Drishyam3 Review :దృశ్యం… 2014లో వచ్చిన ఈ సినిమా థ్రిల్లర్ ప్రేమికులని ఎంతగా మెస్మరైజ్ చేసిందో చెప్పక్కర్లేదు.ఇక కరోనా టైమ్ లో ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజైన 'దృశ్యం 2' (2021) కూడా తెలుగులోనూ సూపర్ డూపర్ హిట్ అయిపొయింది.దీంతో రెండు పార్ట్స్ లలో హీరోగా చేసిన వెంకీనే మూడో పార్ట్ లో కనిపిస్తాడని అనుకున్నారంతా.కానీ డేట్స్ దొరక్కనా లేక మరేదైనా కారణమో తెలీదు కాని రీమేక్ చేయకుండా మలయాళ ఒరిజినల్ వర్షన్‌నే తెలుగులోకి డబ్బింగ్ చేసి ఈరోజు అంటే ..2026 మే 21న థియేటర్ లోకి వదిలారు మేకర్స్.
మరి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, ఇంటెలిజెంట్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ అంచనాలతో వచ్చిన ఈ క్రేజీ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.
కథ
అయితే చాలా ప్రాంచైజీలలో భాగంగా వచ్చే సినిమాలలో ఒకదానికి మరొకటి సంబంధం ఉండదు. కాని .. కరెక్ట్‌గా 'దృశ్యం 2' ముగింపు సీన్‌తోనే డైరెక్టర్ కథను కనెక్ట్ చేశాడు డైరెక్టర్ జీతూ.వరుణ్ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు కేబుల్ ఆపరేటర్ జార్జ్‌కుట్టి (మోహన్‌లాల్) వేసిన మైండ్ బ్లోయింగ్ ప్లాన్ సూపర్ సక్సెస్ అవుతుంది. మొత్తంగా కోర్ట్ ఇచ్చిన ఆర్డర్స్ తో వాళ్ళపై లీగల్ గా ఎలాంటి కేసు లేకుండా బయటపడతారు.
ఇంకేం తప్పించుకున్నాననుకున్న జార్జ్‌కుట్టి తన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నే కాస్త చేంజెస్ చేసి స్వంతంగా సినిమా తీయడం, అది కాస్తా సూపర్ డూపర్ హిట్ అవడం చక చక జరిగిపోతుంది.ఇక ఒక్కసారిగా కోట్లు వచ్చి వాలడంతో జార్జ్ లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది.అన్ని సమస్యలు తీరిపోయి ప్రశాంతంగా గడిచిపోతున్న సమయంలో గతం తాలుకూ మానసిక సమస్యలనుండి బయటపడ్డ పెద్ద కూతురు అంజుకి పెళ్లి చేయాలని జార్జ్, అతని భార్య రాణి (మీనా) డిసైడ్ అవుతారు.కానీ వచ్చిన సంబంధం వచ్చినట్టు క్యాన్సిల్ అవుతుంటాయి. ఎవరో గుర్తు తెలీని వ్యక్తులు అంజు గతం గురించి నెగెటివ్‌గా చెప్పడం వల్ల క్యాన్సిల్ అవుతున్నాయని జార్జ్ కి తెలుస్తుంది. ఇంతకీ అంజు పెళ్లి సంబంధాలని చెడగొట్టిన ఆ ఇద్దరు ఎవరి ఉంటారు? కొడుకుని పోగొట్టుకున్న బాధతో అమెరికా వెళ్ళిపోయిన ఐజీ గీతా ప్రభాకర్, ప్రభాకర్ దంపతులు మళ్లీ జార్జ్ లైఫ్‌లోకి ఎందుకు ఎంటర్ అయ్యారు? సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ సహదేవన్ పన్నిన కొత్త కుట్ర ఏంటి? ఈసారి తన కూతురిని, కుటుంబాన్ని కాపాడుకోవడానికి జార్జ్‌కుట్టి వేసిన సరికొత్త ప్లాన్ ఎంటన్నది మిగతా కథ !
విశ్లేషణ
ఒక చదువుకోని మిడిల్ క్లాస్ అతను అనుకోకుండా జరిగిన క్రైమ్ నుంచి తన తెలివితేటలని ఉపయోగించి తన ఫ్యామిలిని కాపాడుకున్నాడు,పోలీసులకి చిక్కకుండా ఎలా తప్పించుకున్నాడు అనే సింగిల్ లైన్ తో మొదటి రెండు భాగాలు అధ్బుతంగా నడిపించాడు జీతూ. అందుకే మూడో పార్ట్ వస్తుందంటే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు మూవీ లవర్స్. కాని భారీ అంచనాలాతో వచ్చిన ఆడియన్స్ ని జీతూ ఆ రేంజ్ లో సాటిస్ ఫై చేయలేదనే చెప్పాలి.సినిమాలో సస్పెన్స్ ఉన్నప్పటికీ గత రెండు సినిమాలతో పోలిస్తే మరింత కొత్తగా ప్లాన్ చేయలేకపోయాడు.ముఖ్యంగా కథని ఉన్నచోటే తిప్పినట్టు అనిపిస్తుంది.
అలా ఫస్టాఫ్ కథనం చాలా నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టినప్పటికీ ఇంటర్వెల్ సీన్ దగ్గర ఇచ్చే ట్విస్ట్ మాత్రం సెకండాఫ్‌పై ఒక్కసారిగా క్యూరియాసిటీని పెంచడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి.ఇక సెకండాఫ్ మొదట్లో కాస్త సాగదీసినప్పటికీ ఒక్కో పాత్ర ఎంట్రీ ఇవ్వడంతో స్క్రీన్ పై కథ పరుగులు పెడుతుంది.ఎప్పుడైతే తన కూతురి పెళ్లిని ఆపుతోంది ఎవరో జార్జ్‌కుట్టికి తెలుస్తుందో.. అక్కడ నుంచి సినిమా టాప్ గేర్‌లోకి వెళ్తుంది. అంజు అరెస్ట్ కోసం పోలీసులు చేసే కుట్రలు, వాటిని తిప్పికొట్టేందుకు జార్జ్ వేసే మైండ్ గేమ్స్ సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఇవ్వడం పక్కా. ముఖ్యంగా చివరి అరగంట మాత్రం మళ్లీ పాత 'దృశ్యం' రోజులను గుర్తు చేస్తూ, ఊహించని ట్విస్టులతో డైరెక్టర్ క్లైమాక్స్‌ను అద్భుతంగా డిజైన్ చేశాడు జీతూ .
నటీనటులు
నటీనటుల విషయానికి వస్తే.. జార్జ్‌కుట్టి పాత్రలో మోహన్ లాల్ మళ్లీ జీవించేశాడు. ఎప్పటిలాగే తనదైన శైలిలో సైలెన్స్‌తో కూడిన యాక్టింగ్‌తో, కళ్లల్లో కనిపించే భయంతోనే కుటుంబాన్ని కాపాడుకోవాలనే ధీమాను అద్భుతంగా పలికించాడు. మీనా తన పాత్ర పరిధి మేర చక్కగా నటించగా, కూతుళ్లుగా చేసిన వారు మెప్పించారు. సహదేవన్ భయపెట్టేలా నటించగా, ప్రభాకర్ క్యారెక్టర్లు కథను బాగా డ్రైవ్ చేశాయి. టెక్నికల్‌గా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచగా, టాప్ క్వాలిటీ సినిమాటోగ్రఫీ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయితే సినిమాలో పాటలు లేకపోవడం మరో ప్లస్ పాయింట్.అయితే ఎడిటింగ్ దగ్గరకి వచ్చేసరికి కత్తెర కొంచెం మొరాయించినట్టే కనిపించింది. అక్కడ కనుక కాస్త ట్రిమ్ చేసుంటే సినిమా మరింత బెటర్ అయ్యేదేమో.ఇక తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే ఇంత చీప్ గా చేసినవారికి దండేసి దండం పెట్టొచ్చు.
ప్లస్ పాయింట్స్ :
మోహన్ లాల్
సినిమాటోగ్రఫీ
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ :
BGM
తెలుగు డబ్బింగ్
ఫస్టాఫ్ ల్యాగ్
చివరిగా ..
ఓవరాల్‌గా, ఫస్టాఫ్ స్లోగా ఉన్నప్పటికీ, లాస్ట్ 30 మినిట్స్ ఇచ్చే క్రేజీ థ్రిల్ కోసం 'దృశ్యం 3'ని థియేటర్లలో వన్ టైమ్ వాచ్ చేయొచ్చు. అయితే మొదటి రెండు భాగాలు ఇచ్చిన ఇంపాక్ట్ తో థియేటర్‌కు వెళ్ళే డై-హార్డ్ థ్రిల్లర్ ఫ్యాన్స్ మాత్రం డిసప్పాయింట్ అవడం ఖాయం.
Drushyam review and rating: 2.25/5

