RJ Mahvash: సినీ, మీడియా ప్రపంచంలో సెలబ్రిటీల లైఫ్ బయటకి ఎంతో కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది కానీ, వారి వెనుక ఎన్నో గుండెకోతలు ఉంటాయి. ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయిన ప్రముఖ కంటెంట్ క్రియేటర్, ఆర్‌జే (RJ) మహ్వాష్..
తాజాగా తన జీవితంలోని అత్యంత చీకటి రోజులను గుర్తుచేసుకున్నారు. తనకు కేవలం 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నిశ్చితార్థం జరిగిన వ్యక్తి చేతిలో ఎదురైన మోసం, ఆ తర్వాత తను అనుభవించిన నరకం గురించి ఆమె ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు.
Read also-మోదీ చెప్పారని అనుపమ్ ఖేర్ ఏం చేశారో చూడండి, అందరూ ఇలాగే ఉంటే?
ఫేస్‌బుక్ ప్రేమ.. మూడుసార్లు మోసం!
మహ్వాష్ అలీగఢ్‌కు చెందిన ఒక వ్యక్తితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమై ప్రేమలో పడ్డారు. “నేను అతనిని పిచ్చిగా ప్రేమించాను. ఒకవేళ అతనితో పెళ్లి జరిపించకపోతే ఇల్లు వదిలి పారిపోతానని మా ఇంట్లో వాళ్లతో కూడా గొడవపడ్డాను” అని మహ్వాష్ చెప్పారు. చివరికి ఇంట్లో వాళ్లు ఒప్పుకుని ఇద్దరికీ నిశ్చితార్థం చేశారు. కానీ, పెళ్లికి ముందే ఆ వ్యక్తి అసలు స్వరూపం బయటపడింది. అతను మహ్వాష్‌ను ఏకంగా మూడుసార్లు వేరే అమ్మాయిలతో మోసం చేశాడు. ప్రతిసారీ అతను తప్పు ఒప్పుకోవడంతో మహ్వాష్ క్షమిస్తూ వచ్చారు. కానీ, ఇది ఒక ముగింపు లేని లూప్‌లా మారిపోవడంతో ఆమె మానసికంగా పూర్తిగా కుంగిపోయారు.
భారీ మందుల ప్రభావం..
ఈ గుండెకోత కారణంగా మహ్వాష్ తీవ్రమైన డిప్రెషన్ మరియు పానిక్ అటాక్స్ బారిన పడ్డారు. అలీగఢ్ లాంటి చిన్న నగరంలో సమాజం ఏమనుకుంటుందో అనే భయంతో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేకపోయారు. పరిస్థితి చేయి దాటడంతో ఆమెను హాస్పిటల్‌లో చేర్చి, భారీ మోతాదులో ఇంజక్షన్లు, హై-డోస్ మాత్రలు ఇవ్వాల్సి వచ్చింది. “భారీ మందుల ప్రభావం వల్ల నాకు లేనివి ఉన్నట్లు భ్రాంతులు (Hallucinations) కలగడం ప్రారంభమైంది. రూమ్‌లో ఎవరూ లేకపోయినా ఎవరో వస్తున్నట్లు ఊహించుకునేదాన్ని. ఆ క్లిష్ట సమయంలో నా స్నేహితులే నన్ను కాపాడారు” అని మహ్వాష్ ఎమోషనల్ అయ్యారు.
Read also-వైరల్ పోస్ట్‌పై స్పందించిన సల్మాన్ ఖాన్.. 'ఆ కంగారు నా గురించి కాదు'.. మరి దేనికంటే?
‘మెంటల్ పేషెంట్’ అని నింద..
తాను అంతలా నరకం అనుభవిస్తూ ఆసుపత్రిలో ఉంటే, ఆ వ్యక్తి కనీసం చూడటానికి కూడా రాలేదని, పైగా “నువ్వు ఒక మెంటల్ పేషెంట్‌వి” అంటూ తనపైనే నిందలు వేశాడని చెప్పారు. దీంతో ఆ బంధం నుండి బయటపడి ఆమె ముంబై వచ్చేసారు. “ఆ వ్యక్తి నైజం ఎప్పటికీ మారదు. అతను ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు కానీ, ప్రస్తుతం విడాకులు తీసుకున్నాడు. ఎందుకంటే అతను తన గర్భవతి అయిన భార్యను కూడా మోసం చేశాడు. మోసం చేయడం అతని డిఎన్ఏ లోనే ఉంది” అంటూ మహ్వాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

