంతా విన్న భ్రమరాంబ ఐషు నువ్వేమో ఆ రాజు వ్రతంలో కూర్చోడు అన్నావు.. ఇక్కడేమో అపర్ణ హడావిడి చేసేస్తుంది అని అడగ్గానే.. శేషు ఇదంతా ఐషు వెర్రితనం భ్రమరం లేకపోతే వాళ్లెందుకు వ్రతం చేసుకోరు చెప్పు అనగానే.. ఐషు బాబాయ్‌ నేను చెప్పింది నిజం ఇప్పుడు రాజు రాడు చూడండి ఆ ఇందు వచ్చి రాజుకు ఏదో పని ఉంది వ్రతం నేను చేయలేను అని చెప్తుంది మీరే చూడండి అనగానే.. అప్పుడే ఇందు, రాజు రెడీ అయి కిందకు వస్తుంటారు.. శేషు అటు చూడు అంటాడు. వాళ్లిద్దరు రావడం చూసి ఐషు షాక్‌ అవుతుంది. బ్రమరాంబ వచ్చేశారు అంటుంది.

ఐషు మాత్రం వచ్చినంత మాత్రాన వ్రతం పూర్తి చేయరు చూస్తూ ఉండండి.. వాళ్లు పూజలో కూర్చుంటారేమో కానీ రాజు ఇందు మీద అక్షింతలు వేసి ఆశీర్వదించడు మీరు చూస్తు ఉండండి అని చెప్తుంది. పంతులు అందరిని పిలిచి పూజలో కూర్చోబెడతాడు. అపర్ణ ఐషును కూడా వ్రతంలో కూర్చోమంటే.. ఐషు నాకు ఇవన్నీ నచ్చవు అని చెప్తుంది. ఇందు మాత్రం నువ్వు వ్రతంలో కూర్చుంటే నువ్వు కోరుకున్న డబ్బున్న వ్యక్తి భర్తగా రావాలని కోరుకుందాం అనుకున్నాను అని చెప్పగానే.. శేషు కూడా అమ్మ ఐషు మంచి భర్త రావాలంటే.. వ్రతంలో కూర్చోవాలి ఆలోచించుకో అని చెప్పగానే.. అమ్మో వ్రతంలో కూర్చోకోకపోతే ఎవడో బికారి గాడు మొగుడుగా వస్తే.. సరేలే వ్రతంలో కూర్చుందాం.. అని వెళ్లి కూర్చుంటుంది.

వ్రతంలో కూర్చున్న ఒక్కోక్కరు ఒక్కో కోరిక కోరుకుంటారు. పంతులు పూజ పూర్తి చేయిస్తాడు. ఇందు అమ్మవారికి హారతి ఇస్తుంది. అందరూ హారతి తీసుకుంటారు. హారతి అయిపోగానే.. వ్రతం పూర్తి అయింది. అందరూ తమ భర్తల దగ్గర అక్షింతలతో ఆశీర్వాదాలు తీసుకోండి అని చెప్తాడు. ఆ మాటలకు రాజు షాక్‌ అవుతాడు. ఇందు రాజు వైపు చూస్తుంది. ఇదేంటి ఇలా చూస్తుంది. కొంపదీసి అక్షింతలు వేయమంటుందా..? ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదని మనసులో అనుకుంటాడు. ఒక్కోక్కరు తమ భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంటారు. అప్పుడే ఐశ్వర్య కలగజేసుకుని అందరూ ఆశీర్వాదం తీసుకున్నారు కదా మీరు తీసుకోవడం లేదేంటి..? ఏంటి రాజు అలా చూస్తున్నావు.. నువ్వు నీ భార్యను అక్షింతలు వేసి ఆశీర్వదించు అని చెప్పగానే.. రాజు అయోమయంగా చూస్తుంటాడు.

లక్కీ మాత్రం భయంగా వీడు దొరికిపోతాడా ఏంటి..? వీడి దొరికిపోతే మమ్మల్ని ఇద్దరినీ ఇంట్లోంచి గెంటేస్తారు.. అప్పుడు ఈ రేఖ మేడం మా అమ్మ గురించి వెతకదు అని మనసులో అనుకుంటూ కంగారుపడుతుంటాడు. అందరూ తలో మాట అంటుంటే.. రాజు కోపంగా రా ఇందు వచ్చి నా కాళ్ల మీద పడు ఆశీర్వదిస్తాను అంటూ అక్షింతలు తీసుకుంటే.. ఇందు వెళ్లి రాజు కాళ్ల మీద పడుతుంది. రాజు భయంగా అమ్మా భారం అంతా నీదే నన్ను క్షమించు అంటూ ఆశీర్వదించడానికి రెడీ అవుతాడు. లక్కీ మాత్రం వావ్‌ ఏం యాక్టింగ్‌ చేస్తున్నావురా అనుకుంటాడు. ఐషు కూడా అమ్మవారి ముందు ఆశీర్వదిస్తున్నాడు ఇప్పుడు కనక రాజు ఆశీర్వదిస్తే ఇక జన్మలో రేఖ ఆంటీ నన్ను నమ్మదు అని మనసులో అనుకుంటుంది. కట్‌ చేస్తే.. హాస్పిటల్ లో ఉన్న అమ్మాయి స్పృహలోకి వస్తుంది. వెంటనే హాస్పిటల్‌ నుంచి రాజుకు ఫోన్‌ చేస్తారు. అమ్మాయి స్పృహలోకి వచ్చిందని చెప్తారు. రాజు ఆశీర్వదించకుండా వెళ్లిపోతాడు. అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live