Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈ ఏడాది ఓటీటీలో అదరగొడుతున్న వెబ్ సిరీస్ లు.. వీకెండ్ లో చూస్తే మాజానే వేరు

ఈ ఏడాది ఓటీటీలో అదరగొడుతున్న వెబ్ సిరీస్ లు.. వీకెండ్ లో చూస్తే మాజానే వేరు

Big TV Live 4 months ago

2026 Web Series on OTT : ప్రతి సంవత్సరం వందలాది కొత్త సిరీస్‌లు వస్తున్నాయి. ఏది చూడాలో, ఏది స్కిప్ చేయాలో నిర్ణయించడం చాలా కష్టం. 2026 సంవత్సరం సగం కూడా పూర్తి కాకముందే ఎన్నో హిట్ సిరీస్‌లు వచ్చేశాయి.

సమయం వృథా చేసుకోకుండా, నిజంగా బాగున్నవి మాత్రమే చూడాలంటే ఈ ఏడు సిరీస్ లు బెస్ట్ సజెషన్.

1. ‘హిస్ అండ్ హెర్స్’ (Netflix)

ఇది 2026 జనవరి 8న రిలీజ్ అయింది. ఆలిస్ ఫీనీ నవల ఆధారంగా తీసిన ఈ మిస్టరీ థ్రిల్లర్‌లో టెస్సా థాంప్సన్ అద్భుతంగా నటించింది. విడాకులు తీసుకున్న భార్య భర్తలు ఒక మర్డర్ కేసులో ఒకరినొకరు సందేహిస్తూ ఇద్దరూ విడివిడిగా దర్యాప్తు చేస్తారు. 6 ఎపిసోడ్లు మాత్రమే ఉన్నాయి. వీకెండ్ లో ఒక్కసారి పూర్తి చేసేసుకోవచ్చు. సస్పెన్స్, ట్విస్టులతో ఇది క్రేజీగా ఉంటుంది.

2. ‘ది ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ రెగ్గీ డింకిన్స్’ (NBC)

2026 ఫిబ్రవరిలో వచ్చిన ఈ స్పోర్ట్స్ మాక్‌డాక్యుమెంటరీ కామెడీలో ట్రేసీ మోర్గాన్ యాక్టింగ్ సూపర్. డిస్‌గ్రేస్ అయిన ఫుట్‌బాల్ ప్లేయర్ రెగ్గీ డింకిన్స్ తన లైఫ్‌ను తిరిగి బిల్డ్ చేసుకోవడం గురించి కథ ఉంటుంది. ఇందులో డేనియల్ రాడ్‌క్లిఫ్, మేగాన్ థీ స్టాలియన్ వంటి స్టార్లు కూడా ఉన్నారు. రాటెన్ టొమాటోస్‌లో 100% స్కోర్ తో నవ్వులు, ఎమోషన్ తో ఆకట్టుకుంటున్నాయి. రెండూ ఉన్నాయి.

3. ‘పోనీస్’ (Peacock)

జనవరి 15, 2026న రిలీజ్. ఎమిలియా క్లార్క్, హేలీ లూ రిచర్డ్‌సన్ నటించిన స్పై థ్రిల్లర్. భర్తలు చనిపోయిన తర్వాత ఇద్దరు సాధారణ మహిళలు CIA సెక్రటరీలుగా మారి స్పైలుగా మారడం గురించి. సీరియస్ స్పై డ్రామాల మధ్య హాస్యం కూడా ఉండే ఫన్ సిరీస్. కెమిస్ట్రీ బాగుంది.

4. ‘గర్ల్ టేకెన్’ (Paramount+)

2026 జనవరి 8, వచ్చింది. ఐదేళ్లు బంధీగా ఉండి, తప్పించుకున్న యువతి జీవితం ఎలా మారింది అనేది హృదయవిదారకంగా చూపించే డ్రామా ఇది. ఇందులో ఆల్ఫీ అలెన్ నటన భయపెట్టేస్తుంది. స్లో బర్న్ సస్పెన్స్, ఎమోషనల్ డెప్త్ ఉన్న సిరీస్.

5. ‘మార్గోస్ గాట్ మనీ ట్రబుల్స్’

20 ఏళ్ల యువతి తన ప్రొఫెసర్‌తో అఫైర్, గర్భం, ఇంటి నుంచి బయటకు వెళ్లడం, ఆ తర్వాత ఆన్‌లైన్ లో డబ్బు సంపాదించడంతో కథ సాగుతుంది. నిషిద్ధమైన కథ అయినా బ్యాలెన్స్ గా ఉంది. రాటెన్ టొమాటోస్‌లో 97% స్కోర్ కూడా పొందింది.

6. ‘వండర్ మ్యాన్’ (Apple TV+)

సూపర్‌హీరో జానర్‌పై వ్యంగ్యంగా తీశారు. అతీంద్రియ శక్తులున్నవాడు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా రాణించడానికి ప్రయత్నించడం గురించిన మెటా-కామెడీ ఇది. ఓటీటీలో ఆకట్టుకునే సిరీస్ కూడా .

7. ‘రన్ అవే’ (Netflix)

జేమ్స్ నెస్‌బిట్ నటించిన థ్రిల్లర్. మత్తుపదార్థాల వ్యసనంతో బాధపడుతున్న కూతురి కోసం తండ్రి అండర్‌వరల్డ్‌లోకి వెళ్లడం గురించి. ఎమోషనల్, ఉత్కంఠభరితమైన మిస్టరీ.ఈ సిరీస్‌లు 2026లో నిజంగా మంచి వినోదం ఇచ్చాయి. మీకు ఏ జానర్ ఇష్టమో దాని ప్రకారం వీకెండ్ ప్లాన్ చేసుకోండి.

Read Also : శాప గ్రస్త అడవిలో ఒంటరి మహిళ… ఓటీటీని వణికిస్తున్న హారర్ థ్రిల్లర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live