Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చదువు చెప్పిన టీచర్ పై క్రష్. పదేళ్ళ తరువాత ఆ స్టూడెంట్ చేసిన పనికి బుర్రపాడు

చదువు చెప్పిన టీచర్ పై క్రష్. పదేళ్ళ తరువాత ఆ స్టూడెంట్ చేసిన పనికి బుర్రపాడు

Big TV Live 1 week ago

Korean Melodrama: స్కూల్ టైమ్ లో టీచర్ పై క్రష్… ఆ స్కూల్ నుంచి వెళ్ళిపోయిన పదేళ్ళ తరువాత మళ్లీ రీఎంట్రీ… టీచర్ ను దక్కించుకోవడానికి ఆ కుర్రాడు చేసే పనిని చూడాల్సిందే భయ్యా.

మనసును హత్తుకునే ఈ కొరియన్ మెలోడ్రామా సిరీస్ పేరే ‘ది మిడ్‌నైట్ రొమాన్స్ ఇన్ హాగ్వాన్’ (The Midnight Romance in Hagwon). ఈ మెచ్యూర్ రొమాంటిక్ డ్రామా 2024లోనే విడుదలైంది. మరి వి హా-జూన్, జంగ్ రియో-వాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ 16 ఎపిసోడ్ల కొరియన్ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? తెలుగులో అందుబాటులో ఉందా ? అనే వివరాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

సియోల్‌ లోని ధనిక ప్రాంతం గంగ్నమ్‌. అక్కడి డేచి-డాంగ్‌లో ఉన్న ప్రముఖ హాగ్వాన్‌లో కథ సాగుతుంది. సియో హ్యే-జిన్ గత 14 ఏళ్లుగా అక్కడ స్టార్ కొరియన్ లాంగ్వేజ్ టీచర్‌ గా పని చేస్తుంది. ఆమె విద్యార్థులను టాప్ యూనివర్సిటీల్లోకి చేర్చడంలో చాలా పాపులర్. కఠినమైన డిసిప్లిన్, అంకితభావం, అనుభవం ఆమెను హాగ్వాన్ ప్రపంచంలో ఒక ఐకాన్‌గా మారుస్తాయి. ఒకరోజు హ్యే-జిన్ జీవితంలో ఊహించని మలుపు వస్తుంది.

ఆమె పాత విద్యార్థి లీ జున్-హో హఠాత్తుగా ఆ అకాడమీలోనే రూకీ ఇన్‌స్ట్రక్టర్‌గా జాయిన్ అవుతాడు. 10 ఏళ్ల క్రితం హ్యే-జిన్ వద్ద చదువుకున్న జున్-హో, ఒక పెద్ద కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి టీచింగ్ ఫీల్డ్‌కు వచ్చాడు. ఈ నిర్ణయం హ్యే-జిన్‌ను తీవ్ర ఆశ్చర్యంలో ముంచేస్తుంది. జున్-హో కేవలం కెరీర్ మార్పు కోసం మాత్రమే రాలేదు. గత 10 ఏళ్లుగా తన మాజీ టీచర్ హ్యే-జిన్‌పై అతనికి ఉన్న అనురాగం, క్రష్ అతన్ని అక్కడికి తీసుకొచ్చింది.

మొదట్లో హ్యే-జిన్ అతన్ని తన పాత విద్యార్థిగానే చూసి దూరం పెట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ రాత్రి పూట అకాడమీలో కలిసి క్లాసులు ప్లాన్ చేయడం, విద్యార్థుల సమస్యలు చర్చించడం, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం ద్వారా వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. జున్-హో మెచ్యూర్డ్ ఆలోచనలు, హ్యే-జిన్‌పై అతని నిశ్శబ్ద ప్రేమ, ఆమెను గౌరవించే విధానం క్రమంగా ఆమె గుండెను కరిగిస్తాయి. ఇలా వారిద్దరి మధ్య సీక్రెట్ ఆఫీస్ రొమాన్స్ మొదలవుతుంది.

ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. సిరీస్ కేవలం రొమాన్స్‌కు పరిమితం కాకుండా, కొరియా ప్రైవేట్ ఎడ్యుకేషన్ వ్యవస్థలోని తీవ్రమైన పోటీ, రాజకీయాలు, టీచర్ల మధ్య గాసిప్స్, కుట్రలను కూడా బయట పెడుతుంది. హ్యే-జిన్ పాపులారిటీని చూసి అసూయపడిన ప్రత్యర్థి డైరెక్టర్ చోయ్ హ్యోంగ్-సన్ ఆమెను దించేయడానికి కుట్రలు పన్నుతుంది. మరి ఆ కుట్రలు ఏంటి ? వాటన్నింటి నుంచి హీరోయిన్ ఎలా బయట పడింది ? చివరికి హీరో హీరోయిన్ ఒక్కటయ్యారా లేదా ? అన్నది ఈ సిరీస్ స్టోరీ.

రెండు ఓటీటీలలో

కాగా ‘ది మిడ్‌నైట్ రొమాన్స్ ఇన్ హాగ్వాన్’ Netflix, Amazon Prime Video ఓటీటీలలో అందుబాటులో ఉంది. అయితే ఈ సిరీస్ తెలుగులో అందుబాటులో లేదు.

హనీమూన్ అంటేనే ఆమడ దూరం పారిపోయేలా చేసే తమిళ మూవీ… క్లైమాక్స్ ట్విస్ట్ డోంట్ మిస్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live