Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Digvesh Vs Bishnoi: దిగ్వేష్ ను ట్రోల్ చేసిన రవి బిష్ణోయ్..ఇక జన్మలో ఓవరాక్షన్ చేయడు

Digvesh Vs Bishnoi: దిగ్వేష్ ను ట్రోల్ చేసిన రవి బిష్ణోయ్..ఇక జన్మలో ఓవరాక్షన్ చేయడు

Big TV Live 4 months ago

Digvesh Vs Bishnoi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా రాసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఈ టోర్నమెంట్ లో భాగంగా నిన్న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ( Lucknow Super Giants vs Rajasthan Royals) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన రాజస్థాన్ రాయల్స్ విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఓ వివాదం తెరపైకి వచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు సంబంధించిన హిమ్మత్ సింగ్ ( Himmat Singh) వికెట్ తీసిన తర్వాత సిగ్నేచర్ సెలబ్రేషన్ ( signature celebration) చేసుకున్నాడు రవి బిష్ణోయ్ ( Ravi Bishnoi). దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. లక్నో బౌలర్ దిగ్వేష్ ను ( Digvesh Rathi) ట్రోలింగ్ చేసేందుకుగాను రవి బిష్ణోయ్ ఇలా సెలబ్రేషన్స్ చేసుకున్నాడని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ ర్యాగింగ్ దెబ్బకు మళ్ళీ దిగ్వేష్‌ గాడు ఓవరాక్షన్ చేయబోడని కౌంటర్లు పేల్చుతన్నారు. వాడికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చాడని రవిని మెచ్చుకుంటున్నారు ఫ్యాన్స్.

Rohit Sharma Fitness Video : గంటకు 100 Push-Ups..రోహిత్ శర్మ 2.0 మాములుగా లేదు, గూస్ బంప్స్ రావాల్సిందే

40 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విక్టరీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య లక్నో వేదికగా 32వ మ్యాచ్ జరిగింది. ఇందులో రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆరు వికెట్లు నష్టపోయిన రాజస్థాన్ రాయల్స్ 159 పరుగులు సాధించింది. రవీంద్ర జడేజా చివరి వరకు పోరాడి ఆ మాత్రం స్కోర్ రాబట్టగలిగాడు. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ చెత్త ప్రదర్శన కనబరిచింది. 18 ఓవర్లు ఆడి 119 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది. దీంతో 40 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విక్టరీ అందుకుంది.

దిగ్వేష్ ను ట్రోల్ చేసిన రవి బిష్ణోయ్

రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య నిన్న మ్యాచ్ జరగగా.. రవి బిష్ణోయ్ ( Ravi Bishnoi) ఈ చేసిన సెలబ్రేషన్స్ హాట్ టాపిక్ అయ్యాయి. వాస్తవంగా రవి బిష్ణోయ్ చాలా కూల్ గా ఉంటాడు. ఎవరి జోలికి వెళ్లడు. వికెట్ తీసినా కూడా కాస్త కూల్ గానే సెలబ్రేషన్స్ చేసుకుంటాడు. అలాంటి రవి బిష్ణోయ్ కి కోపం వచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ హిమ్మత్ సింగ్ వికెట్ తీసిన అనంతరం సిగ్నేచర్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు రవి బిష్ణోయ్. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే ఇది చూసిన క్రికెట్ అభిమానులు రవి బిష్ణోయ్ ని మెచ్చుకుంటున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టును ఓడించడమే కాదు… అందులో ఉన్న దిగ్వేష్ రతి పరువు కూడా తీశాడని కామెంట్స్ చేస్తున్నారు. సిగ్నేచర్ సెలబ్రేషన్స్ పేరుతో దిగ్వేష్ అరాచకం సృష్టిస్తుంటే.. అతనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ రవి బిష్ణోయ్ బిహేవ్ చేశాడని మెచ్చుకుంటున్నారు.

Chris Gayle Controversal Comments ON PBKS: చిన్నపిల్లాడిని చేసిన నరకం చూపించారు…పంజాబ్ ఓనర్లు దుర్మార్గులు

?igsh=MTNoa2d5OXJmNmtoMQ==

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live