Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డబిల్‌పూర్ చెక్‌పోస్ట్ వద్ద.. అక్రమ పశువుల రవాణా పట్టివేత!

డబిల్‌పూర్ చెక్‌పోస్ట్ వద్ద.. అక్రమ పశువుల రవాణా పట్టివేత!

Big TV Live 3 days ago

Illegal Transport: స్వేచ్ఛ బ్యూరో: ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని డబిల్‌పూర్ చెక్‌పోస్ట్ వద్ద అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని మేడ్చల్ పోలీసులు గురువారం పట్టుకున్నారు.

చెక్‌పోస్ట్ వద్ద సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ఓ డీసీఎంను అనుమానాస్పదంగా గుర్తించిన పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు.

తెలంగాణలో పర్యాటకులకు ఇక పండగే.. సంచలన నిర్ణయం తీసుకున్న సర్కార్!

సరైన పత్రాలు లేకుండా..

తనిఖీల్లో డీసీఎంలో మొత్తం 35 ఎద్దులను అత్యంత ఇరుకుగా, నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పశువులను ఎలాంటి అనుమతులు, సరైన పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పశువుల రవాణాకు సంబంధించిన పత్రాలు, వాటిని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live