Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
E20 పెట్రోల్ వివాదం.. కేంద్రం దిగొచ్చినా వెనక్కి తగ్గని వాహనదారులు!

E20 పెట్రోల్ వివాదం.. కేంద్రం దిగొచ్చినా వెనక్కి తగ్గని వాహనదారులు!

Big TV Live 1 week ago

E20 Petrol: E20 పెట్రోల్‌పై డిజిటల్‌ ఉద్యమం.. సోషల్‌ మీడియా నుంచి రోడ్లపైకి వచ్చేలా ఉంది. బొద్దింకల పార్టీ స్ఫూర్తితో సోషల్‌ మీడియాలో E20 జనతా పార్టీ పేరుతో ప్రచారం మొదలవ్వడం, తెహసీన్ పూనావాలా నేతృత్వంలో టీమ్ భారత్ రంగంలోకి దిగడంతో ఈ వివాదం మరింత ముదిరింది.

మా వెహికిల్స్ టెస్టింగ్ మెషిన్స్ కావు. మా జీవితాలు ప్రయోగశాలలు కావంటూ అంటూ పోస్టులు పెడుతున్నారు. టీమ్ భారత్ భారీ నిరసన ర్యాలీ చేయాలని డిసైడ్‌ అయితే E 20 జనతా పార్టీ ఏకంగా పార్లమెంట్ ముట్టడికి పిలిపించింది.

కేంద్ర మంత్రితో భేటీ..

ఇదీ అసలుకే ఎసరు పెడుతుందని ముందే గ్రహించిన కేంద్రం.. చర్చలకు సిద్ధమైంది. టీమ్‌ భారత్‌ ప్రతినిధులతో కేంద్ర పెట్రోలియం, నేచురల్‌ గ్యాస్‌ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి చర్చలు జరిపారు. కేంద్ర మంత్రితో భేటీలో టీమ్‌ భారత్‌ పలు డిమాండ్లు చేసింది. E20తోపాటు E10, ప్యూర్ పెట్రోల్‌ను అందుబాటులో ఉంచాలంటున్నారు. పాత వాహనాల యజమానులకు ఎంపిక ఉండాలి అనేది వారి డిమాండ్.

హర్దీప్ సింగ్ పురి మాట్లాడితే..

ఓవైపు హర్దీప్ సింగ్ పురి ఈ20కి సపోర్ట్ చేస్తూ మాట్లాడితే.. కేంద్రమంత్రి గడ్కరీ ఇప్పుడు 2 నుంచి 6 శాతం మైలేజ్ తగ్గుతుందని నిజం ఒప్పుకోవడంతో వాహనదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అసలే ఈ 20పై ప్రజలు ఫుల్‌ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు కేంద్రమంత్రులు తలోమాట మాట్లాడేసరికి ఈ20పై భ్రమలు మరింత పెరిగాయా? ఈ గందరగోళంపై కేంద్రం ఇచ్చే క్లారిటీ ఏంటి?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live