Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డెమోన్ కన్నీటి గాథ..తండ్రి ఆఖరి కోరిక తీర్చలేకపోయాను అంటూ!

డెమోన్ కన్నీటి గాథ..తండ్రి ఆఖరి కోరిక తీర్చలేకపోయాను అంటూ!

Big TV Live 3 weeks ago

Demon Pawan: ప్రస్తుతం ఆహాలో ప్రసారమవుతున్న పాపులర్ టాక్ షో 'కాకమ్మ కథలు సీజన్ 3'. బిగ్‌బాస్ ఫేమ్, నటి తేజస్వి మదివాడ ఈ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ షోకు సినీ, టెలివిజన్ రంగాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు గెస్టులుగా హాజరవుతూ తమ కెరీర్, వ్యక్తిగత జీవితం, ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆసక్తికరమైన అనుభవాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు.

డెమోన్, పవన్ కళ్యాణ్ పడాల సందడి:

తాజాగా ఈ టాక్ షోకు బిగ్‌బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న డెమోన్ తో పాటు పవన్ కళ్యాణ్ పడాల గెస్టులుగా హాజరయ్యారు. వీరిద్దరితో తేజస్వి మదివాడ చేసిన సందడి ఆకట్టుకుంది. తనదైన స్టైల్‌లో ఇద్దరినీ పరిచయం చేసిన ఆమె.. సాధారణ స్టార్ సెలబ్రిటీలకు ఏమాత్రం తీసిపోని వ్యక్తులంటూ ప్రశంసించారు. అనంతరం పలు సరదా గేమ్స్ నిర్వహిస్తూ గెస్టుల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటకు తీసుకొచ్చారు.

తండ్రిని గుర్తుచేసుకున్న డెమోన్:

ఈ ఎపిసోడ్‌లో డెమోన్ చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. "మీ మనసులో ఉన్న బాధ ఏంటి? ఇక్కడితో దానిని సమాధి చేసేయాలి. అలాంటి విషయాన్ని ప్రేక్షకులతో పంచుకోండి" అని తేజస్వి అడగడంతో డెమోన్ తన జీవితంలో దాచుకున్న బాధను బయటపెట్టారు.

తన తండ్రి ఇటీవలే క్యాన్సర్‌తో మరణించారని డెమోన్ తెలిపారు. తన తండ్రికి తనపై ఎంతో నమ్మకం ఉండేదని గుర్తుచేసుకున్నారు. "నా చిన్న కొడుకు కచ్చితంగా ఒక రోజు కారు కొంటాడు.. కారులో తిప్పుతాడు" అని తన తండ్రి తరచూ చెప్పేవారని తెలిపారు.

కారు కొన్నా.. నాన్నను తిప్పలేకపోయాను:

తాను ఇటీవల కారు కొనుగోలు చేశానని, కానీ ఆ కారులో తన తండ్రిని తిప్పలేకపోయాననే బాధ తనను వెంటాడుతోందని డెమోన్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం తన తల్లిని కారులో తిప్పుతున్నానని, అదే సమయంలో తన తండ్రి కూడా ఉండి ఉంటే ఎంతో బాగుండేదని భావోద్వేగానికి గురయ్యారు. ఆయన చెప్పిన మాటలు, తనపై ఉంచిన నమ్మకం ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు.

బిగ్‌బాస్ తర్వాత మారిన బంధువుల తీరు:

తన కుటుంబ పరిస్థితుల గురించి కూడా డెమోన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఒకప్పుడు తన తండ్రి ఆర్థికంగా మంచి స్థితిలో ఉండేవారని, సుమారు 30 మంది కార్మికులతో పెయింటింగ్ కాంట్రాక్టులు చేసేవారని చెప్పారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల పనులు తగ్గిపోవడంతో ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని తెలిపారు.

ఆ సమయంలో తన బంధువులు తన తండ్రికి సరైన గౌరవం ఇవ్వలేదని డెమోన్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాను బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన తర్వాత అదే బంధువులు తన తండ్రి దగ్గరకు వచ్చి తనను పొగిడారని గుర్తుచేసుకున్నారు. ఆ ఘటనను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. ప్రస్తుతం డెమోన్ చేసిన ఈ ఎమోషనల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live