Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Brahmamudi Serial Today Episode July 6th 'బ్రహ్మముడి' సీరియల్‌: రాజుకు ఫోన్ చేసి ఇంటికి వచ్చేయమన్న అపర్ణ

Brahmamudi Serial Today Episode July 6th 'బ్రహ్మముడి' సీరియల్‌: రాజుకు ఫోన్ చేసి ఇంటికి వచ్చేయమన్న అపర్ణ

Big TV Live 6 days ago

Brahmamudi serial today Episode: రాజు ఇంట్లోంచి వెళ్లిపోయిన విషయం తెలుసుకున్న అపర్ణ కోపంగా ఇందును తిడుతుంది. నువ్వెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావని నిలదీస్తుంది.

దీంతో అపర్ణ కోపంగా రాజుకు ఫోన్‌ చేయబోతుంది. రేఖ కోపంగా తనంతట తానే వెళ్లిపోయాడని చెప్తుంది కదా..? మళ్లీ నువ్వెందుకు ఫోన్‌ చేస్తున్నావు అంటూ చెప్తుండగానే.. అపర్ణ ఫోన్‌ చేస్తే రాజు ఫోన్‌ కలవదు. ఇందు కోపంగా ఫోన్‌ లాక్కుని కింద పడేసి వెళ్లిపోతుంది. అపర్ణ వెనకాలే వెళ్తుంది. రేఖ మాత్రం హ్యాపీగా ఏంటి వదిన ఇప్పుడేమంటావు.. నేను చెప్పాను కదా ఆ రాజు గాడిని ఇందే వెళ్లగొడుతుంది అని చెప్పాను కదా..? అనగానే.. భ్రమరాంబ ఊపిరి పీల్చుకుంటూ వాడు వెళ్లిపోయాడు అంటేనే నాకు ప్రాణం హాయిగా ఉంది రేఖ అంటుంది. ఐశ్వర్య మాత్రం వాడు వెళ్లిపోవడమే కాదు ఆంటీ.. ఒకప్పటిలా మళ్లీ నువ్వు చక్రం తిప్పాలి.. వాళ్లందరు మనకు బానిసల్లా ఉండాలి అని చెప్పగానే.. రేఖ అంతా నువ్వు అనుకున్నంత జరుగుతుంది. ఇప్పుడే కదా కథ మొదలైంది అంటుంది.

ఇంటికి వెళ్లిన రాజు బాధగా ఇందు ఇచ్చిన డబ్బులు గుర్తు చేసుకుని ఇందు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుని బాధపడుతుంటే. వెంకీ వచ్చి అన్నయ్య అసలే జరిగింది. నువ్వు ఇందును పెళ్లి చేసుకోవడం ఏంటి..? ముందు నుంచే మీరు ప్రేమించుకున్నారా..? అని అడగ్గానే.. అదేం లేదని రాజు చెబితే.. నువ్వు వదినను ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నావని అమ్మానాన్న బాధపడుతున్నారు. వదిన అందరికీ నచ్చింది. కానీ అమ్మానాన్న ఎందుకో భయపడుతున్నారు అని చెప్పగానే.. ఏం లేదురా ఎప్పుడో ఎవరికో ఆస్థి ఉన్న వాళ్లకు శత్రువులు ఎక్కువగా ఉన్నారని ఇప్పుడు నాకు కూడా శత్రువులు పుట్టుకొచ్చి నన్ను ఏం చేస్తారోనని భయపడుతున్నారు అని చెప్పగానే.. వెంకట్‌ మాత్రం నువ్వు ఏం చేయాలనుకున్నా చేయ్‌ అన్నయ్య కానీ అమ్మా నాన్నకు చెప్పి చేయ్‌.. నువ్వు చిన్నప్పటి నుంచి ఏం చేసినా చేయకపోయినా పట్టించుకోలేదు కానీ ఈ విషయంలో మాత్రం ఎందుకో చాలా బాధపడుతున్నారు అంటూ చెప్పి వెళ్లిపోతాడు.

తర్వాత అపర్ణ రాజుకు ఫోన్‌ చేస్తుంది. రాజుతో నన్ను నీ సొంత అమ్మమ్మను అనుకుంటే ఇలా వదిలేసి వెళ్లేవాడివా అంటూ ఎమోషనల్‌ అవుతుంది. నిన్ను నా సొంత మనవడు అనుకున్నాను అందుకే నా కష్టసుఖాలు నీతో పంచుకున్నాను.. కానీ నువ్వు పరాయిదానిలా అనుకున్నావు కాబట్టే మీకు మీరు మాట్లాడుకుని వెళ్లిపోయావా..? అది చిన్న పిల్ల అది చెప్తే నువ్వు వెళ్లిపోతావా..? నువ్వు వచ్చాకే ఇందు జీవితం బాగుపడింది. పని మనిషిగా ఓ మూలన పడి ఉండాల్సింది ఇప్పుడు కంపెనీకి సీఈవో అయింది. ఇందు జీవితంలో వెలుగుతు నింపాల్సింది నువ్వే.. ఇప్పుడు నువ్వు వెళ్లిపోయి తన జీవితాన్ని మళ్లీ చీకట్లోకి నెట్టేస్తావో.. నువ్వు తిరిగి వచ్చి తన జీవితంలో ఆ వెలుగులు అలాగే ఉండేలా చేస్తావో ఒకసారి ఆలోచించుకో బాబు అంటూ కాల్‌ కట్‌ చేస్తుంది అపర్ణ.

రూంలో సుభాష్‌కు తినిపిస్తున్న ఇందు దగ్గరకు వెళ్లిన అపర్ణ అసలు నువ్వే చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా..? అంటూ ప్రశ్నించగానే.. ఇందు నేనేం చిన్న పిల్లను కాదు నాన్నమ్మ అన్ని ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్తుంది. ఏంటి పెళ్లి చేసుకుని ఇంట్లోకి తీసుకొచ్చిన భర్తను ఇంట్లోంచి వెళ్లగొట్టడం కరెక్ట్‌ అనుకుంటున్నావా..? అసలు పెళ్లంటే ఏంటి..? బొమ్మలాట అనుకున్నావా..? ఆడుకున్నంత సేపు ఆడుకుని ఎవరి దారిని వాళ్లు వెళ్లిపోవడానికి అంటూ చెప్తుంది. సుభాష్‌ కూడా ఆడపిల్ల భర్తతోనే ఉండాలి అదే కరెక్ట్‌ అని చెప్తాడు. అపర్ణ, కావ్య గురించి కావ్య ధైర్యం గురించి చెప్తుంది. కావ్య తన కాపురాన్ని ఎలా చక్కదిద్దుకుంది చెప్తుంది. ఇందు మాత్రం రాజును వాళ్ల కన్నతల్లింద్రులకు దూరం చేయలేనని.. ఈ సమస్య తనదని తనే పోరాటం చేస్తానని చెప్పి ఇందు వెళ్లిపోతుంది. అపర్ణ మాత్రం ఇది మళ్లీ ఒంటరి అయిపోతే ఆ రేఖ ఏం చేస్తుందోనని భయంగా ఉంది అంటుంది.

రేఖ, భ్రమరాంబ, భూషణ్‌, శేషు అందరూ రాజు గురించి ఆలోచిస్తుంటారు. భ్రమరాంబ మళ్లీ రాజు వస్తే మన పరిస్థితి ఏంటి అని అనుమానపడుతుంది. దీంతో రాజు తిరిగి వచ్చే లోపే ఇందు పేరు మీద ఉన్న ఆస్థులన్నీ తన పేరు మీదకు ట్రాన్స్‌ఫర్‌ చేసుకుంటానని తన ప్లాన్‌ గురించి చెప్తుంది రేఖ. అంతా చాటు నుంచి వింటున్న స్వాతి భయంగా అక్కడి నుంచి ఇందు దగ్గరకు వెళ్లి చెప్తుంది. నువ్వు రాజు బావను ఇంట్లోంచి పంపించి చాలా పెద్ద తప్పు చేశావు అంటుంది. మళ్లీ ఫోన్‌ చేసి బావను రమ్మని చెప్పు అనగానే.. ఇందు అవసరం లేదు.. కానీ ఆస్థి వాళ్ల పేరు మీదకు వెళ్లాలంటే నా సంతకంతో పాటు నా భర్త సంతకం కూడా ఉండాలి కదా..? అని చెప్పగానే.. అందుకోసం కూడా రేఖ ఆంటీ ఏదో ప్లాన్‌ చేసింది అని స్వాతి చెప్పగానే.. ఇందు ఆలోచనలో పడిపోతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live