Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డేంజర్ బెల్స్.. వచ్చే వారం రోజులు రాష్ట్రానికి ఎండల గండం..!

డేంజర్ బెల్స్.. వచ్చే వారం రోజులు రాష్ట్రానికి ఎండల గండం..!

Big TV Live 1 week ago

Heatwave Alert: స్వేచ్ఛ బ్యూరో: ప్రచండ బానుడి ప్రతాపం ఆదివారం నుంచి మరింత పెరగనుంది. గత వేసవిలో ఇదే సమయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను గమనిస్తే, ఈ సారి మూడు నుంచి నాలుగు డిగ్రీల వరకు ఎండ వేడిమి పెరిగింది.

ఫలితంగా ప్రజలు ఎండలతో అల్లాడిపోతున్నారు. ఉదయ ఎనిమిది గంటల నుంచి ఎండ వెడెక్కి, మధ్యాహ్నాం ఒకటి గంటల కల్లా వేడి గాలులు కూడా వీస్తున్నాయి. కొద్ది రోజులుగా నమోదవుతున్న టెంపరేచర్లతో జనం అల్లాడిపోతుండగా, ఆదివారం నుంచి ఎండలు మరింత మండిపోనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

వాతావరణ శాఖ రెడ్ అలర్ట్..

శనివారం రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించగా, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ నెల 17వ తేదీ నుంచి 23 వ తేదీ వరకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు తెలిసింది. శనివారం ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావటంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. నిర్మిల్ జిల్లాలోని తానూర్ ప్రాంతంలో గరిష్టంగా 45.8 ఉష్ణోగ్రతలు నమోదు కాగా, అదిలాబాద్ లోని భోజర్ ప్రాంతంలో 45.5 డిగ్రీలు నమోదు కాగా, నిజామాబాద్ లోని భీమ్ గల్ లో 45.3 డిగ్రీలు, జగిత్యాల్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో 45.2 డిగ్రీలు, కామారెడ్డి జిల్లాలోని పాల్వంచలో 45.1 డిగ్రీలు, కొమరం భీమ్ 45.1 డిగ్రీలు నమోదు కావటంతో రెడ్ అలర్ట్ ప్రకటించగా, రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాలో ఆరేంజ్ అలర్ట్ ప్రకటించింది.

క్యుములోనింబస్ మేఘాలు..

దీంతో ప్రజలు అత్యవసరమైతే తప్పా మధ్యాహ్నాం పూట బయటకు రావద్దని వాతావరణ నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. గత్యంతరం లేక బయటకు రావాల్సిన పరిస్థితులుంటే తగిన జాగ్రతలు పాటించాలని కూడా సూచిస్తున్నారు. గతేడాది జిల్లాల వారీగా నమోదైన ఉష్ణోగ్రతలను గమనిస్తే, ఈ సారి ఎండలు కాస్త ముందుగానే దంచికొడుతున్నాయి. ఏప్రిల్ మాసంలోనే 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదైతే వచ్చే మే నెలాఖరు, జూన్ మొదటి వారంలో ఎండలు ఇంకా ఎంత మండిపోతాయోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇదే వేసవి కాలంలో క్యుములోనింబస్ మేఘాల కారణంగా అడపాదడపా వర్షాలు కురిసేవి. కానీ ఈ సారి జూన్ మొదటి వరకు వర్షం కురిసే పరిస్తితుల్లేనట్టు వాతావరణ నిపుణులు తెలిపారు.

Also read: తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

రాష్ట్ర వ్యాప్తంగా ఆరేంజ్ అలర్ట్..

ఆరు జిల్లాల మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా 40 డిగ్రీల కన్నా ఎక్కువ టెంపరేచర్స్ నమోదు కావటంతో ఆరేంజ్ అలర్ట్ జారీ అయింది. మెదక్ జిల్లాలోని రేగోడ్ ప్రాంతంలో 44.3 డిగ్రీలు, రాజన్న సిరిసిల్లా జిల్లాలోని రుద్రంగి ప్రాంతంలో43.6, మంచిర్యాల జిల్లాలోని భీమినేని ప్రాంతంలో 43.5, సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ విలేజ్ లో 43.4, సిద్దిపేట జిల్లాలోని కోహెడ్ లో 43.4, వికారాబాద్ జిల్లాలోని యాలాల్ లో 43.4, కరీంనగర్ జిల్లాలోని గంగాధర ప్రాంతంలో 43.2, మహాబూబ్ నగర్ జిల్లాలోని బాలానగర్ లో 43.1, పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి ప్రాంతంలో 43.1 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి.

గద్వాల్ జిల్లాలో..

వీటితో పాటు రంగారెడ్డి జిల్లాలోని మొఘల్ గిద్ద సమీపంలోని ఫరూక్ నగర్ లో 43.1, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని దూలపల్లి సమీపంలోని దుండిగల్ గండి మైసమ్మ ఆలయం వద్ద 42.8 డిగ్రీలు, జోగులాంబ గద్వాల్ జిల్లాలోని చిన్న తాండ్రపాడు సమీపంలోని లీజ ప్రాంతంలో 42.6, హైదరాబాద్ జిల్లాలోని ఆసిఫ్ నగర్ ప్రాంతంలో 42.5, ఖమ్మం జిల్లాలోని రావినూతల సమీపంలోని బోనకల్ ప్రాంతంలో 42.2, నల్గొండ జిల్లాలోని చలకుర్తి సమీపంలోని పెద్ద ఊరులో 42.1, వనపర్తి జిల్లాలోని శ్రీరంగపూర్ ప్రాంతంలో 42.0, నారాయణపేటలోని బిజ్వర్ ఉట్కూర్ ప్రాంతంలో 41.9 గా రమొదైంది.

వరంగల్ జిల్లాకు..

భధ్రాధ్రి కొత్త గూడెం జిల్లా సత్యనారాయణపురం సమీపంలోని చీర్ల ప్రాంతంలో 41.6, నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్త పల్లి లో 41.5, సూర్యపేట జిల్లా నర్సయ్య గూడెం సమీపంలోని నెరెడ్ చెర్ల లో 41.3, జయశంకర్ కాళేశ్వరం సమీపంలోని మహాదేవ్ పూర్ లో 41.2, హన్మకొండ లోని ధర్మసాగర్ లో40.8, జనగామలోని పద్మాతి కేశవ్ పూర్ సమీపంలోని బచ్చన్నపేటలో 40.6, మహాబూబాబాద్ లోని చిన్నగూడూర్ లో 40.6, ములుగు జిల్లాలోని తాడ్వాయి ప్రాంతంలో 40.6, యాధాద్రి భువనగిరి లోని రాజాపేట లో 40.5, వరంగల్ లోని మంగళవారి పేట సమీపంలోని ఖానాపూర్ లో 39.9 డిగ్రీల ఉష్ణ్రోగ్రతలు నమోదయ్యాయి. ఒక్క వరంగల్ జిల్లాకు ఎల్లో అలర్ట్, ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన జిల్లాలకు ఆరేంజ్ అలర్ట్ ప్రకటించారు.

Also read: సోలార్ కరెంటును పెంచేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live