Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దివంగత మాజీ ముఖ్యమంత్రికి పవన్ నివాళులు .. సర్జరీ తర్వాత మొదటిసారి బయటకు!

దివంగత మాజీ ముఖ్యమంత్రికి పవన్ నివాళులు .. సర్జరీ తర్వాత మొదటిసారి బయటకు!

Big TV Live 2 weeks ago

Pawan Kalyan: సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్దిరోజుల క్రితం సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఈయన సర్జరీ కారణంగా పూర్తి విశ్రాంతిలోనే ఉన్నారు .అయితే సర్జరీ తర్వాత మొదటిసారి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) బయటకు వచ్చారు.

ఈయన సర్జరీ జరిగి దాదాపు 20 రోజులు అవుతున్న నేపథంలో మొదటిసారి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మాజీ దివంగత ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావుకు (Nadendla Bhaskar Rao)నివాళులు అర్పించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా ఏప్రిల్ 22వ తేదీ మరణించిన సంగతి తెలిసిందే.

నాదెండ్ల భాస్కర్ రావుకు నివాళి..

ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన భాస్కర్ రావు మరణించడంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు రాజకీయ నాయకులు నాదెండ్ల భాస్కర రావుకు నివాళులు అర్పిస్తూ సంతాపం ప్రకటించారు. అయితే నాదెండ్ల భాస్కర్ రావు చనిపోయిన సమయంలో పవన్ కళ్యాణ్ సర్జరీ చేయించుకున్న నేపథ్యంలో బయటకు రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే భాస్కరరావు చివరి చూపుకు పవన్ కళ్యాణ్ నోచుకోలేదు. అయితే సర్జరీ తర్వాత మొదటిసారి పవన్ కళ్యాణ్ బయటకు రావడంతో ఆయన నాదెండ్ల మనోహర్ ఇంటికి వెళ్లి ఆయన తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం నాదెండ్ల మనోహర్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వారిని ఓదార్చారు.

ఫోన్ లో పరామర్శించిన పవన్ కళ్యాణ్..

నాదెండ్ల భాస్కరరావు మరణించిన సమయంలో పవన్ కళ్యాణ్ సర్జరీ చేయించుకున్న నేపథ్యంలో ఎక్కడికి వెళ్లలేని పరిస్థితుల ఏర్పడ్డాయి దీంతో నాదేండ్ల మనోహర్ కు ఫోన్ చేసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సర్జరీ కారణంగా తాను హాజరు కాలేకపోతున్నానని పవన్ కళ్యాణ్ తెలియచేశారు. అయితే ఇప్పుడిప్పుడే పవన్ సర్జరీ నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న నేపథ్యంలో ఈయన బయటకు రావడమే కాకుండా నాదెండ్ల భాస్కరరావు ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు.

నెల రోజులు ముఖ్యమంత్రిగా నాదెండ్ల భాస్కరరావు..

భాస్కర రావు కుమారుడే నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) అనే సంగతి మనకు తెలిసిందే. ఈయన ప్రస్తుతం జనసేన పార్టీ (Janasena party)లో కీలక వ్యవహారాలను చూసుకోవడమే కాకుండా పౌరసరఫరాల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలను తీసుకొని నిర్వర్తిస్తున్నారు. నాదెండ్ల భాస్కర్ రావు విషయానికి వస్తే 1935 జూన్‌ 23న గుంటూరులో నాదెండ్ల భాస్కరరావు జన్మించారు. ఆయన వృత్తిరీత్యా లాయర్ అయినప్పటికీ ఈయనకు రాజకీయాల పై ఆసక్తి ఉండడంతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు.1978లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రిగా బాధ్యతలను తీసుకున్నారు. అయితే 1982 లో నాదెండ్ల భాస్కర్ రావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇక ఈయన 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఉమ్మడి ముఖ్యమంత్రిగా నెల రోజులపాటు బాధ్యతలను నిర్వహించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live