Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈ పొగ పీలిస్తే పోతారు. 'ట్రైన్ టు బుసాన్' డైరెక్టర్ నుంచి వచ్చిన మరో మాస్టర్ పీస్

ఈ పొగ పీలిస్తే పోతారు. 'ట్రైన్ టు బుసాన్' డైరెక్టర్ నుంచి వచ్చిన మరో మాస్టర్ పీస్

Big TV Live 1 week ago

Sci fi Crime Thriller : పొగ ఎక్కువగా పీలిస్తే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ తనను నాశనం చేసిన వారిని ఓ మనిషి ఆవిరిగా మారి, విషవాయువు రూపంలో శత్రువులను నాశనం చేస్తే ఎలా ఉంటుంది ?

మామూలుగా అయితే ఇదేమీ సాధ్యం అయ్యే పని కాదు. కానీ ‘హ్యూమన్ వేపర్’ (Human Vapor) అనే సినిమాలో దాన్ని నిజం చేసి చూపించారు. వాయువుగా మారి సమాజంపై పగ తీర్చుకునే వ్యక్తి థ్రిల్లింగ్ కథ ఇది. 2026 జూలై 2న ఓటీటీ విడుదలై భారీ సంచలనం సృష్టించిన ఈ జపనీస్ సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను… 1960లో వచ్చిన క్లాసిక్ జపనీస్ సినిమా ఆధారంగా, ‘ట్రైన్ టు బుసాన్’ దర్శకుడు యాన్ సాంగ్-హో రూపొందించారు. ఈ 8 ఎపిసోడ్ ల సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? తెలుగులో చూడొచ్చా ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

సిరీస్ ఒక షాకింగ్ లైవ్ టీవీ హత్యతో మొదలవుతుంది. ప్రముఖ సైన్స్ ప్రొఫెసర్ లైవ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటాడు. అంతలోనే వింత పొగ (వేపర్) స్టూడియోలో ఆవరిస్తుంది. లైవ్ లో అందరూ చూస్తుండగానే ఆ ప్రొఫెసర్ శరీరం ఒక్కసారిగా ఉబ్బి పేలిపోతుంది. ఈ దారుణాన్ని చేసిన వ్యక్తి తనను తాను “హ్యూమన్ వేపర్” అని ప్రకటించుకుంటాడు. అతను వాయువుగా మారి ఏ గోడలనైనా, అడ్డంకులనైనా సులభంగా దాటగలడని, ఇకపై వరుస హత్యలు చేయబోతున్నానని పోలీసులకు సవాల్ విసురుతాడు. ఈ అసాధారణ కేసును పరిష్కరించడానికి సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ డిటెక్టివ్ కెంజీ ఒకమోటో రంగంలోకి దిగుతాడు.

ఆ లైవ్ హత్యను కళ్లారా చూసిన ధైర్యవంతురాలైన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ క్యోకో కోనో ఇన్వెస్టిగేషన్ లో డిటెక్టివ్ కి తోడుగా వస్తుంది. హ్యూమన్ వేపర్ ప్రముఖులను ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తుండటంతో దేశవ్యాప్తంగా భయాందోళనలు పట్టుకుంటాయి. ఈ క్రమంలోనే ఓ షాకింగ్ విషయం బయట పడుతుంది. కెంజీ, క్యోకో దర్యాప్తులో గతంలో ఒక ఉల్క భూమిపై పడుతుంది. దాని వ్యర్థాలను క్లియర్ చేయడానికి “వైట్ సెంటర్” అనే నకిలీ స్వచ్ఛంద సంస్థ ముందుకొస్తుంది.

ఆ సంస్థ పేదలు, అనాథలను ఉపయోగించి రహస్యంగా ప్రయోగాలు చేసి ఉంటుంది. ఆ ప్రయోగాల్లో రెన్ అనే అమాయకుడి శరీరం పూర్తిగా నాశనమై, అతను విషవాయువుగా మారే భయంకర శక్తిని పొందాడు. ఇక్కడే కథలో ఊహించని ట్విస్ట్ వస్తుంది. రెన్ ఈ హత్యలు తన స్వంత నిర్ణయంతో చేయడం లేదు. చిన్నతనంలో అనాథగా ఉన్న క్యోకోను రెన్ తండ్రిలా చేరదీసి పెంచాడు. వైట్ సెంటర్ కుట్రలో పాల్గొన్న అధికారుల జాబితాను క్యోకోనే రెన్‌కు ఇచ్చి, ఈ పగ తీర్చుకోవడానికి ఆయుధంగా వాడుకుంటోంది.

మరోవైపు గవర్నర్ మియురా హ్యూమన్ వేపర్ శక్తులను తన స్వార్థం కోసం వాడుకోవాలని ప్రయత్నిస్తాడు. మరి రెన్ శత్రువుల పని ఎలా పట్టాడు ? చివరికి అతన్ని బంధించగలిగారా ? బుర్ర బద్దలయ్యే ఆ క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి ? అన్నది చూసి తెలుసుకోవలసిన స్టోరీ. ఇక ‘హ్యూమన్ వేపర్’ ఇప్పుడు Netflixలో అందుబాటులో ఉంది. గుడ్ న్యూస్.ఏంటంటే ఈ సిరీస్ తెలుగులోనూ ఉంది.

కళ్ల ముందే గ్యాంగ్‌స్టర్‌తో భార్య బాగోతం… ఈ కొరియన్ సిరీస్ ను చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live