Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బుల్లెట్ రైల్లో భోజనం ఇలా ఉంటుందా? మీరు అస్సలు ఊహించి ఉండరు!

బుల్లెట్ రైల్లో భోజనం ఇలా ఉంటుందా? మీరు అస్సలు ఊహించి ఉండరు!

Big TV Live 1 week ago

Japan Bullet Train Best Foods: బుల్లెట్ రైళ్లు అనగానే ముందు గుర్తొచ్చే దేశం జపాన్. ఆ దేశానికి చెందిన షింకన్సెన్ రైళ్లు, ప్రపంచ వ్యాప్తంగా స్పీడ్, టైమ్ మెయింటెనెన్స్, అత్యాధునిక సాంకేతికతకు ప్రసిద్ధి చెందాయి.

అయితే, ఈ రైళ్లలో ప్రయాణించే వారికి అద్భుతమైన ఫుడ్ కూడా అందిస్తారు. వాటిలో అత్యంత స్పెషల్ ఫుడ్ 'ఎకిబెన్'. జపనీస్‌లో ఎకి అంటే స్టేషన్, బెంటో అంటే లంచ్ బాక్స్. స్థానిక ప్రాంతాల ప్రత్యేక రుచులను ఒకే బాక్స్‌ లో అందించే ఈ ఫుడ్స్ జపాన్ ఫుడ్ కల్చర్ లో ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఇంతకీ జపాన్ బుల్లెట్ రైళ్లలో అందించే స్పెషల్ ఫుడ్స్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

1.గ్యుటాన్ బెంటో

సెండాయ్ ప్రాంతానికి చెందిన ఈ బెంటోలో గ్రిల్ చేసిన బీఫ్ ప్రత్యేకం. దీనిని అన్నం, ఊరగాయలు, కూరగాయలతో కలిసి వడ్డిస్తారు. ఈ ప్రాంతానికి వెళ్లే ప్రయాణికులు తప్పకుండా రుచి చూసే వంటకాల్లో ఇది ఒకటి.

2.మాసు నో సుషీ

టోయామా ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఈ సుషీలో వెనిగర్ కలిపిన అన్నంపై ట్రౌట్ చేప ముక్కలను ఉంచి, వెదురు ఆకుల్లో చుట్టి ప్రత్యేకంగా ప్యాక్ చేస్తారు. సాదాసీదా రుచితో పాటు తాజాదనానికి ఇది మంచి ఎగ్జాంఫుల్ గా చెప్పుకోవచ్చు.

3.క్రాబ్ ఎకిబెన్

హొక్కైడోతో పాటు సముద్ర తీర ప్రాంతాల్లో పీత మాంసంతో తయారయ్యే ఈ బెంటోలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఉడికించిన పీత మాంసాన్ని అన్నంతో పాటు సైడ్ డిష్‌లతో అందిస్తారు. సీ ఫుడ్ ఇష్టపడేవారికి ఇది మంచి ఆప్షన్.

4.సెల్ఫ్ హీటింగ్ బెంటో

జపాన్‌లోని కొన్ని ఎకిబెన్స్ ప్రత్యేక హీటింగ్ టెక్నాలజీతో వస్తాయి. బాక్స్‌ కు అమర్చిన తాడును లాగితే కొన్ని నిమిషాల్లోనే భోజనం వేడిగా మారుతుంది. దీంతో ప్రయాణికులు ఎప్పుడైనా వేడి భోజనం ఆస్వాదించవచ్చు.

5.చికెన్ కరాగే బెంటో

సోయా సాస్, అల్లం, వెల్లుల్లి లాంటి మసాలాలతో మెరినేట్ చేసిన చికెన్‌ ను డీప్ ఫ్రై చేసి తయారు చేసే కరాగే జపాన్‌ లో ఎంతో ప్రసిద్ధి. దీనిని అన్నం, జపనీస్ ఆమ్లెట్, ఊరగాయలతో కలిపి బెంటో బాక్స్‌ లో అందిస్తారు. చల్లారిన తర్వాత కూడా టేస్టీలో ఎలాంటి తేడా లేకపోవడం దీని ప్రత్యేకత.

6.సీఫుడ్ రైస్ బౌల్

సాల్మన్ రో, సీ అర్చిన్, స్కాలోప్స్, రొయ్యలు లాంటి తాజా సముద్రపు ఆహారాన్ని అన్నంపై వడ్డించే ఈ బెంటోలు తీర ప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తాయి. సీజన్‌ను బట్టి ఇందులోని పదార్థాలు మారుతుంటాయి.

7.వెజిటేరియన్ బెంటో

శాకాహార ప్రయాణికుల కోసం కూడా ప్రత్యేక బెంటో బాక్స్‌ లు అందుబాటులో ఉన్నాయి. టోక్యో లాంటి కీలక స్టేషన్లలో సీజనల్ కూరగాయలు, అన్నంతో తయారైన వెజిటేరియన్ మీల్స్ సులభంగా దొరుకుతాయి.

జపాన్‌ లో బుల్లెట్ రైలు ప్రయాణం అంటే కేవలం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం మాత్రమే కాదు. అక్కడి ప్రాంతీయ రుచులను ఆస్వాదించే అవకాశం కూడా. అందుకే ఎకిబెన్ జపాన్ రైల్వే ప్రయాణంలో స్పెషల్ గా చెప్పుకోవచ్చు.

ఐఆర్‌సిటీసీ క్యాటరింగ్‌ కు షాక్.. ఏకంగా రూ.5.13 కోట్ల ఫైన్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live