Dailyhunt
BSNL FTTH: సరికొత్త పల్లె విఫ్లవం.. ఏకంగా 79 వేల గ్రామాల్లో.. ఇంటర్నెట్ సేవలు ప్రారంభం!

BSNL FTTH: సరికొత్త పల్లె విఫ్లవం.. ఏకంగా 79 వేల గ్రామాల్లో.. ఇంటర్నెట్ సేవలు ప్రారంభం!

Big TV Live 1 week ago

BSNL FTTH: గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ ను విస్తరించే లక్ష్యంతో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) కీలక ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 79,000కు పైగా గ్రామాల్లో తన హైస్పీడ్ ఎఫ్‌టీటీహెచ్ (ఫైబర్ టు ది హోమ్) సేవలను ప్రారంభించింది.

దీంతో ఆయా గ్రామాల్లోని విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరనున్నట్లు జియో వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఉచితంగా ఫైబర్ ఇన్‌స్టాలేషన్

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘డిజిటల్ భారత్ నిధి’ (Digital Bharat Nidhi) కార్యక్రమంలో భాగంగా బీఎస్ఎన్ఎల్ ఈ వినూత్న కార్యానికి శ్రీకారం చుట్టింది. భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద FTTH సేవలు అందిస్తోంది. దీని కింద గ్రామీణ ప్రాంత వినియోగదారులకు ఎటువంటి ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు లేకుండా ఉచితంగా ఫైబర్ కనెక్షన్ అందించనున్నారు. వినియోగదారులు కేవలం నెలవారీ ప్లాన్ మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుందని బీఎస్ఎన్ఎల్ వర్గాలు చెబుతున్నాయి.

చాలా తక్కువ ధరలో ప్లాన్‌లు

గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని తక్కువ ధరలోనే ప్రత్యేకమైన ప్లాన్ లను BSNL ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా తీసుకొచ్చిన రూ.399 ప్లాన్ లో 40Mbps స్పీడుతో 1400GB వరకూ డేటాను అందిస్తోంది. అలాగే అపరిమిత వాయిస్ కాల్స్ సౌకర్యం ఉంటుంది. అలాగే 30 నెలల వ్యాలిడిటీతో రూ.5,900, రూ.9,900 వంటి ప్లాన్ లను సైతం లాంగ్ టర్మ్ ఆప్షన్లు కింద అందుబాటులో ఉంచింది.

ఉచిత ఓటీటీ సబ్ స్క్రిప్షన్స్ కావాలంటే?

ఒకవేళ హైస్పీడ్ ఇంటర్నెట్ తో పాటు ఉచిత ఓటీటీ ప్రయోజనాలు కావాలంటే నెలకు రూ.999 ప్లాన్ ను ఎంచుకుంటే సరిపోతుందని బీఎస్ఎన్ఎల్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ ప్లాన్ కింద 200Mbps వేగంతో 5000GB డేటా లభించనుంది. అలాగే జియో హాట్ స్టార్, సోనీలైవ్, లయన్స్ గేట్, హంగామా, షెమరో (Shemaroo), ఎపిక్ఆన్ (EpicON) వంటి వాటికి ఉచిత యాక్సెస్ ను పొందొచ్చు.

టార్గెట్ ఏంటంటే?

ఈ ప్రాజెక్ట్ ద్వారా గ్రామాల్లోని పాఠశాలలు, ఆసుపత్రులు, పంచాయతీ కార్యాలయాలు, సామాన్య ప్రజలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది. గ్రామాలు, పట్టణాల మధ్య ఉన్న డిజిటల్ వ్యాత్యాసాన్ని తగ్గించి.. ఇంటర్నెట్ ను గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం చేరువ చేయాలని ప్రయత్నిస్తోంది.

Jio Premium 5G: జియో ప్రీమియం 5G సేవలకు సర్వసిద్ధం.. కానీ ఇంకా వెయిటింగ్ దశలోనే.. కారణం ఏంటంటే?

కనెక్షన్ ఎలా పొందాలి?

మీ గ్రామంలో బీఎస్ఎన్ఎల్ ఎఫ్ టీటీహెచ్ సేవలు అందుబాటులో ఉండి.. కొత్తగా కనెక్షన్ తీసుకోవాలని భావిస్తే కొన్ని స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ముందుగా బీఎస్ఎన్ఎల్ కస్టమర్ కేర్ నెంబర్ కు కాల్ చేసి కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే నేరుగా మీ సమీపంలోని బీఎస్ఎన్ఎల్ ఆఫీసు వద్దకు వెళ్లి మీ వివరాలు అందించడం ద్వారా ఎఫ్ టీటీహెచ్ సేవలను పొందొచ్చు. మెుత్తం మీద దేశంలోని మారుమూల గ్రామాల్లో బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ఇంటర్నెట్ సేవలు వల్ల.. అక్కడి విద్యార్థులతో పాటు వ్యాపారులకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది.

రూ.30,000లోపు బడ్జెట్లో.. మార్కెట్లోని బెస్ట్ ఏసీలు.. ఫీచర్లు, ధర వివరాలివే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live