Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చిన్న ఊళ్లలో పీవీఆర్.. ఇక పాత థియేటర్లకు గుడ్‌బైనా?

చిన్న ఊళ్లలో పీవీఆర్.. ఇక పాత థియేటర్లకు గుడ్‌బైనా?

Big TV Live 2 weeks ago

PVR INOX:'మేము అతి త్వరలోనే చిన్న పట్టణాల్లో దాదాపు 1000 స్మార్ట్ సినిమా హాల్స్ తీసుకొస్తాం' అంటూ క్రేజీ అనౌన్స్‌మెంట్ వదిలింది పీవీఆర్ ఐనాక్స్.ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో కూడా ఇదే హాట్ టాపిక్.

తీసుకొస్తాం అన్నారు.. కానీ నిలబడతాయా?

తీసుకొస్తాం అనేవరకు బాగానే ఉంది.కానీ ఆ తెచ్చినవి ఎంతవరకు మనుగడలో ఉంటాయా అన్నదే ఇక్కడ అసలు సమస్య.కారణం.. సినిమా టికెట్ అటు ఎక్కువ కాకుండా ఇటు తక్కువ కాకుండా రూ.190కి తీసుకొస్తామని అంటున్నారు. రేటు ఓకే.

టికెట్ కంటే పాప్‌కార్న్ ఖర్చే ఎక్కువా?

కానీ ఆ మీద బాదుడు అంటే పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ ఖర్చులు మల్టీప్లెక్స్‌లలో ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్పక్కర్లేదు.ఇక సినిమాకి వెళ్లిన వాళ్లు అవి తినకుండా ఉంటారా అంటే అనుమానమే.మళ్లీ బయటకు వచ్చాక సినిమా ఖర్చు లెక్క తీస్తే చాంతాడంత అవడం ఖాయం.అసలే చిన్న చిన్న పట్టణాల్లో మరీ లెక్కలేసుకుని సినిమాకి వెళ్లే వాళ్లు ఎక్కువ. అది అవసరం కూడా.

అలాంటిది ఆ సినిమాకి ఖర్చుపెట్టిన డబ్బుతో.. “అరే.. ఇంట్లోనే ఎంచక్కా బిర్యానీ చేసుకుని తినేవాళ్లం కదా” అన్న ఆలోచన వస్తే మాత్రం మల్టీప్లెక్స్‌లు ఎంతవరకు మనుగడలో ఉంటాయో పీవీఆర్ వాళ్లే డిసైడ్ కావాలి.

మాస్ ఆడియన్స్‌కు చిన్న స్క్రీన్లు నచ్చుతాయా?

అదలా ఉంటే.. ఇక స్క్రీన్ సంగతి.మామూలుగా పీవీఆర్ మల్టీప్లెక్స్‌లలో స్క్రీన్ సైజులు కాస్త చిన్నగానే ఉంటాయి.అసలే మాస్ ఆడియన్స్‌కు పెద్ద స్క్రీన్ అంటేనే ఎక్కువ ఇష్టం.వాళ్ల అభిమాన హీరో వస్తుంటే విజిల్స్ వేయడానికి, రచ్చ రచ్చ చేయడానికి ఆ మాత్రం ఉండాలి కూడా.

మరి హోమ్ థియేటర్ సైజులో ఉండే పీవీఆర్ స్క్రీన్లు ఆ మాస్ ఆడియన్స్‌ని మెప్పిస్తాయా అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న.

తెలుగు ప్రేక్షకుల అభిరుచి వేరు

ఇక మామూలుగా తెలుగు ఆడియన్స్ ఎక్కువ శాతం సినిమా అంటే పెద్ద తెర మీదే చూడాలని బలంగా ఫిక్స్ అయిపోతారు.ఇక ఇక్కడ మరోటి గుర్తించాల్సిన విషయం ఏంటంటే.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బ్రాండ్ కంటే కంఫర్ట్‌కే ఎక్కువ విలువిస్తారు.

సో.. టికెట్ తక్కువ పెట్టి పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ అంటూ బాదితే మాత్రం మళ్లీ పాత సింగిల్ స్క్రీన్‌కే క్యూ కట్టడం పక్కా.

సింగిల్ స్క్రీన్స్‌లో ఉండే సందడి వేరే లెవల్

ఇక్కడ మరో విషయం కూడా ఉందండోయ్.సింగిల్ స్క్రీన్స్ గురించి చాలామంది నెగటివ్‌గా మాట్లాడినా.. అసలు సిసలైన ఫెస్టివల్ మొదలయ్యేది అక్కడే.ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా కటౌట్లు, పాలాభిషేకాలు, బాణాసంచా, డ్యాన్సుల హంగామా అంతా కనిపించేది ఆ సింగిల్ స్క్రీన్స్ కాంపౌండ్స్‌లోనే.అలాంటి సందడి మీరు మల్టీప్లెక్స్‌లో భూతద్దం పెట్టి వెతికినా దొరకదు.ఒక రకంగా చెప్పాలంటే అభిమానులకు సింగిల్ స్క్రీన్ అనేది ఒక టెంపుల్.

సింగిల్ స్క్రీన్ ఓనర్స్ స్పందన ఎలా ఉంటుంది?

ఇక మరొకటి ఏంటంటే.. పీవీఆర్ గనక చిన్న పట్టణాల్లోకి వస్తే అక్కడ ఆల్రెడీ ఉన్న సింగిల్ స్క్రీన్స్ ఓనర్స్ వీటిని ఎంతవరకు ఇన్వైట్ చేస్తారన్నది పెద్ద ప్రశ్న.చాలామంది ఇప్పటికే తమ పాత సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కొత్త కొత్త సొగసులు అద్దుతూ ఆడియన్స్‌ని తమ వైపు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.ఇలాంటి సమయంలో పీవీఆర్ అక్కడ ఎంటర్ అయితే వీళ్లకి, వాళ్లకి తగువులు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ.

ఆలోచన బాగానే ఉంది.. అమలు ఎలా ఉంటుందో

ఏదేమైనా.. ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట ఒక్కటే.“పీవీఆర్ ఆలోచన బాగుంది… కానీ అది ఎంతవరకు అమలు అవుతుందా?” అని!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live