Dailyhunt
ఢాకా వీధుల్లో మార్వెల్ హీరో. యాక్షన్ ప్రియులకు పూనకాలు తెప్పిస్తున్న సినిమా

ఢాకా వీధుల్లో మార్వెల్ హీరో. యాక్షన్ ప్రియులకు పూనకాలు తెప్పిస్తున్న సినిమా

Big TV Live 1 week ago

Action Thriller Movie on OTT : ఓటీటీలో పక్కా హై-వోల్టేజ్ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇది రిలీజ్ అయినప్పుడు భారీ వ్యూస్ తో నడిచింది.

ఇందులో లీడ్ రోల్ లో ‘థోర్’ ఫేమ్ క్రిస్ హేమ్స్‌వర్త్ నటించారు. ఈ మెరుపుల వీరుడు ఇందులో యాక్షన్ ఇరగదీశాడు. ఫైట్లు, భారీ యాక్షన్ కోరుకునే ప్రేక్షకులకు ఇది ఒక విందు లాంటిది. హాలీవుడ్ స్టైల్ మేకింగ్‌తో పాటు భారత్, బంగ్లాదేశ్ బ్యాక్‌డ్రాప్ ఉండటం వల్ల మనకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది ఈ సినిమా. మాఫియా గ్యాంగ్ నుంచి ఒక పిల్లాడిని కాపాడే క్రమంలో స్టోరీ యాక్షన్ మోడ్ కి వెళ్తుంది. మీరు గన్ ఫైట్లు, ఒళ్లు గగుర్పొడిచే స్టంట్స్ ఇష్టపడే వారైతే, ఈ సినిమా మీకు కచ్చితంగా నచ్చుతుంది.

నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

2020లో వచ్చిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ఎక్స్‌ట్రాక్షన్’ (Extraction). ఇందులో ప్రధాన పాత్రలో ‘థోర్’ ఫేమ్ క్రిస్ హేమ్స్‌వర్త్ నటించారు. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ ఇందులోని యాక్షన్ సీక్వెన్స్‌లు. ముఖ్యంగా 12 నిమిషాల పాటు సాగే యాక్షన్ సీన్ ఈ సినిమాకే హైలెట్. ఒకే టేక్ లో దీనిని తీసేందుకు దర్శకుడు సామ్ హర్గ్రేవ్ చాలా కష్టపడ్డారు. ఈ చిత్రం 2014లో వచ్చిన ‘సియుడాడ్’ అనే గ్రాఫిక్ నావెల్ ఆధారంగా రూపొందింది. ఇది విడుదలైన సమయంలో నెట్‌ఫ్లిక్స్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ సాధించిన ఒరిజినల్ సినిమాగా రికార్డు సృష్టించింది. షూటింగ్ విషయానికి వస్తే, కథ బంగ్లాదేశ్‌లోని ఢాకా నేపథ్యంలో సాగినప్పటికీ, అత్యధిక భాగం భారతదేశంలోని అహ్మదాబాద్, ముంబై నగరాల్లో చిత్రీకరించారు. ఈ సినిమాలో క్రిస్ హేమ్స్‌వర్త్‌తో పాటు భారతీయ నటులు రణదీప్ హుడా, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించడం విశేషం. దీనికి మార్వెల్ సినిమాల దర్శకులైన రూసో బ్రదర్స్ నిర్మాతలుగా వ్యవహరించారు.

స్టోరీలోకి వెళ్తే

భారతదేశానికి చెందిన ఒక పెద్ద డ్రగ్ మాఫియా డాన్ కొడుకును, బంగ్లాదేశ్‌కు చెందిన ప్రత్యర్థి గ్యాంగ్ కిడ్నాప్ చేసి ఢాకాలో దాచిపెడుతుంది. ఆ అబ్బాయిని రక్షించే బాధ్యతను టైలర్ రేక్ (క్రిస్ హేమ్స్‌వర్త్) కు అప్పగిస్తారు. ప్రాణాలకు తెగించి పోరాడే మనస్తత్వం ఉన్న టైలర్, శత్రువుల కోటలోకి వెళ్లి ఆ అబ్బాయిని బయటకు తీసుకువస్తాడు. అయితే ఆ అబ్బాయిని తీసుకువచ్చే క్రమంలో టైలర్‌కు ఊహించని సమస్యలు ఎదురవుతాయి. అటు బంగ్లాదేశ్ ఆర్మీ, ఇటు లోకల్ గ్యాంగ్స్ అందరూ కలిసి వీళ్ళని చుట్టుముట్టడంతో పరిస్థితి విషమిస్తుంది. ఆ సిటీ దాటి బయటపడటం దాదాపు అసాధ్యమని తెలిసినా, ఆ అబ్బాయిని కాపాడాలనే పట్టుదలతో టైలర్ వారందరినీ ఎదురిస్తాడు. సినిమా క్లైమాక్స్‌లో ఒక వంతెన మీద జరిగే పోరాటం చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ అబ్బాయిని సురక్షితంగా పంపించే క్రమంలో టైలర్ తీవ్రంగా గాయపడి నదిలో పడిపోతాడు. అతడు బతికాడా లేదా అన్నది సస్పెన్స్‌గా ఉంచుతూ సినిమా ముగుస్తుంది. ఈ కథకు కొనసాగింపుగా 2023లో వచ్చిన రెండో భాగంలో అసలు ఏం జరిగిందో చూపిస్తారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live