Census Preparation: వినియోగించే పొయ్యిలను బట్టే జనాభా లెక్కలు -ఇప్పటికే జనగణనాధికారుల నియామకం పూర్తి
-శిక్షణ ప్రారంభించిన జిల్లా అధికారులు
-జిల్లా కలెక్టర్లే ప్రిన్సిఫల్ సెన్సస్ అధికారులు
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ:వచ్చే ఏడాది నిర్వహించే జనాభా లెక్కలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలో జనాభా అంచనాలకు తగ్గట్టుగా ఎన్యూమరేటర్లు, డివిజన్, సబ్ డివిజన్ వారీగా అధికారులను, సిబ్బందిని నియమిస్తున్నారు. ఇప్పటికే డివిజన్, సబ్ డివిజన్ అధికారులతో జిల్లా యంత్రాంగం జనాభా లెక్కలపై శిక్షణ ఇవ్వడం జరిగింది. అయితే ముందోస్తుగా ఇండ్ల లెక్కింపు చేయడం ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇదంతా డిజిటల్ పద్దతిలోనే కొనసాగించేందుకు తగు చర్యలు చేపట్టింది.
తొలి విడుతలో గృహాల లెక్కింపు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కలయికతో ఘనంగా జనాభా లెక్కలు విజయవంతం చేయాలని కంకణం కట్టుకుంది. ఈ లెక్కల ఆధారంగానే భవిష్యత్తు ప్రణాళికకు ప్రభుత్వాలు బాటలు వేస్తారు. ప్రతి వ్యక్తి లెక్కింపు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. అందుకు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాది ముందుగానే లెక్కింపునకు కసరత్తు చేస్తున్నారు. మే 11 వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు జరిగే తొలివిడుత కార్యక్రమానికి ఎన్యూమరేటర్లు, డివిజన్, సబ్ డివిజన్ అధికారులను నియామించారు. ఈ లెక్కింపు డిజిటల్ పద్దతిలో ఎన్యూమరేటర్ల మొబైల్లో సర్వే చేయించనున్నారు. గృహాల లెక్కింపు వంట పొయ్యి ఆధారంగానే ముందుగా లెక్కించనున్నారు. ఇన్యూమరేషన్ చేయాల్సిన అంశాలను నిర్ణయించనున్నారు. ఉమ్మడి కుటుంబాలు ఉండే వంటింటి పొయ్యిని ప్రామాణికంగా తీసుకుంటారు. ఒక ఇంట్లో ఎన్ని పొయ్యిలు ఉంటే అన్ని కుటుంబాలు ఉన్నట్లుగా పరిగణిస్తారు. వచ్చే ఏడాది ఆయా ఇళ్లల్లో నివసించే కుటుంబాల్లోని సభ్యుల పూర్తి వివరాలను నమోదు చేసుకుంటారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ ప్రత్యేకంగా ఓ సంఖ్య కేటాయిస్తారు.
CM Chandrababu: సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు.. టిడ్కో ఇళ్లకు డబ్బులు వాపస్..!
జిల్లా అధికారులు అదనపు బాధ్యతలు..
జిల్లా ప్రిన్సిపల్ సెన్సస్ అధికారిగా కలెక్టర్లు వ్యవహారించనున్నారు. అదనపు కలెక్టర్లు అదనపు ప్రిన్సిపల్ సెన్సస్ అధికారులుగా, డీఆర్వోలు అదనపు సెన్సస్ అధికారులుగా, జిల్లా ప్రణాళిక అధికారి, విద్యాశాఖాధికారులు, పంచాయతీ అధికారులు, అటవీ శాఖాధికారులు, గణాంక అధికారులు అదనపు జిల్లా సెన్సస్ అధికారులుగా కొనసాగనున్నారు. సంబంధిత శాఖల అధికారుల అధికారులు బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి స్ధానంలో వచ్చే వారు బాధ్యతల్లో కొనసాగుతారు. సబ్ డివిజన్ స్ధాయిలో సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు సబ్ డివిజనల్ సెన్సస్ అధికారులుగా కొనసాగనున్నారు. మునిసిపాలిటీ (అర్బన్) స్థాయిలో మునిసిపాలిటీల కమిషనర్లు ఛార్జ్ సెన్సస్ అధికారులుగా కొనసాగనుండగా, మునిసిపాలిటీలో మేనేజర్లు అదనపు ఛార్జ్ సెన్సస్ అధికారులుగా కొనసాగుతారు. జిల్లాలోని మండలాల తహసీల్దార్లు చార్ట్ సెన్సస్ అధికారులుగా, నాయబ్ తహసీల్దార్లు అదనపు చార్జ్ సెన్సస్ అధికారులుగా కొనసాగనున్నారు.
మండలానికి ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లు..
ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు టెక్నికల్ అసిస్టెంట్లు, చార్జ్ లెవల్ క్లర్కులకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి మండలానికి ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లు, ఇద్దరు చార్జ్ లెవల్ క్లర్కు లను నియమిస్తారు. మునిసిపాలిటీలకు కూడా ఆదే స్థాయిలో నియమించనున్నారు. ప్రతి ఆరుగురు ఎన్యూమరే టర్ల పనితీరును పర్యవేక్షించేందుకు ఒక సూపర్వైజర్ను నియమించనున్నారు. మునిసిపాలిటీలు, మండలాల వారీగా సూపర్వైజర్లకు, ఎన్యూమరేటర్లకు శిక్షణ ఇచ్చేం దుకు ఫీల్డ్ ట్రైనర్లను ఎంపిక చేశారు. ఫీల్డ్ ట్రైనర్లకు ఈనెల 28 నుంచి 30వ తేదీల్లో మూడు రోజులపాటు శిక్షణ ఇవ్వ నున్నారు. జనగణన నిర్వహించేందుకు ఉపాధ్యాయులను ఎన్యూమరేటర్లుగా నియమించనున్నారు. ఎన్యూమరేటర్లుగా ఎవరిని ఎంపిక చేయాలనేది ఇప్పటికే అధికారులు వివరాలు సేకరించారు. వచ్చేనెల 11 నుంచి హౌస్ లిస్టింగ్, ఎన్యూమరేషన్ బ్లాక్ ను గుర్తించనున్నారు.
Also read: Rythu Bharosa: ఈ సారీ రైతు భరోసాలో కొత్త ట్విస్ట్.. ఎన్ని ఎకరాలున్నా తొలివితలో మాత్రం..!

