Drishyam 3 : మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దృశ్యం 3.. 'దృశ్యం' ఫ్రాంచైజీ లో రాబోతున్న మూడో చిత్రం ఇది. మొదటి వచ్చిన రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ ని అందుకోవడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.
అయితే ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. త్వరలోనే సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నటిస్తున్న స్టార్ల రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. మరి ఈ చిత్రానికి ఎవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
దృశ్యం 3 స్టార్స్ రెమ్యూనరేషన్..?
దృశ్యం సిరీస్లలో భాగంగా రాబోతున్న మూడవ సినిమా కోసం ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ జనాలని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అతి త్వరలోనే ఈ సినిమా థియేటర్లోకి రాబోతుంది. ఈ క్రమంలో ఈ మూవీ బడ్జెట్, ఇందులో నటిస్తున్న స్టార్ల రెమ్యూనరేషన్ గురించి ఓ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి గాను మాలీవుడ్ హీరో మోహన్ లాల్ దాదాపు 20 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అంటే మొదటి వచ్చినా సినిమాలతో పోలిస్తే ఈ మూవీకి కాస్త ఎక్కువే. మొదటి పార్ట్ కి ఐదు కోట్లు తీసుకున్న ఈయన, రెండవ సినిమాకి దాదాపు 12 కోట్ల రెమ్యూనరేషన్ ని అందుకున్నారు. ఈ బ్రాంచెస్ లో వస్తున్న మూడవ పార్ట్ కి 20 కోట్లకు పైగా తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.. ఇక ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న మీనా 75లక్షలు రూపాయల వరకు పారితోషికంని అందుకుంటుంది. అన్సిబా హాసన్ కోటి రూపాయలు అందుకోగా, ఎస్తేర్ అనిల్ 25 లక్షలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.
Also Read : రిలీజ్ కు ముందే 'పెద్ది' నయా రికార్డు.. ఓవర్సీస్ లో ఊచకోత..
‘దృశ్యం 3’ బడ్జెట్ విషయానికొస్తే..
2013లో రిలీజ్ అయిన దృశ్యం మూవీ ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీ మంచి రెస్పాన్స్ ని అందుకోవడంతో పాటుగా భారీగా కలెక్షన్ల వర్షం కూడా కురిపించింది. దాంతో ఈ చిత్రానికి సీక్వల్ గా రెండవ భాగం వచ్చింది. ఆ మూవీ కూడా పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంది. ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో ఈ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న దృశ్యం 3 మూవీ పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. సినిమా స్టోరీ తో పాటుగా బడ్జెట్ కూడా ఎక్కువ కావడంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.. మొదటి రెండు వర్షన్ లతో పోలిస్తే మూడో వర్షన్ బడ్జెట్ అందరికి షాకిస్తుంది. ఈ చిత్రాన్ని దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్‌తో ఇది మలయాళ చిత్ర పరిశ్రమలోని పెద్ద సినిమాల లిస్ట్ లోకి చేరింది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ U/A 13+ సర్టిఫికెట్ ను అందుకుంది. సస్పెన్స్, ఫ్యామిలీ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 21న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

