పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లు నేర్పించడం చాలా ముఖ్యం. దీని వల్ల భవిష్యత్తులో బాధ్యతాయుతంగా మారేందుకు సహాయపడతాయి. వేసవి సెలవులు పిల్లలకు కొత్త విషయాలు నేర్పడానికి మంచి సమయం.
రోజువారీ చిన్న పనులు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.
చిన్న వయసులోనే పనులు నేర్చుకున్న పిల్లలు ఎక్కువ క్రమశిక్షణతో ఉంటారు. తల్లిదండ్రులపై ఆధారపడే స్వభావం కూడా తగ్గుతుంది.
ఇంట్లో బొమ్మలు, పుస్తకాలు సర్దుకోవడం
పిల్లలు తమ బొమ్మలు. పుస్తకాలను సరిగ్గా ఉంచడం నేర్చుకోవాలి. వాడిన తర్వాత వాటిని సరైన స్థానంలో పెట్టే అలవాటు ఉండాలి. ఇది పరిశుభ్రత మరియు బాధ్యతను నేర్పుతుంది. ఇలా చేసే పిల్లలు తరువాత తమ వస్తువులను జాగ్రత్తగా చూసుకుంటారు. తల్లిదండ్రులు ఈ పనిని సరదాగా నేర్పాలి.
స్వయంగా దుస్తులు ధరించడం
పిల్లలు తామే బట్టలు ధరించడం నేర్చుకోవాలి. చిన్న విషయాలకే తల్లిదండ్రులపై ఆధారపడకూడదు. స్కూల్ యూనిఫాం వేసుకోవడం వారికి సులభంగా రావాలి. ఇది పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. బటన్లు పెట్టడం, జిప్ వేయడం కూడా నేర్పాలి. రోజూ సాధన చేస్తే పిల్లలు త్వరగా నేర్చుకుంటారు.
స్కూల్ షూస్ శుభ్రంగా ఉంచడం
పిల్లలు తమ షూస్‌ను శుభ్రంగా ఉంచడం తెలుసుకోవాలి. షూస్ పాలిష్ చేయడం కూడా నేర్పాలి. దీని వల్ల వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పెరుగుతుంది. తమ వస్తువులను జాగ్రత్తగా చూసుకునే అలవాటు ఏర్పడుతుంది.
అయితే మొదట్లో చిన్న పిల్లలకు తల్లిదండ్రులు సహాయం చేయాలి.
స్కూల్ బ్యాగ్ సర్దుకోవడం
పిల్లలు స్కూల్ బ్యాగ్‌ను సరిగ్గా సర్దుకోవడం నేర్చుకోవాలి. ఏ పుస్తకాలు అవసరమో వారికి తెలియాలి. ఇలా చేస్తే పిల్లల్లో జ్ఞాపకశక్తి, క్రమపద్ధతి అలవాటు పెంచుతుంది. మొదట తల్లిదండ్రులు మార్గనిర్దేశం చేయాలి. తరువాత పిల్లలు స్వయంగా ఈ పని చేయగలుగుతారు.
భోజనం తర్వాత ప్లేట్లు పెట్టడం
పిల్లలకు భోజనం తర్వాత ప్లేట్లు సరిగా పెట్టే అలవాటు ఉండాలి. ఇది కుటుంబ బాధ్యతలను అర్థం చేసుకునేలా చేస్తుంది. చిన్న పనుల్లో సహాయం చేయడం మంచి అలవాటు. ఇలా చేయడం వల్ల క్రమశిక్షణ పెరుగుతుంది.
కుటుంబ సభ్యులకు సహాయం చేయాలనే భావన వస్తుంది.
సులభమైన ఫుడ్ ఐటెమ్స్ తయారు చేయడం
పిల్లలకు గ్యాస్ ఉపయోగించకుండా సులభమైన వంటలు నేర్పాలి. సాండ్‌విచ్‌లు లేదా సలాడ్లు తయారు చేయడం మంచి ఎంపిక. ఇవి పిల్లల్లో స్వతంత్రతను పెంచుతాయి. ఇంట్లో భోజనం తయారీలో పరిశుభ్రత కూడా నేర్పాలి. ఇది అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది.
మీ పిల్లాడు కూడా క్లాస్ టాపర్ కాగలడు.. చదువు పట్ల ఆసక్తి కలిగించే టిప్స్
వాటర్ బాటిల్స్ నింపడం
పిల్లలు వాటర్ బాటిల్స్ నింపడం నేర్చుకోవాలి. వాటిని ఫ్రిజ్‌లో సరిగా పెట్టడం కూడా తెలుసుకోవాలి. ఇలాంటి చిన్న పనులు బాధ్యతను పెంచుతాయి. పిల్లలు ఇంటి పనుల్లో పాల్గొనడం వల్ల ఆనందంగా భావిస్తారు. తల్లిదండ్రులు ప్రేమగా ప్రోత్సహించాలి.
పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లు నేర్పించడం అవసరం. ఈ అలవాట్లు భవిష్యత్తులో స్వతంత్రంగా ఉండేందుకు సహాయపడతాయి. రోజువారీ చిన్న పనులు క్రమశిక్షణను పెంచుతాయి.
తల్లిదండ్రుల ప్రోత్సాహం పిల్లలకు చాలా అవసరం. మంచి అలవాట్లు పిల్లల భవిష్యత్తును బలంగా మారుస్తాయి.

