Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చిరంజీవిపై హీరో సుమన్ షాకింగ్ కామెంట్స్!

చిరంజీవిపై హీరో సుమన్ షాకింగ్ కామెంట్స్!

Big TV Live 2 days ago

Actor Suman: 5 దశాబ్దాల కెరియర్ లో 10 భాషలలో 700కు పైగా చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు హీరో సుమన్(Suman ).

1980 – 90ల మధ్యకాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా పేరు దక్కించుకున్న ఈయన.. తన అద్భుతమైన నటనతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు. సినిమాలలో హీరోగా నటించడమే కాకుండా లార్డ్ వెంకటేశ్వరుడు, శివుడు, రాముడు వంటి పౌరాణిక పాత్రలను కూడా పోషించారు. ముఖ్యంగా 1993లో కృష్ణంరాజుతో నటించిన ‘బావ బామ్మర్ది’ చిత్రంలోని తన పాత్రకు ఏకంగా ఉత్తమ నటుడిగా నంది అవార్డు కూడా లభించింది. విలన్ పాత్రలతో కూడా ఏషియానెట్ ఫిలిం హానర్ స్పెషల్ జ్యూరీ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.

దక్షిణాదిలో బెస్ట్ డ్యాన్సర్ ఆయనే – చిరంజీవి

సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న సమయంలోనే రాజకీయాల్లో కూడా చురుకుగా పాల్గొన్న విషయం తెలిసిందే. అలాంటి ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమన్ మాట్లాడుతూ..” నార్త్ ఇండస్ట్రీలో నాకు తెలియదు కానీ సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యద్భుతంగా డాన్స్ చేసే ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి.

ఆయనకు దేవుడిచ్చిన గొప్ప వరం – సుమన్

ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నాను అంటే.. మీరు గమనించవచ్చు.. నేల కింద చూడకుండా డాన్స్ చేసే ఏకైక హీరో ఎవరంటే చిరంజీవి మాత్రమే. కమల్ హాసన్ గారు కూడా నేల చూసి డాన్స్ చేస్తారు. నా అభిప్రాయం ప్రకారం నేల కింద చూడకుండా డాన్స్ చేసే ఏకైక డాన్సర్ చిరంజీవి గారు మాత్రమే. మ్యూజిక్ వచ్చిందంటే ఆయన బాడీలో కనిపించే రిథమ్ చాలా అద్భుతం. ముఖ్యంగా ఆయనకి అది దేవుడిచ్చిన గొప్ప వరం” అంటూ సుమన్ కామెంట్లు చేశారు. మొత్తానికైతే మెగాస్టార్ చిరంజీవి పై ప్రశంసలు కురిపిస్తూ సుమన్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా మెగా అభిమానులు ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు.

వితౌట్ బ్యాక్ గ్రౌండ్.. నేడు ఇండస్ట్రీనే శాసిస్తూ..

మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే.. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి, ప్రతి నాయకుడిగా తన కెరీర్ ను మొదలుపెట్టి హీరోగా, సుప్రీం హీరోగా, స్టార్ హీరోగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ నేడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి మెగాస్టార్ గా స్థిరపడిపోయారు. నాటికి నేటికి ఏమాత్రం తేడా లేకుండా వరుస అవకాశాలతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్లను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ వయసులో కూడా యంగ్ హీరోలకు పాన్ ఇండియా , స్టార్ హీరోలకి కూడా పోటీ ఇస్తూ వందల కోట్ల కలెక్షన్లు తన సినిమాలతో వసూలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

చిరంజీవి సినిమాలు..

ఈ ఏడాది అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా చేసి ఇండస్ట్రీ క్లీన్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈయన .. ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో బెంగాల్ మాఫియా డాన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్నారు. మరొకవైపు వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ఈయన చేసిన విశ్వంభర సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live