Dailyhunt
Bramhamudi Appu : 'బ్రహ్మముడి' అప్పుకు కాబోయే భర్త బ్యాగ్రౌండ్ ఏంటంటే..?

Bramhamudi Appu : 'బ్రహ్మముడి' అప్పుకు కాబోయే భర్త బ్యాగ్రౌండ్ ఏంటంటే..?

Big TV Live 1 month ago

Bramhamudi Appu : స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ సీరియల్స్లలో ఒకప్పుడు మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న సీరియల్స్ లలో బ్రహ్మముడి సీరియల్ ఒకటి..

ఈ సీరియల్ లో ముగ్గురు కొడుకులకు ముగ్గురు కోడలుగా నటించారు. అందులో ఒకరు అప్పు. ఆ ఇంట్లో చిన్న కోడలు పాత్రలో ఈమె నటించింది.. పొట్టిది ఆయన కూడా చాలా గట్టిగా ఉండేది.. పోలీసు అవ్వాలన్న కోరికతో అనుకున్నది సాధించి చూపించింది అప్పు. తన భర్త సాయంతో పోలీస్ ఆఫీసర్ అయ్యి, తిరిగి వచ్చి తన కర్తవ్యాన్ని సక్రమంగా నెరవేరుస్తూ వచ్చింది.. ఆ సీరియల్ కి అప్పు క్యారెక్టర్ ఒక డేరింగ్ అండ్ డాషింగ్ క్యారెక్టర్.. పాత్రలో నటించిన అమ్మాయి పేరు నైనిషా.. ఈయన ఒక బెంగాలీ నటి. గతంలో అనేక సీరియల్స్ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె బ్రహ్మముడి సీరియల్ ద్వారా ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకుంది. ఇటీవలే తనకు కాబోయే భర్తను పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే తనకు కాబోయే భర్త గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. అదేంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

కాబోయే భర్త బ్యాగ్రౌండ్ ఏంటంటే..?

బ్రహ్మముడి అప్పు ఇటీవలే ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే.. గతంలో ఆమె తన భర్త గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఇప్పుడు అతని గురించి మరోసారి వార్తలు వినిపించడం ఆ టాపిక్ గా మారాయి. ఆశిష్ చక్రవర్తి.. ఇతను ఓ సీరియల్ హీరో. జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘చామంతి’ సీరియల్‌లో హీరో ప్రేమ్‌గా నటిస్తున్నాడు.. ఈయన ఒక తమిళ నటుడు.. తెలుగు తమిళంలో వరసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈయన సీరియల్స్ లోకి రాకముందు బాడీ బిల్డర్ గా జిమ్ ట్రైనర్ గా పని చేశారని తెలుస్తుంది. ఎన్నోసార్లు ఆయన బాడీబిల్డర్ పోటీలలో కూడా పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..

Also Read :గురువారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

బాడీ బిల్డర్ గా ఆశీష్…

ఆశిష్ మిస్టర్ మద్రాస్ 2018, మిస్టర్ ఇండియా చెన్నై 2017, మిస్టర్ ఇండియా బెస్ట్ స్కిన్ 2017, మిస్టర్ చెన్నై ఇంటర్నేషనల్ 2019 టైటిల్స్‌ని గెలిచాడు.. ఇలాంటి మంచి బ్యాగ్రౌండ్ ఉన్న వ్యక్తితో అప్పు ఏడు అడుగులు వేయబోతుంది.. మొత్తానికి బ్రహ్మముడి అప్పు త్వరలోనే పప్పు అన్నం పెట్టబోతుందన్నమాట. ఇక వీళ్ల పెయిర్ అయితే చాలా క్యూట్ గా ఉంది. ప్రస్తుతం అప్పు సీరియల్స్ విషయానికి వస్తే.. బ్రహ్మముడి సీరియల్ ఆమె పాత్రకు ఎండింగ్ పడింది. ప్రస్తుతం మరో రెండు సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉందని తెలుస్తుంది. అటు ఆమె కాబోయే భర్త కూడా చామంతి సీరియల్ తో పాటుగా మరో రెండు సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక నైనిషా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పడం అక్కర్లేదు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live