Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దేశవ్యాప్తంగా బీజేపీ 'సేవా దూత్' ప్రచారం.. చేయబోయే కార్యక్రమాలివే?

దేశవ్యాప్తంగా బీజేపీ 'సేవా దూత్' ప్రచారం.. చేయబోయే కార్యక్రమాలివే?

Big TV Live 3 hrs ago

Seva Doot: ప్రధాని మోడీ సేవా సందేశాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు బీజేపీ అధిష్ఠానం దేశవ్యాప్తంగా 'సేవా దూత్' పేరుతో భారీ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

డిసెంబర్ 1 నుంచి 25 వరకు, 25 రోజుల పాటు దేశంలోని మొత్తం 4,123 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకోసం పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులను షార్ట్ టైం ఫుల్ టైమర్లుగా(సేవా దూత్‌లుగా) నియమించి, వారిని ఇతర జిల్లాలకు పంపనున్నారు. ఈ సేవా దూత్ లు 25 రోజుల పాటు తమ సమయాన్ని ఈ కార్యక్రమానికి కేటాయించేలా కార్యాచరణ రూపొందించారు. ఈ ప్రచారంలో పాల్గొనే సేవా దూత్‌లుగా ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పంచాయతీ, మున్సిపల్ ప్రజాప్రతినిధులతో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి పదాధికారులు, మోర్చా నేతలు, మాజీ అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

25 రోజుల పాటు బస..

మోడీ.. సీఎంగా, ప్రధానిగా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు కూడా సేవా దూత్ ను ఉపయోగించుకోవాలని అధిష్టానం భావిస్తోంది. ఈ ప్రచారంలో భాగంగా ఎంపిక చేసిన సేవా దూత్ లు తమ సొంత జిల్లాల్లో కాకుండా, కేటాయించిన ఇతర విధానసభ నియోజకవర్గాల్లో 25 రోజుల పాటు బస చేయాల్సి ఉంటుంది. ప్రతి మండలంలో సుమారు 5 రోజుల పాటు ఉండి ప్రజలతో మమేకం కావాల్సి ఉంటుంది. వారికి కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించడంతో పాటు వారి సమస్యలను నేరుగా తెలుసుకోనున్నారు. సాధారణంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక సేవా దూత్‌ను కేటాయిస్తుండగా, 150 కంటే ఎక్కువ పోలింగ్ బూత్‌లు ఉన్న నియోజకవర్గాల్లో ఇద్దరు సేవా దూత్‌లను నియమించనున్నారు. వీరి ప్రవాస ప్రణాళిక, బస, ప్రయాణ ఏర్పాట్లు చూసేందుకు ప్రతి సెగ్మెంట్‌కు ఒక స్థానిక సీనియర్ నేతను విధానసభ కోఆర్డినేటర్ గా నియమిస్తారు. హోటళ్లకు బదులుగా కార్యకర్తల ఇళ్లలో లేదా సాధారణ అతిథి గృహాల్లోనే బస చేసేలా నిబంధనలు రూపొందించారు.

ఒంటరిగా ట్రావెలింగ్ ఇష్టపడేవారికి ఇండియాలో 7 అద్భుతమైన ప్రాంతాలు.. మహిళలకు కూడా సేఫ్

ప్రతి మండలంలో సమావేశాలు..

ప్రతి మండలంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రజా వాణి లాంటి శిబిరాలు నిర్వహించనున్నారు. అలాగే ఆరోగ్య పరీక్షలు, రక్తదానం, డిజిటల్ అక్షరాస్యత, పథకాల నమోదు కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ పథకాల వల్ల జీవితాలు మారిన లబ్ధిదారులతో ప్రతి మండలంలో సమావేశాలు నిర్వహించి, వారి అనుభవాలను రికార్డు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని అధిష్టానం నిర్ణయించింది. స్వచ్ఛతా అభియాన్, శ్రమదానం, మొక్కలు నాటడం, చెరువులు, బావుల శుభ్రత, అప్నా క్షేత్ర-అప్నా గౌరవ్ పేరుతో పాఠశాలలు, ఆసుపత్రులు వంటి ప్రజా స్థలాల అభివృద్ధి, నశా ముక్త్ భారత్ శిబిరాలు, ఆరోగ్య, రక్తదాన శిబిరాలు, మహిళలకు ఆత్మరక్షణ తరగతులు నిర్వహిస్తారు. అలాగే సంస్థాగత బలోపేతంపైనా పార్టీ దృష్టిపెట్టింది. మండల కమిటీలు, శక్తి కేంద్ర ప్రముఖులు, బూత్ అధ్యక్షులతో సమావేశమై పార్టీ పరిస్థితిని, స్థానిక సామాజిక-రాజకీయ సమీకరణాలను అంచనా వేసి అధిష్ఠానానికి నివేదిస్తారు.

ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం..

డిసెంబర్ 1 నుంచి 25 వరకు కొనసాగే ఈ సేవా దూత్ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు జాతీయ స్థాయిలో హరీష్ ద్వివేది కన్వీనర్‌గా, అమర్ పాల్ మౌర్య, రోహన్ గుప్తా కో-కన్వీనర్లుగా 10 మందితో కూడిన సమన్వయ కమిటీని అధిష్ఠానం ఏర్పాటు చేసింది. నవంబర్ 24న నియోజకవర్గాల కేటాయింపు పూర్తి చేసి, నవంబర్ 25 నుంచి 27 వరకు రాష్ట్ర స్థాయిలో సేవా దూత్‌లు, కోఆర్డినేటర్లకు సంయుక్త శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. ఇదిలాఉండగా ఇప్పటికే ఈ కార్యక్రమంపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ సునిల్ బన్సల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నాయకులకు దిశానిర్దేశం చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా డిసెంబర్ 25న ముగింపు వేడుకలు, డిసెంబర్ 27న ప్రతి బూత్‌లో ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంతో ఈ మహా ప్రచారం ముగియనుంది.

పోలీస్ వరుడి కట్నం కక్కుర్తి.. బ్రెజ్జా కారు లేదని పెళ్లి క్యాన్సిల్.. మండపం నుంచి యూటర్న్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live