Brahmamudi serial today Episode: వడ్డీల శంకర్ వచ్చి చలపతిని తన డబ్బులు ఐదు లక్షలు తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దీంతో చలపతి షాక్ అవుతాడు. ఓకేసారి ఐదు లక్షలు అంటే ఎలా ఇవ్వగలను అయినా ఇన్ని రోజులు సమయానికి వడ్డీ కడుతున్నాను కదా ఇప్పుడు సడెన్ గా మొత్తం ఎందుకు అడుగుతున్నావు అనగానే..
ఇన్ని రోజులు నీ కొడుకు జాబ్ ఉండేది. ఇప్పుడు నీ కొడుకు జాబ్ పోయిందట కదా..? అందుకే అడుగుతున్నాను అంటూ శంకర్ చెప్పగానే..చలపతి, లక్ష్మీ ఫీలవుతారు.
అంతా వింటున్న వెంకట్ షాకింగ్‌గా అలాగే చూస్తుండిపోతాడు. శంకర్ మాత్రం కరాకండిగా మొత్తం డబ్బులు వెంటనే ఇవ్వమని అడుగుతాడు. దీంతో చలపతి మూడు లక్షలు తీసుకొచ్చి తర్వాత మిగతా రెండు లక్షలు ఇస్తానని చెప్తాడు. దీంతో తర్వాత అంటే కుదరదని ఈరోజు సాయంత్రం వరకు కావాలని అడుగుతాడు. దీంతో చలపతి రిక్వెస్ట్ చేయగానే. శంకర్ సరే అంటూ వెళ్లిపోతాడు. శంకర్ వెళ్లిపోయాక వెంకట్ బాధపడుతుంటే.. చలపతి ఓదారుస్తుంటాడు. ఈరోజు కాకపోతేనేం రేపైనా మంచి జాబ్ వస్తుంది అంటూ భరోసా ఇస్తాడు.
అపర్ణ పంతులును పిలిపించి ఇందు, రాజు శోభనానికి ముహూర్తం పెట్టిస్తుంది. ముహూర్తం పెట్టిన పంతులు వెళ్లిపోతుంటే. అప్పుడే రేఖ, భూషణ్, భ్రమరాంబ, శేషు, ఇందు వస్తారు. పంతులు ఎందుకు వచ్చారని రేఖ అడగ్గానే..కొత్తగా పెళ్లైన వాళ్లతో ఏదైనా వ్రతం చేయిస్తున్నారేమోనని భూషణ్ అనగానే.. అపర్ణ లేదని చెప్పగానే.. వాళ్లు రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నారు కదా..? మళ్లీ శాస్ర్తోక్తంగా పెళ్లి చేయాలనుకుంటుందేమోనని భ్రమరాంబ చెప్పగానే.. అపర్ణ లేదని ఇందు, రాజుకు శోభనం కోసం ముహూర్తం పెట్టించాను అని చెప్పగానే.. అందరూ షాక్ అవుతారు. ఇందు వద్దని అడ్డుపడితే అపర్ణ నీకు తెలియదు కానీ ఊరుకో అంటూ అపర్ణ చెప్పగానే.. రేఖ కూడా ఇప్పుడే శోభనం ఏంటి అంటుంది.
ఇంతలో కిందకు వచ్చిన రాజు ఎగ్జైంటింగ్‌గా ఎగిరి గంతేస్తుంటే.. రేఖ కోపంగా ఆంటీ ఇంప్పుడు అంత అర్జెంట్‌గా శోభనం చేయడం ఏంటి..? అంటూ ప్రశ్నించగానే.. సుభాష్ కోపంగా అసలు నీ ప్రాబ్లం ఏంటి..? కొత్తగా పెళ్లైన వాళ్లను విడదీయాలని చూస్తున్నావా..? అంటూ నిలదీయగానే.. రేఖ తనకు అలాంటి ఇబ్బంది ఏమీ లేదని చెప్తుంది. దీంతో అపర్ణ ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ కార్యక్రమం జరిగి తీరుతుంది అంటూ అపర్ణ చెప్పగానే.. రేఖ కోపంగా అపర్ణను బెదిరిస్తుంది. దీంతో రాజు కోపంగా రేఖకు వార్నింగ్ ఇస్తాడు. ఇన్ని రోజులు నువ్వేం చేసినా సాగింది. ఇప్పుడు అవన్నీ కుదరవు ఇప్పుడు ఈ రాజు గాడొచ్చాడు.. వాళ్ల మనవడు వచ్చాడు అంటూ వార్నింగ్ ఇస్తాడు. అపర్ణ మాత్రం ఇందును వెళ్లి రెడీ అవ్వమని చెప్పి వెళ్లిపోతుంది. అందరూ వెళ్లిపోయాక శేషు, భ్రమరాంబ హ్యాపీగా ఫీలవుతారు.
భోజనం చేయడానికి కూర్చుని చలపతి ఏదో ఆలోచిస్తుంటాడు. లక్ష్మీ ఏవండి అంటూ పిలవగానే.. ఉలిక్కిపడి లేస్తాడు. చిన్నోడిని కూడా పిలవు భోజనం చేస్తాడు అని చెప్పగానే.. లక్ష్మీ వెంకట్‌ను పిలుస్తుంది. వెంకట్ వచ్చి భోజనం చేయబోతూ.. వడ్డీల శంకర్ మాటలు గుర్తుకు వచ్చి తినడం ఆపేస్తాడు. చలపతి గమనించి ఓరేయ్ చిన్నోడా ఏం ఆలోచిస్తున్నావు ఆ వడ్డీల శంకర్ గురించి ఆలోచిస్తున్నావా..? అదంతా నేను చూసుకుంటాను కదా నువ్వు హ్యాపీగా తిను అని చెప్తాడు. లక్ష్మీ కూడా అరేయ్ మీ నాన్న ఉన్నాడు అన్ని చూసుకుంటాడు.. నువ్వు బాధపడకుండా తిను అంటూ చెప్తుంది. దీంతో వెంకట్ బాధగా ఇప్పుడు కొత్త టెక్నాటజీ వచ్చినందుకు మేము ఇన్ని రోజులు కష్టపడింది మర్చిపోయి మమ్మల్ని తీసేశారు. ఇంత చదువులు చదివి ఏం లాభం. మంచి ఉద్యోగం చేసి మిమ్మల్ని మంచిగా చూసుకోవాలనుకున్నాను అంటూ ఎమోషనల్ అవుతూ భోజనం చేయకుండా వెళ్లిపోతాడు వెంకట్.
రూంలోకి వెళ్లి బాధపడుతున్న వెంకట్‌కు నందు ఫోన్ చేస్తుంది. వెంకట్ ఫోన్ కట్ చేస్తుంటాడు. నందు ఎన్ని సార్లు ఫోన్ చేసినా వెంకట్ ఫోన్ కట్ చేస్తూనే ఉంటాడు. ఎందుకు కట్ చేస్తున్నాడు. ఏమైంది వీడికి ఒకవేళ ఉద్యోగం రాలేదని బాధలో ఉన్నాడా..? ఏమైనా ఉన్నా నా ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా.. అసలు ఏమైంది ఉండొచ్చు వీడికి అంటూ ఆలోచిస్తుంది నందు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.

