Best Thriller Movies on OTT : ఊహకు అందని మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో కొన్ని హాలీవుడ్ థ్రిల్లర్స్ క్రేజీగా ఉంటాయి. సినిమా చూస్తున్నంత సేపు ఒకలా అనిపించి, క్లైమాక్స్‌లో వచ్చే ఒక్క ట్విస్ట్‌తో బుర్ర పాడైపోయేలా చేసే ఇలాంటి చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఎక్కువ.
స్క్రీన్ ముందే కూర్చున్నా అర్థం కాక తల పట్టుకునేలా చేసే ఆరు బెస్ట్ మైండ్ బెండింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. గాన్ గర్ల్ (Gone Girl – 2014)
తమ ఐదవ పెళ్లి రోజున భార్య అమీ అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది. మీడియా, పోలీసులు అందరూ భర్త నిక్ వైపే అనుమానంగా చూస్తారు. అతను నిజంగానే చంపాడా? లేదా దీని వెనుక వేరే కథ ఉందా? అనే కోణంలో సాగే ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌లో ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్టులు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఇది అందుబాటులో ఉంది.
2. ప్రిజనర్స్ (Prisoners – 2013)
థాంక్స్ గివింగ్ పండుగ రోజు ఇద్దరు చిన్న పిల్లలు కిడ్నాప్ అవుతారు. పోలీస్ డిటెక్టివ్ లోకీ ఒకరిని అనుమానించి వదిలేస్తాడు. అయితే ఆ తండ్రి కెల్లర్ డోవర్ ఆ అనుమానితుడిని తానే బంధించి నిజం రాబట్టాలని చూస్తాడు. అసలు కిడ్నాపర్ ఎవరు అనే సస్పెన్స్, చివరి 10 నిమిషాల క్లైమాక్స్ మిమ్మల్ని సీటు అంచున కూర్చోబెడతాయి. నెట్‌ఫ్లిక్స్ (Netflix), లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play)లో ఇది అందుబాటులో ఉంది.
3. ది ప్రెస్టీజ్ (The Prestige – 2006)
క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇద్దరు మేజిషియన్ల మధ్య సాగే పోటీ కథ. ఒకరిని మించి మరొకరు గొప్ప మ్యాజిక్ ట్రిక్ చేయాలనే కసితో వాళ్ళ జీవితాలను ఎలా నాశనం చేసుకున్నారు? అనేదే సినిమా. ఈ సినిమాలో ‘ది ట్రాన్స్‌పోర్టెడ్ మ్యాన్’ అనే ట్రిక్ వెనుక ఉన్న అసలు నిజం తెలిస్తే మీ ఊహకు కూడా అస్సలు అందదు. జియో సినిమా (Jio hotstar), యాపిల్ టీవీలో ఇది అందుబాటులో ఉంది.
4. ఓల్డ్‌బాయ్ (Oldboy – 2003)
ఇది ఒక కొరియన్ మాస్టర్‌పీస్ రివెంజ్ థ్రిల్లర్. ఒక వ్యక్తిని ఎవరో కిడ్నాప్ చేసి, 15 ఏళ్ల పాటు ఒక గదిలో బంధిస్తారు. హఠాత్తుగా ఒకరోజు అతన్ని వదిలేస్తారు. నన్ను ఎందుకు బంధించారు? అని అతను వెతకడం ప్రారంభిస్తాడు. సినిమా చివర్లో వచ్చే ఆ రివెంజ్ ట్విస్ట్ సినిమా చరిత్రలోనే అత్యంత షాకింగ్ క్లైమాక్స్‌గా నిలిచింది. అమెజాన్ ప్రైమ్ వీడియో / యాపిల్ టీవీలో ఇది రెంట్ కు అందుబాటులో ఉంది.
5. ది యూజువల్ సస్పెక్ట్స్ (The Usual Suspects – 1995)
ఒక ఓడలో జరిగిన భారీ పేలుడుతో కథ మొదలవుతుంది. దాని నుండి ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్క దొంగ పోలీసులకు కథ చెప్తుంటాడు. అసలు ఈ క్రైమ్ వెనుక ఉన్న అంతర్జాతీయ మాఫియా డాన్ ‘కైజర్ సోజ్’ ఎవరు? అనేదే మిస్టరీ. సినిమా చివరి సీన్ లో వచ్చే ఆ 5 సెకన్ల షాట్ థ్రిల్లర్ సినిమాల్లోనే ఒక బెంచ్‌మార్క్. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది అద్దెకు అందుబాటులో ఉంది.
6. ది సిక్స్త్ సెన్స్ (The Sixth Sense – 1999)
చనిపోయిన ఆత్మలు కనిపిస్తున్నాయని భయపడే ఒక చిన్న పిల్లాడికి, ఒక చైల్డ్ సైకాలజిస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం ప్రారంభిస్తాడు. వీరిద్దరి మధ్య సాగే సంభాషణలు, హారర్ ఎలిమెంట్స్ ఒక ఎత్తైతే, క్లైమాక్స్‌లో డైరెక్టర్ ఇచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ హాలీవుడ్ చరిత్రలోనే మోస్ట్ ఫేమస్ ట్విస్ట్‌గా నిలిచింది. ఈ మాస్టర్ పీస్ jio Hotstarలో ఇది అందుబాటులో ఉంది. వీకెండ్ లో వీటీలో ఒక్కటి చూసినా చిల్ ఐపోతారు.
Read Also : మనుషులని మాయం చేసే బ్లాక్ మ్యాజిక్… కల్లోనూ వెంటాడే హర్రర్ సీన్లున్న మూవీ

