Best floor cleaning robots 2026: ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ఈ రోజుల్లో ఒక పెద్ద సవాలుగా మారింది. ప్రత్యేకంగా నేలపై పడిన మొండి మరకలను తుడవడం చాలా కష్టమైన పని.
ఇలాంటి సమయాల్లో.. హై-ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ మాప్ టెక్నాలజీతో వచ్చే రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్లు అద్భుతంగా పని చేస్తాయి. ఇవి సాధారణంగా తుడవడం కాకుండా.. సెకనుకు వేల సార్లు వైబ్రేట్ అవుతూ నేలపై ఉన్న గట్టి మరకలను సైతం ఈజీగా వదిలిస్తాయి. మీ ఇంటి పనిని సులువుగా మార్చే టాప్-5 ఫ్లోర్ క్లీనింగ్ రోబోట్ల వివరాలు వాటి ధరలతో సహా మీకోసం.
మొండి మరకలను వదిలించే 5 బెస్ట్ ఫ్లోర్ క్లీనింగ్ రోబోట్లు:
నేటి కాలంలో గూగుల్ అసిస్టెంట్, అలెక్సాతో కనెక్ట్ అయ్యి, చేతితో తాకాల్సిన అవసరం లేకుండా ఇళ్లను క్లీన్ చేసే స్మార్ట్ రోబోలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో వైబ్రేషన్ మాపింగ్ ఫీచర్ ఉన్న టాప్ 5 మోడల్స్ ఇవే..
1. రోబోరాక్ S8 మాక్స్ వి ఆల్ట్రా (Roborock S8 MaxV Ultra):
రోబోరాక్ బ్రాండ్ క్లీనింగ్ రోబోట్లలో ఎప్పుడూ ముందే ఉంటుంది. దీనిలోని VibraRise 3.0 Mopping System నిమిషానికి 4,000 సార్లు హై-ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది. ఇది 10,000 Pa సూపర్ సక్షన్ పవర్‌తో వస్తుంది. నేలపై ఎండిపోయిన కాఫీ మరకలు, జిడ్డును కూడా క్షణాల్లో క్లీన్ చేస్తుంది. కార్పెట్లను గుర్తించినప్పుడు ఇది తన మాప్‌ను పైకి లేపుతుంది, దీనివల్ల కార్పెట్లు తడవవు. దీని ధర రూ.79,999 వరకు ఉంటుంది.
2. ఎకోవాక్స్ డీబోట్ X8 ప్రో ఓమ్ని (Ecovacs Deebot X8 Pro Omni):
ఈ రోబోట్ కేవలం వైబ్రేషన్ మాత్రమే కాదు.. పెయింట్ రోలర్ లాంటి ప్రత్యేకమైన రోలర్ మాప్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇది నేలపై 4,000Pa ఒత్తిడిని కలిగిస్తూ, నిమిషానికి 200 రౌండ్లు తిరుగుతూ క్లీన్ చేస్తుంది. దీని ఆటో-క్లీనింగ్ ఓమ్ని స్టేషన్, క్లీనింగ్ అయిపోయాక మాప్‌ను వేడి నీటితో కడిగి.. వేడి గాలితో ఆరబెడుతుంది. దీని వల్ల ఎలాంటి దుర్వాసన రాదు. దీని అంచనా ధర రూ.95,999 నుంచి రూ. 99,999 వరకు ఉంటుంది.
3. డ్రీమీ X40 ఆల్ట్రా (Dreame X40 Ultra):
అత్యంత శక్తివంతమైన సక్షన్ , మోపింగ్ సామర్థ్యం ఉన్న రోబోట్ ఇది. మూలల్లో ఉన్న మురికిని వదిలించడానికి దీని మాప్స్ పక్కకు జరిగి మరీ క్లీన్ చేస్తాయి.
ఏకంగా 12,000 Pa సక్షన్ పవర్ దీని సొంతం. హై-ఫ్రీక్వెన్సీ స్క్రబ్బింగ్ ద్వారా కిచేన్‌లోని మొండి జిడ్డు మరకలను కూడా ఇది సులువుగా తొలగిస్తుంది.
AI కెమెరా, 3D సెన్సార్ల సహాయంతో ఇంట్లోని వస్తువులను గుర్తిస్తూ దారి మార్చుకుంటుంది. దీని అంచనా ధర రూ.79,999 వరకు ఉంటుంది.
4. యూఫీ రోబోవ్యాక్ ఓమ్ని E28 (Eufy Robot Vacuum Omni E28):
మీరు బడ్జెట్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే హై-ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ మాప్ కోసం చూస్తుంటే యూఫీ బెస్ట్ ఛాయిస్. దీనిలోని HydroJet సిస్టమ్ మాప్‌ను ఎప్పటికప్పుడు రియల్ టైమ్‌లో క్లీన్ చేస్తూ ఉంటుంది. దీని వల్ల ఒకచోట ఉన్న మురికి నీరు ఇల్లంతా వ్యాపించదు. 20,000 Pa పవర్‌తో చిన్న చిన్న ధూళి కణాల నుంచి పెంపుడు జంతువుల వెంట్రుకల వరకు అన్నింటినీ లాగేస్తుంది. దీని అంచనా ధర రూ. 45,000 నుంచి రూ. 55,000 వరకు ఉంటుంది.
ఫ్యాన్ తిరుగుతుంది కానీ బిల్లు రాదు.. ఈ లేటెస్ట్ ఫ్యాన్ల ధరలు తెలుసా?
5. ఐరోబోట్ బ్రావో జెట్ m6 (iRobot Braava Jet m6):
ఇది కేవలం మోపింగ్ కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన స్మార్ట్ రోబోట్. ఇది నేలపై ఉన్న మొండి మరకలపై ముందుగా వాటర్ స్ప్రే చేస్తుంది. ఆ తర్వాత వైబ్రేటింగ్ క్లీనింగ్ ప్యాడ్ సహాయంతో ఆ ప్రదేశాన్ని రుద్ది శుభ్రం చేస్తుంది. ఇల్లు పెద్దగా ఉంటే బ్యాటరీ అయిపోగానే.. దానంతట అదే ఛార్జింగ్ పెట్టుకుని, మిగిలిన పనిని మళ్లీ మొదలుపెడుతుంది. దీని అంచనా ధర రూ.39,900 నుంచి రూ. 44,900 వరకు ఉంటుంది.
ఇంట్లో పిల్లలు లేదా పెంపుడు జంతువులు ఉన్నప్పుడు నేలపై మరకలు పడటం సాధారణం. సాధారణ రోబో వ్యాక్యూమ్‌లు కేవలం దుమ్మును మాత్రమే పీలుస్తాయి. కానీ, పైన పేర్కొన్న హై-ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ మాప్ టెక్నాలజీ ఉన్న రోబోలు నేలను చేత్తో తుడిచినట్లే స్క్రబ్ చేసి క్లీన్ చేస్తాయి. మీ బడ్జెట్, అవసరాలను బట్టి వీటిలో ఒకదాన్ని ఎంచుకుంటే మీ ఇంటి ఫ్లోర్ క్లీనింగ్ టెన్షన్ పూర్తిగా తగ్గిపోతుంది.

